- జగన్ ప్రభుత్వం రద్దుచేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తాం
- ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దళితుల సంక్షేమం కోసమే ఖర్చుచేస్తాం
- సైకో సీఎం పాలనలో దళితులపై పెరిగిన దాడులు, ప్రశ్నించే గళాలపై ఉక్కుపాదం
- జనసేన ` టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేస్తాం
- అధికారంలోకి వచ్చాక డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసును సీబీఐకి అప్పగిస్తాం
- దళిత గళం ముఖాముఖి సమావేశంలో యువనేత నారా లోకేష్
పిఠాపురం: వైసీపీ అహంకార ప్రభుత్వం పోయి…దళితుల ఆత్మగౌరవం గెలవాలన్నదే మా లక్ష్యం, మరో 3 నెలల్లో రాబోయే టిడిపి-జనసేన ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని చేరుకుంటుందని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం పొన్నాడ శీలంవారిపాకలు గ్రామంలో ఆదావారం నిర్వహించిన దళిత గళం కార్యక్రమంలో లోకేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దళిత నాయకుడు మహాసేన రాజేష్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ… దళిత సోదరుల సమస్యలను నేరుగా తెలుసుకొని, టిడిపి-జనసేన ప్రభుత్వం వచ్చాక ఎలాంటి పథకాలు అమలుచేస్తామో చెప్పడానికే ఈ కార్యక్రమం ఏర్పాటుచేశామన్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో జగన్ ప్రభుత్వం ఆపేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్దరిస్తాం, విదేశీశిద్య, బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్, పిజి ఫీజు రీఎంబర్స్ మెంట్ కార్యక్రమాలతోపాటు ఎస్సీ విద్యార్థులకోసం డిగ్రీ గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేస్తాం. ఎటువంటి మళ్లింపులు లేకుండా చట్టప్రకారం సబ్ ప్లాన్ నిధులను ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికే ఖర్చుచేస్తామన్నారు.
సామాజిక న్యాయం టిడిపితోనే సాధ్యం, నిరుపేద కుటుంబంలో పుట్టిన బాలయోగిని లోక్ సభ స్పీకర్ ను చేసింది తెలుగుదేశం, ఎపి అసెంబ్లీలో ప్రతిభాభారతికి తొలి దళిత మహిళా స్పీకర్ గా అవకాశం కల్పించింది టిడిపి. గత టిడిపి ప్రభుత్వంలో దళితుల సంక్షేమం కోసం రూ.40వేల కోట్లు ఖర్చుచేశాం, రూ.3వేల కోట్లతో భూమి కొనుగోలు పథకాన్ని అమలుచేస్తాం. నేను పంచాయితీరాజ్ మంత్రిగా ఉన్న సమయంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమమైనా దళితుల కాలనీల నుంచే శ్రీకారం చుట్టాం. రోడ్లు, ఎల్ ఇడి లైట్లు తదితర కార్యక్రమాలను చేపట్టాం. టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళిత కాలనీల్లో నివసించే వారందరికీ ఎటువంటి షరతులు లేకుండా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని లోకేష్ చెప్పారు.
పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రానికి అమరావతి రాజధానిగా నిర్ణయించాం, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని నిర్ణయించాం. రాజధాని ప్రాంతంలో అత్యధికంగా దళితులు ఉన్నారు, వారికోసం 5శాతం భూమిని రిజర్వ్ చేశాం, అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవడం వల్లే రాజధానిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. అది అంబేద్కర్ పై చంద్రబాబుకు ఉన్న గౌరవం. నేను సైకో జగన్ లా పరదాలు కట్టుకుని రావాల్సిన పనిలేదు, తప్పుచేయలేదు కాబట్టే దమ్ముగా ప్రజల్లో తిరుగుతున్నా. దాదాపు 3వేల కి.మీ. పాదయాత్ర చేశాను, సుదీర్ఘ పాదయాత్రలో ఒక్కరు కూడా నన్ను ప్రశ్నించలేదు, అదీ తెలుగుదేశం చిత్తశుద్ధి, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను.
