అమరావతి: టీడీపీ దివంగత నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 19వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఘన నివాళులర్పించింది. బుధవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహా పలువురు నాయకులు పరిటాల రవి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ…హత్యారాజకీయాల్లో ఆరితేరిన ఈ నాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కుట్రల వల్ల పరిటాల రవి హత్య కావించబడ్డాడు. ఎందరో యువకుల త్యాగం ఫలితంగా తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుంది. పార్టీ కోసం పోరాడిన కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ రక్షణగా ఉంటుంది. కేసులు నుంచి తప్పించుకు తిరగటం జగన్ రెడ్డికి సహజమైపోయింది. ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకోవటం కోసం పోలిస్ యంత్రాగాన్ని దుర్వినియోగం చేసున్న రాక్షస ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు వేపాడ చిరంజీవి, మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, కూన రవికుమార్, మాజీ మేయర్లు పంతం రజిని శేషుకుమారి, కోనేరు శ్రీధర్, పార్టీ నాయకులు కొత్త నాగేంద్రబాబు, ఏవీ రమణ, పరుచూరి కృష్ణ, శంకర్ నాయుడు, పార్టీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు తదితరలు పాల్గొన్నారు.