- మూడు పార్టీల సంయుక్త ప్రకటన
- సీట్ల పంపిణీ వివరాలు రెండు రోజుల్లో
- దేశ ప్రగతి, రాష్ట్ర, ప్రజల ఉన్నతి కోసమే పొత్తు
- బీజేపీ, తెదేపాలు గతంలోనూ కలిసి పనిచేశాయి
త్వరలో రాష్ట్రంలో జరగనున్న ఎన్నిక ల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు విష యంలో నెలకొన్న ఉత్కంఠకు శనివారం నాడు తెరపడిరది. తెలుగుదేశం, జనసేన లతో బీజేపీ పొత్తును ఖరారుచేస్తూ మూడు పార్టీల అగ్ర నాయకులు..జెపీ నడ్డా, నారా చంద్రబాబునాయుడు,పవన్‌కల్యాణ్ పేర్లతో నిన్న సాయంత్రం ఒక సంయుక్త ప్రకటన ఢల్లీిలోని బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలైంది. దేశ ప్రగతికోసం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రజల ఉన్నతి కోసం త్వరలో రాష్ట్రంలో జరగనున్న లోక్‌సభ, శాసన సభ ఎన్నికల్లో ఈమూడు పార్టీలు కలసి పోటీ చేయాలని నిర్ణయిం చుకున్నట్లు ప్రకటనలో తెలిపారు. దేశప్రధాని నరేంద్రమోదీ ప్రగతిశీల, దార్శనికతతో కూడిన నాయకత్వంలో ఈ మేరకు కూట మిగా ఏర్పడినట్లు వివరించారు. ప్రధాని మోదీ గతపదేళ్లుగా దేశ అభి వృద్ధికోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారని,
ఈ నేపథ్యంలో తెదేపా, జనసేనల తో చేతులు కలపటం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశయాలను సాకారం చేయటా నికి సహక రిస్తుందని ముగ్గురు నాయకులు ప్రకటనలో తెలిపారు.
గతంలో బీజేపీ, తెదేపాల పొత్తు
బీజేపీ,తెదేపాల పాత పొత్తును గుర్తు చేస్తూ.. 1996లో ఎన్డీయేలో చేరిన తెదేపా అటల్ బిహారీ వాజ్‌పేయి, నరేం ద్ర మోదీ ప్రభుత్వాలలో బీజేపీతో కలిసి సమష్టిగా కృషి చేసి మంచి ఫలితాలను సాధించిందని వివ రించారు. 2014 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పనిచేయటాన్ని, జనసేన పార్టీ మద్దతు ఇవ్వటాన్ని గుర్తు చేసుకున్నారు.
సీట్ల పంపిణీ వివరాలు త్వరలో
సీట్ల పంపిణీ గురించి ఒకటి, రెండు రోజుల్లో చర్చలు జరుపుతామని.. ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయపూర్వక మద్దతుతో ఈ మూడు పార్టీల కూటమి ప్రజల ఆశయాలు, అంచనాల మేరకు పనిచేయగలదని ఆశిస్తున్నామని ముగ్గురు నాయకులు అన్నారు. ఇలాఉంటే పొత్తు విషయమై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, చంద్రబాబు, పవన్ గురు వారం రాత్రి దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. అనంతరం శనివారం ఉదయం ఈ నలుగురు నేతలు అమిత్‌షా నివాసంలోనే మరోసారి సమావేశమై మాట్లాడుకున్నారు. ఈ చర్చలు ఫలించి, పొత్తు కుదిరినట్లుగా మూడు పార్టీల పేరుతో సంయుక్త ప్రకటన వెలువడిరది.