2019 ఎన్నికల్లో ఒక్క అవకాశమంటూ ముద్దులు పెట్టి సైకో ఎపి సిఎంగా గెలిచాడు. ఆ సైకో సిఎం అయినప్పటినుంచి దళితులపై దాడులు పెరిగిపోయాయి. దళితులు గొంతెత్తి మాట్లాడే పరిస్థితి లేదు. దళిత సంఘాలను కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడనీయడం లేదు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను వేధించి చంపేశారు, చీరాలలో కోవిద్ సమయంలో మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ను కొట్టి చంపారు, జిడి నెల్లూరు నియోజకవర్గంలో అనితారాణి బట్టలు మార్చుకుంటున్న సమయంలో వీడియో తీసి విడుదల చేశారు. గుంటూరు జిల్లాలో రమ్యను, సిఎం సొంత జిల్లాలో నాగమ్మను హత్యచేస్తే హంతకులపై ఎటువంటి చర్యలు లేవు. తాడిపత్రిలో వైసిపి వేధింపుల వల్ల సిఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు.
నాలుగున్నరేళ్ల వైసిపిపాలనలో 6వేలమంది దళితులపై దాడులు జరిగాయి. నందిగామలో శ్యామ్ కుమార్ పై మూత్రం పోసి అవమానించిన వారిపై చర్యలు లేవు. కాకినాడలో దళిత డ్రైవర్ సుబ్రహణ్యంను కిరాతంగా హత్యచేసి డోర్ డెలీవరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును ముఖ్యమంత్రి వెంటేసుకుని తిరుగుతున్నాడు. అది జగన్ కు దళితులపట్ల ఉన్న చిత్తశుద్ధి. టిడిపి- జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సుబ్రహ్మణ్యం హత్యకేసును సిబిఐకి అప్పగిస్తాం. దళితులకు టిడిపి-జనసేన ప్రభుత్వం అండగా నిలుస్తుంది. దళితుల రక్షణ కోసం ఉద్దేశించి ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ను పకడ్బందీగా అమలుచేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
దళిత గళం ముఖాముఖిలో ప్రశ్నలు
` లోకేష్ సమాధానాలు:
రాజేష్ : టీడీపీ దళితులకు వ్యతిరేకం, చంద్రబాబుకు దళితులు అంటే ఇష్టం ఉండదని ప్రచారం చేస్తున్నారు. ఎస్సీలు మిమ్మల్ని ఓడిరచినా వారికి న్యాయం జరగాలని పోరాడుతున్నారు. ఎందుకు మీకు దళితులంటే అంత అభిమానం.?
లోకేష్ : టీడీపీకి ఒక బలహీనత ఉంది. చేసిన పనిని చెప్పుకోలేం. నేను ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా దళిత కాలనీల నుండే చేపట్టా. దలితుల తరపున పోరాడినందుకు టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసులు పెట్టారు. ఎమ్.ఎస్.రాజు, వంగలపూడి అనితపై అట్రాసిటీ కేసులు పెట్టారు. మాజీమంత్రి జవహర్ ను పోలీస్ స్టేషన్ లో కింద కూర్చోబెట్టి అవమానించారు. ఆనాడు నేను దళిత రైతుల కోసం పోరాడితే నన్ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. రమ్య కుటుంబానికి న్యాయం చేయండని అడిగితే స్టేషన్ కు తీసుకెళ్లారు. దళితుల తరపున అహర్నిశలు పోరాడిరది..పోరాడేది టీడీపీనే. దళితుడిపై దాడి జరిగితే స్పందించింది టీడీపీనే. నెల్లూరు జిల్లాలో ఓ దళితుడికి చెందిన చేపల చెరువును కబ్జా చేస్తే దాన్ని మళ్లీ తిరిగి ఇప్పించాం. మా బలహీనత సరిదిద్దుకోవడానికే ఈ దళిత గళం వినిపిస్తున్నాం.
రాజేష్: విదేశీ విద్య అనే గొప్ప పథకాన్ని చంద్రబాబు ప్రవేశపెట్టారు. దానికి ఎన్టీఆర్, చంద్రబాబు, లేదా మీ పేరో, నీ కొడుకు దేవాన్ష్ పేరో పెట్టకుండా అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టారు. అమరావతిలో 125 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం పెట్టొచ్చుకదా…కానీ అంబేద్కర్ విగ్రహమే ఎందుకు పెట్టాలనుకన్నారు.?
