- కలియుగ దైవం పవిత్రత దెబ్బతీసిన జగన్రెడ్డి
- పాలు సేకరించకుండా నెయ్యి ఎక్కడి నుండి తెచ్చారు
- హైందవ సంప్రదాయాలను అవమానించిన జగన్ డ్డిని ప్రజలు క్షమించరు
- మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరిక
అమరావతి (చైతన్యరథం ఒక్క లీటర్ పాలుకూడా సేకరించని కంపెనీ టీటీడీకి 60లక్షల లీటర్ల నెయ్యి ఏ విధంగా సరఫరా చేసిందో జగన్రెడ్డి సమాధానం చెప్పాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు,ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల యంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. స్వామివారికి సరిపడా నెయ్యి సరఫరా చేయాలంటే రోజుకి 4లక్షల లీటర్ల పాలు అవసరం.. కానీ, అసలు పాలే సేకరించని కంపెనీకి అర్థ ర్లు ఇచ్చి వారిద్వారా హవాలా పద్ధతిలో వైసీపీ నేతల ఖాతాల్లోకి కోట్లాది రూపా యలు ఎలా వచ్చాయో సిట్ నివేదికల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అప్పటి టీడీడీ చైర్మన్ పీఏ అకౌంట్లోకి కోట్లాది రూపాయలు ఎందుకు.. ఎలా… ఎవరి కోసం వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమా ధానం చెప్పకుండా, ఏం జరగలేదు, కల్తీ లేదు.. అని బుకాయించడం సరి కాదు. 2019-24 మధ్య నిబంధనలను సడలించి, పాలు లేకుండానే నెయ్యిని ఎలా సేకరించారో ప్రజలందరికీ తెలుసు. మీ తప్పులను కప్పిపుచ్చు కోవడానికి ఎంత ప్రయత్నించినా. వాస్తవాలు దాగవు.
కేవలం కాగితాల మీద కంపెనీలు సృష్టించి, తక్కువ ధరకే నెయ్యి ఇస్తామన్న కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టి, ఆ ముసుగులో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఎన్.డి.డి.బి ఇచ్చిన నివేదికలో తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో అంతువుల కొవ్వు ఉన్నట్లు స్పష్టంగా తేలింది. సుప్రీంకోర్టు కూడా దీనిపై సీబీఐ అధికారులతోకూడిన సిట్ తో విచారణ జరిపిస్తోంది. జగన్రెడ్డికి హిందూ మతం మీద నమ్మకం లేదు. హైందవ సాంప్రదాయాలపై ఎలాంటి నమ్మకం లేదు. ఎన్.డి.డి.బి నివేదికలో జంతువుల కొవ్వు కలిసిందని తేలితే… దానిపై బుకాయించాలని జగన్రెడ్డి చూస్తున్నారు. ఈ దుర్మార్గానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత
జగన్రెడ్డిపై ఉందని మంత్రి కొల్లు డిమాండ్ చేశారు.
హిందూ మతంపై నమ్మకంలేని జగన్
తిరుమల దేవాలయానికి ఇతర మతస్తులు వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలనే నియమం ఉంది. దేశ ప్రధాని, రాష్ట్రపతి, విదేశీ అధ్యక్షులు సైతం గౌరవంగా డిక్లరేషన్ ఇచ్చారు. గతంలో అబ్దుల్ కలాం వెళ్ళినప్పుడు ఇచ్చారు. విదేశీ అధ్యక్షులు వెళ్ళినప్పుడు ఇచ్చారు, సోనియా గాంధీ వెళ్ళినప్పుడు ఇచ్చారు. కానీ జగన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా ఆ డిక్లరేషన్ ఇవ్వలేదు. కానీ జగన్రెడ్డి 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆ నియమాన్ని పాటించలేదు. పైగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిం చేటప్పుడు దంపతులతో కలిసి వెళ్లాలనే సాంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టారు. అంటే వ్యవస్థలపై ఎంతటి నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. డిక్లరేషన్ మీద సంతకం పెడితే, అన్యమతస్థులే అని ఒప్పుకున్నట్టు అవుతుంది కాబట్టి, రాజకీయంగా నష్టం వస్తుందనే ఉద్దేశంతోనే ఐదేళ్లపాటు ఆ డిక్లరేషన్ ఇవ్వకుండా, అక్కడ ఉన్నటువంటి అధికారులును భయపెట్టి లోపలికి వెళ్లారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో తిరుమలలో జరిగిన పాపాల పరిహారం కోసం నేడు ప్రక్షాళన జరుగుతుంటే, దాన్ని రాజకీయం చేయాలని వైసీపీ నేతలుచూస్తున్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చు కోవడానికి కోర్టులకి వెళు న్నారు. కోర్టులు కూడా మొట్టికాయలు వేస్తున్నాయి. ఇప్పటికైనా నిజం ఒప్పుకుని స్వామివారి ముందు క్షమాపణ కోరాలని మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.













