- విశాఖలో అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్, 8 స్క్రీన్ల ఐమాక్స్
- విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్ట్‌లు
- రాష్ట్రంలో ఆహార శుద్ధి కేంద్రాలు, లాజిస్టిక్ హబ్‌లు నిర్మిస్తాం
- లులు సంస్థ చైర్మన్ యూసఫ్ అలీ వెల్లడి
అమరావతి (చైతన్యరథం) : ‘లులు’ సంస్థను ఏపీకి ఆహ్వానించినందుకు సీఎం చంద్రబాబుకు ఆ సంస్థ చైర్మన్ యూసుఫ్ అలీ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబుతో 18 ఏళ్ల అనుబంధం ఉన్నట్లు గుర్తు చేసుకున్నారు. ఆయనతో శనివారం జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయయని అన్నారు. విశాఖలో అంతర్జాతీయస్థాయి షాపింగ్ మాల్ నిర్మిస్తామన్నారు. షాపింగ్ మాల్లో 8 స్క్రీన్లతో ఐమాక్స్ మల్టీప్లెక్స్ నిర్మిస్తాం. విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్ట్‌లు నిర్మిస్తాం. ఏపీలో ఆధునిక ఆహారశుద్ధి కేంద్రాలు, లాజిస్టిక్ హబ్‌లు నిర్మిస్తాం’’ అని ఎక్స్ వేదిగా యూసఫ్ అలీ వెల్లడిరచారు. ఏపీ సీఎం చంద్రబాబును లులూ గ్రూప్ అధినేత యూసుఫ్ అలీ శనివారం అమరావతిలో కలిసిన సంగతి తెలిసిందే. లులూ మళ్లీ వస్తోందంటూ సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు ఎక్స్‌లో ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబును కలవడంపై యూసుఫ్ అలీ ఆదివారం సోషల్ మీడియా ద్వారా స్పందించారు.