లోకేష్: బలహీన వర్గాల పిల్లలు విదేశాల్లో చదవాలనే ఆలోచనతోనే విదేశీ విద్య పెట్టాం. ఒకరు వెళ్తే వారిద్వారా మరికొందరు వెళ్తారని విదేశీ విద్య తీసుకొచ్చాం. విద్య అందరి హక్కు అని అంబేద్కర్ రాజ్యాంగంలోనే చెప్పారు..అందుకే విదేశ విద్యకు ఆయన పెట్టాం. కానీ సైకో వచ్చాక అంబేద్కర్ పేరు తొలగించి సైకో జగన్ విదేశీ విద్య అని పెట్టుకున్నారు. ఇది అంబేద్కర్ పట్ల చిన్నచూపు కాదా.? రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు..రాజారెడ్డి రాజ్యాంగం అమలువుతోంది. అందుకే బలహీన వర్గాలపై దాడులు జరుగుతున్నాయి. రాజధానిపై అనేక ఆరోపణలు చేశారు. పాలనా సౌలభ్యం కోసమే రాజధాని ఒకచోట పెట్టాం. రాజధాని పెట్టింది ఎస్సీ నియోజకవర్గంలో. రాజధానిలో పేదప్రజల కోసం 5 శాతం భూమిని చంద్రబాబు కేటాయించారు. అంబేద్కర్ ను ఆదర్శంగా చంద్రబాబు తీసుకుంటారు కాబట్టే రాజధానిలో 125 అడుగుతు విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
డాక్టర్ పిల్లా చంద్రం (ఏపీ పాఠశాలల పేరెంట్స్ అసోషియేషన్ అధ్యక్షుడు): దళితులను జగన్ రెడ్డి మోసం చేసినట్లు ఏ సీఎం కూడా మోసం చేయలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జగన్ రద్దు చేసిన పథకాలు మళ్లీ ప్రవేశపెడతారా.? 1983 ఎన్టీఆర్ గురుకులాలు తీసుకొచ్చారు..వీటిల్లో దళిత పిల్లులు బాగా చదువుకుంటున్నారు. దళితులు ఇప్పటికీ కోటా బియ్యం తింటున్నారు. సన్నబియ్యం ఇస్తామని జగన్ ఇవ్వలేదు. సన్నబియ్యం మీరు వచ్చాక అందిస్తారా.?
లోకేష్ : ఈ ప్రభుత్వం దళితులకు ఆపేసిన 27 సంక్షేమ పథకాలు తిరిగి ప్రారంభిస్తాం. విదేశీ విద్య, బెస్ట్ అవెయిల్ బుల్, సబ్ ప్లాన్ లాంటి కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తాం. డిగ్రీ గురుకులాలను దామాషా ప్రకారం ఎక్కడ ఏర్పాటు చేయాలో చూసుకుని ఏర్పాటు చేస్తాం. ఈ ప్రభుత్వం తన్నే దున్నపోతు లాంటింది. పాలిచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వం. ప్రజలంతా ఆలోచించాలి..ఈ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్లు అప్పుల చేసింది. అందుకే విద్యుత్ బిల్లులు, బస్సు ఛార్జీలు, పెట్రోల్, డీజల్, గ్యాస్, నిత్యవసర సరుకుల ధరలు పెంచింది. ఇంటిపన్ను, చెత్తపన్నుతో ప్రజల్ని బాదుతున్నారు. చేసిన అప్పులు తీర్చడానికే ప్రజల ముక్కుపిండుతున్నారు. చంద్రబాబు హయాంలో ఒక్కసారి కూడా ఛార్జీలు పెంచలేదు. మన ప్రభుత్వం రాగానే ఆపేసిన సంక్షేమ పథకాలు తిరిగి ప్రారంభిస్తాం. 5 ఏళ్లలో ఆర్థిక వనరులు సమకూర్చు కుని మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేస్తాం.
చీలి విజయ (దళిత మహిళాశక్తి చైర్ పర్సన్): మీరు మంత్రిగా ఉన్నప్పుడు దళిత కాలనీ నుండే అభివృద్ధి చేశామన్నారు. కానీ ఇప్పుడు మా దళిత కాలనీల్లో ఈ చెత్త సీఎం చెత్త పన్ను కట్టించుకుంటూ మా దళితుల దగ్గర చెత్త వేస్తున్నారు. చెత్తపన్ను కట్టించుకుంటూ చెత్త తీసేయడం లేదు. నవంబర్ 27న జగ్గంపేట మండలం ఏర్పేడులో ఆడుకుంటున్న పిల్లలు అనారోగ్యానికి గురై జీజీహెచ్ లో వైద్యం తీసుకుంటున్నారు. మా దళిత కాలనీలను మీ ప్రభుత్వం వచ్చాక శుభ్రంగా ఉంచుతారా.?
