- ముఖ్యంగా మహిళల పోరాటం నా మనసులో ఎప్పటికీ ఉండిపోతుంది
- ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు మాకు అండగా ఉన్నారు
- అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
- డిజిటల్ క్యాలెండర్ను ఆవిష్కరించిన భువనేశ్వరి
హైదరాబాద్: కొత్త ఏడాదిలో ప్రజలు అనుకున్న లక్ష్యాలను సాధించాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. చిరునవ్వుతో రోజును ప్రారంభిస్తే లక్ష్యాన్ని సులువుగా సాధించవచ్చునన్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం డిజిటల్ క్యాలెండర్ను భువ నేశ్వరి ఆవిష్కరించారు. అంతకు ముందు భువనేశ్వరికి ఎన్టీఆర్ భవన్ సిబ్బంది నూత న సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అక్ర మ కేసులో అరెస్టయిన చంద్రబాబు కోసం 53రోజులు పాటు నిలబడిన తెలుగు ప్రజ లకు కృతజ్ఞతలు చెప్పారు. కేసులకు బయ పడకుండా ప్రజలు బయటకు వచ్చి తమ కు అండగా నిలబడ్డారన్నారు. ముఖ్యంగా చంద్రబాబు కోసం గట్టిగా పోరాడిన మహిళలు తన మనస్సులో ఎప్పటికీ ఉండి పోతారన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు చంద్రబాబుకు సంఫీుభావం తెలిపారు. ఆయన కోసం రోడ్లపైకి వచ్చారు. నూతన ఏడాదిలో అందరూ సంతోషంగా ఉండాలని భువనేశ్వరి ఆకాంక్షించారు.