అమరావతి : ఇప్పటికే పరదాలు, బారికేడ్ల మధ్య పర్యటనలకు వెళుతున్న ముఖ్యమంత్రి.. నల్లరంగు లో ఉన్నాయని తన సభకు వచ్చిన మహిళల చున్నీలు కూడా తీయిం చి వేయడం దారుణమని తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర బాబునాయుడు మండిపడ్డారు. దీనిపై ఆయన ట్విట్టర్లో స్పందిస్తూ బురఖాలు వేసుకున్న ముస్లిం మహిళలను సభలోకి రానివ్వరా? గొడుగులు చూసి కూడా ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఇదంతా పోలీసు భద్రత కాదు.. జగన్రెడ్డి అభద్రత అని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. నర్సాపురం ముఖ్యమంత్రి సభలో మహిళల చున్నీలను పోలీసులు స్వాధీనం చేసుకొని పక్కనపడేస్తూ ‘‘నల్లదుస్తులతో వస్తే అనుమతి లేదు’’ అనే శీర్షికన పత్రికల్లో ప్రచురితమైన వార్తను చంద్రబాబు నాయుడు ట్యాగ్ చేశారు.