లోకేష్ : ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన చెత్తపన్ను ఎత్తేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. దళితులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ దళిత కాలనీలకు అందిస్తాం.
ఎం.కిరణ్ : ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని కిరణ్ కుమార్ తీసుకొచ్చారు. సబ్ ప్లాన్ నిధులు చంద్రబాబు మా కోసమే ఖర్చు చేశారు. కానీ ఈ ప్రభుత్వం సరిగా ఖర్చే చేయలేదు. అందరికీ ఇచ్చే పథకాలే మాకూ ఇస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మా సబ్ ప్లాన్ నిధులు మాకే ఖర్చు చేస్తారా.?
లోకేష్ : సబ్ ప్లాన్ నిధులు ఎస్సీ, ఎస్టీలకే ఖర్చు చేస్తాం. సబ్ ప్లాన్ నిధులకు చట్టబద్ధత ఉంది..దాన్ని ఈ ప్రభుత్వం ఉల్లంఘించింది. టీడీపీ వచ్చాక పేదరికం నుండి బయటకు వెళ్లేందుకు సబ్ ప్లాన్ నిధులు ఎస్సీ, ఎస్టీలకే ఖర్చు చేస్తాం. నేను సైకో జగన్ లా పరదాలు కట్టుకుని రావాలనుకోవడం లేదు. నేను ఏనాడూ తప్పు చేయలేదు కాబట్టే గర్వంగా ప్రజల ముందుకు వచ్చా. దాదాపు 3,000 కిమీ నడిచా…మీరు మాకు చేసిందేంటని ఎవరూ అడగలేదు. అది టీడీపీ చిత్తశుద్ధి. మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తాం.
సత్యనారాయణ, నూకరత్నం (హత్యకు గురైన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు) : సుబ్రహ్మణ్యంను అనంతబాబు చంపి మా ఇంటికి డెలివరీ చేశారు. ఇప్పటికీ మాకు న్యాయం చేయలేదు. లొంగిపోతామని అనంతబాబు అనుకున్నారు. మీరంతా న్యాయం జరిగే వరకూ మాకు అండగా నిలవాలి. బిడ్డను కోల్పోయి కుమిలిపోతుంటే చంద్రబాబు అండగా ఉన్నారు. మా కొడుకు లేని బాధ తీర్చలేనిది. డబ్బులివ్వాలుంటే రేపు పోతాయి..కానీ నిజాయితీగా నిలబడాలి. తప్పు చేసిన అనంతబాబు ధైర్యంగా బయట తిరుగుతున్నారు.
లోకేష్: సుబ్రహ్మణ్యంను హత్య చేయడమేకాకుండా కుటుంబాన్ని వేధించారు. వారిని లొంగదీయాలని ప్రయత్నించారు. కానీ వీళ్లు గట్టిగా నిలబడి హత్య అని చెప్పాకే కొంచం కేసు ముందుకు వెళ్లింది. మంచి భవిష్యత్తు ఉన్న సుబ్రహ్మణ్యంను అనంతబాబు గంజాయిమత్తులో కొట్టి చంపారు. శవాన్ని కారులో తీసుకొచ్చి ప్రమాదం జరిగిందని చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఆ కుటుంబానికి టీడీపీ అండగా ఉంది. మేము అధికారంలోకి వచ్చాక సుబ్రహ్యణ్యం హత్యపై సీబీఐ విచారణ వేస్తాం. ఇందులో ప్రమేయ మున్న వారిని, అనంతబాబును కాపేండేందుకు ప్రయత్నించిన ఖచ్చితంగా కచ్ఛితంగా శిక్షిస్తాం.
రామ్ జీ, (మాలమహానాడు, కొత్తపల్లి):పాదయాత్ర మొదలుపెట్టాక దళితుల ఇబ్బందులు తెలుసుకున్నారు. జగన్ అధికారంలోకి రావడానికి కారణం దళితులే. మేము ఓట్లేశాక మాకు కొత్తపథాకలు తీసుకురాకుండా ఉన్న పథకాలు తొలగించారు. రిజర్వేషన్లు అమలు చేయడంలేదు. అసైన్డ్ భూమలు స్వాధీనం చేసుకుంటున్నారు. ఎంఎస్‌ఎంఈ రాయితీలు ఇవ్వడం లేదు. జగన్ లా మీరు కూడా మమ్మల్ని వదిలేస్తారా.?
