అమరావతి(చైన్యరథం): సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో పట్ల ఏపీ పోలీస్ విభాగం స్పందించింది. ఆ వీడియోలో కొందరు వ్యక్తులు డ్యాన్స్ చేస్తుండడం కనిపిస్తోంది. ఆ వీడియోను తిరుమలలో తీశారని, పవిత్ర క్షేత్రానికి అపచారం అంటూ ఈ వీడియోను వైరల్ చేస్తుండడంపై ఏపీ పోలీస్ స్పష్టత ఇచ్చింది. ఇది ఫేక్ వీడియో అని పేర్కొంది. ఇది విజయవాడలో జరిగిన పుట్టినరోజు కార్యక్రమంలో చిత్రీకరించిన వీడియో అని వెల్లడిరచింది. ఈ వీడియోను తిరుమలలో చిత్రీకరించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించింది. దివ్యమైన తిరుమల పవిత్రతను కించపరిచేలా ఫేక్ వీడియోలు పోస్ట్ చేయడం నేరం అని, సంబంధిత సెక్షన్ల కింద తీవ్రస్థాయిలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.