- అర్హత సాధించిన వారికి మంత్రి లోకేష్ శుభాకాంక్షలు
- యువత, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టీకరణ
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలైలో నిర్వహించిన టెట్ -2024 ఫలితాలను సోమవారం విడుదల చేశామన్నారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది హాజరుకాగా, అందులో 1,87,256 (50.79 శాతం) మంది అర్హత సాధించారని తెలిపారు. ఫలితాలను (https://cse.ap.gov.in) ద్వారా తెలుసుకోవచ్చునన్నారు. నిరుద్యోగ టీచర్లకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. టెట్‌లో అర్హత సాధించిన వారందరికీ మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ నిర్వహించారు. నిజానికి ఈ నెల 2నే ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా తుది కీ వెల్లడిలో ఆలస్యం కారణంగా సోమవారం విడుదల చేశారు. టెట్‌కు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది పరీక్ష రాశారు. 58,639 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. త్వరలోనే 16,347 పోస్టులతో మెగాడీఎస్సీ నోటిఫికేషన్‌ను సర్కార్ జారీ చేయనున్న నేపథ్యంలో టెట్ ఫలితాలపై అభ్యర్థుల్లో ఆసక్తి పెరిగింది. టెట్‌లో అర్హత సాధించినవారికి డీఎస్సీలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
కాగా అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే కింద తెలిపిన ఏపీ టెట్ హెల్ప్ డెస్క్ నంబర్లకు ఉదయం 11.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల మధ్యలో ఫోన్ చేసి వారి నివృత్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
9398810958, 7995649286, 6281704160, 7995789286, 8121947387, 9505619127, 8125046997, 9963069286, 9398822554, 9398822618