లోకేష్ : 2014లో టీడీపీ రాగానే రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.2వేలు చేశాం. బీమా ఇస్తామని చెప్పకపోయినా అమలు చేశాం. పసుపుకుంకుమ, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశాం. సబ్ ప్లాన్ పక్కాగా అమలు చేశాం. దళిత కాలనీల్లో నివసించేవారికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తాం. ఓనర్ కం డ్రైవర్ గా ఉపాధి కల్పించాం. పనులు చేసుకునేందుకు జీవో కూడా ఇచ్చాం. ప్రభుత్వానికి వాహనాలు అవసరం ఉంటే కార్పొరేషన్ ద్వారా కొన్న వాహనాలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చాం. ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తాం. ఆత్మగౌరవంతో పని చేయాలనే జేసీబీలు ఇచ్చి పనులు కల్పించాం. నేను పాదయాత్ర గంగాధర నెల్లూరులో చేస్తున్నప్పుడు..ఒక యువకుడు వచ్చి నాకు గతంలో 3 లారీలు ఉన్నాయి…ఇప్పుడు డ్రైవర్ గా మారాను అన్నాడు. పేదవాడు పేదవాడుగా ఉండాలనేది ఈ ప్రభుత్వం ఆలోచన. సొంత కాళ్లపై నిలబడాలనేది టీడీపీ ప్రభుత్వ విధానం. తలెత్తుకునేలా ఉండేలా చేసింది టీడీపీనే. ఆ ఆలోచనతోనే చంద్రబాబు విదేశీ విద్య తీసుకొచ్చారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసి పేదరికం లేని రాష్ట్రంగా చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది.
కన్యా నాగభూషణం : జీఎంసీ బాలయోగికి లోక్ సభ స్పీకర్ గా అవకాశం ఇచ్చారు. ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్ చేశారు. 2024లో టీడీపీ వచ్చాక మళ్లీ దళిత శాసనసభ్యులకు ఈ అవకాశం ఇస్తుందా.?
లోకేష్ : దళితులకు గౌరవం ఇచ్చిన పార్టీ టీడీపీనే. దళితుల తరపున పోరాడిన వారిపై ఈ ప్రభుత్వం కేసులు పెడుతోంది. ఎంఎస్.రాజుపై ఈ ప్రభుత్వం దొంగ కేసులు పెడుతోంది. టీడీపీ వచ్చాక మల్లీ దళితులు తలెత్తుకుని బతికేలా చేస్తాం.
తాటి సత్యనారాయణ, రాజోలు : దళితులకు పూర్వం నుండి పడుతున్న అవస్థలు, వివక్షను అరికట్టేందుకు అట్రాసిటీ చట్టం వచ్చింది. కానీ అదే చట్టంతో మాపై కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. దళిత నాయకులపైనా కేసులు పెడుతున్నారు. ఈ రోజుల్లో కూడా మాపై వివక్ష ఇంకా కొనసాగుతోంది. ఉపముఖ్యమంత్రిని జగన్ తన పక్కన కూర్చోనివ్వకుండా నిలబెట్టారు. టీడీపీ ప్రభుత్వంలో అట్రాసిటీ చట్టాన్ని పటిష్టం చేసి రక్షణ కల్పిస్తారా.?
లోకేష్ : చట్టాల్ని అమలు చేసే బాధ్యత టీడీపీదే. హోమంత్రి వనిత దళితులను కాపాడే పరిస్థితి లేదు. ఆమే వెళ్లి దళితున్ని చంపిన అనంతబాబుతో కూర్చుంటున్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామిని కూర్చోనివ్వకుండా నిలబెట్టారు. టీడీపీ ఉన్నప్పుడు అట్రాసిటీ యాక్ట్ చట్టబద్ధంగా అమలు చేశాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 4 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది నిఖార్సుగా అట్రాసిటీ చట్టం అమలు చేస్తాం.
మహాసేన రాజేష్ : బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్ల పథకం ద్వారా దళితుల పిల్లలు మంచి స్కూళ్లో చేర్చితే మీ ప్రభుత్వమే ఫీజులు చెల్లించింది. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ కూడా అందించారు. కానీ జగన్ వచ్చాక స్కూళ్లకు రంగులు వేసుకున్నారు తప్ప ఏమీ చేయలేదు. గురుకులాల వ్యవస్థను ఎన్టీఆర్ తీసుకొచ్చారు.
