కడప: ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అంటూ చెప్పిన మాట ఏమైంది జగన్ రెడ్డి అని కడప పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు పుత్తా ఎల్లారెడ్డి ప్రశ్నించారు. తెలుగు యువత ఆధ్వర్యంలో కడప పాత బస్టాండ్ సర్కిల్ నుంచి 7 రోడ్స్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. జాబ్ ఏదీ జగన్ రెడ్డి అని నినాదాలు చేశారు. 2 లక్షల 30 వేల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో తెలుగు యువత నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
ఈ కార్యక్రమంలో కడప పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అక్కులుగారి విజయకుమార్ రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జియావుద్దీన్, ఐటీడీపి కడప పార్లమెంటు ప్రధాన కార్యదర్శి నరసింహ, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు కేకే చౌదరి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాటి అమర్నాథరెడ్డి, కడప పార్లమెంటు అధికార ప్రతినిధి నెట్లపల్లి శివరాం, కడప పార్లమెంటు తెలుగు యువత కార్యదర్శి యమ్మనూరు ఆంజనేయులు, కడప నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, కడప పార్లమెంటు తెలుగు యువత నాయకులు, తదితరులు పాల్గొన్నారు.