లోకేష్ : ఎన్టీఆర్ ఎయిడెడ్ స్కూల్లో చదివారు. కానీ ఈ ప్రభుత్వం వాటిని కూడా చంపేసింది. కుటుంబం పేదరికం నుండి బయటకు రావాలంటే చదివించాలని చంద్రబాబు నమ్మారు. దగ్గర్లో ప్రభుత్వ పాఠశాల లేకుంటే ప్రైవేటు స్కూళ్లో చేర్చుకుంటే ఫీజులు చెల్లించాం. కానీ ఈ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. టీడీపీ వచ్చాక బెస్ట్ అవెయిలబుల్, విదేశీ విద్య, పీజీ విద్యార్థులకు పీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తాం.
జనుపల్లి శ్రీనివాస్/కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు : జనుపల్లి శ్రీనివాస్ నా తమ్ముడు. చేయని నేరానికి నా తమ్మున్ని జైల్లో అన్యాయంగా పెట్టారు. శ్రీను దాడి చేశారంటే ఎవరూ నమ్మరు. దాడి జరిగిన తర్వాత మా తరపున న్యాయస్థానంలో పోరాడతానన్న సలీమ్ అనే న్యాయవాదిని ఇబ్బంది పెట్టాలని చూశారు. నాలుగేళ్లు దాటినా దాడిపై జగన్ స్పందించడం లేదు. కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వండంటే జగన్ ఇవ్వలేదు. విశాఖకు చెందిన దళిత నేత వెంకట్రావు మాకు సాయం చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులు ఆయన ఇంటిని చుట్టిముట్టారు. కూలీ పనులకు వెళ్లి వచ్చిన డబ్బులతో శ్రీను జగన్ కు ప్లెక్సీ వేయించాడు..ఆ విశ్వాసం కూడా జగన్ కు లేదు.
లోకేష్ : ఎన్నికల ముందు శ్రీను చేతికి కోడికత్తి నేను ఇచ్చి జగన్ పై హత్యాయత్నం చేయించానని ప్రచారం చేశారు. కోడికత్తి డ్రామా, బాబాయ్ గుండెపోటు డ్రామాలు చూశాం. దాడులు చేసింది వాళ్లు..నెపం మాత్రం నాపై పెట్టారు. కేసు వీగిపోయి శ్రీను బయటకురావాలంటే నిమిషం చాలు. కానీ జగన్ కోర్టుకు వెళ్లడు..విచారణకు సహకరించడు. ఏమీలేనిదానికి ఐదేల్లుగా శ్రీను జైల్లో ఉన్నాడు. న్యాయ పోరాటానికి శ్రీను కుటుంబ సభ్యలకు అండగా ఉంటాం.
మెహేమియా : తెలంగాణలో ప్రియాంక రెడ్డి చనిపోతే రాష్ట్రంలో దిశ చట్టం తీసుకొచ్చారు. కానీ రమ్యను చంపారు. పులివెందుల్లో నాగనమ్మను చంపారు. దీనిపై చర్యలు తీసుకోలేదు. దళితులు హింసకు గుర్యారు. నేను వైసీపీ జెండాను మోశాను. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరలు కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యలను బెదిరించారు. వైసీపీపై దళితులంతా యుద్ధం చేస్తారు.
లోకేష్ : నాగమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని పోరాడిన దళిత నేతలపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారు. కనీసం నాగమ్మ కుటుంబం దగ్గరకు వెల్లనీయలేదు. పులివెందుల్లోనే అలాంటి పరిస్థితి ఉందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది. టీడీపీ రాగానే దళితులను ఆదుకుంటాం.
పైడి హర్ష, కావలి : మా అమ్మను సర్పంచ్ గా నిలబెట్టాను. ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కాలేజీలో ఉన్న డ్రైనేజీని మా పొలాల్లోకి వదిలారు. దాని మీద నేను రైతులతో కలిసి ధర్నాలు చేశాం. సర్పంచ్ గా మా అమ్మ నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని బెదిరించారు. పెద్దపెద్ద వాళ్లే మానున్నారు..నీకేంటి అంత తుత్తర అని బెదిరించారు. విత్ డ్రా చేసుకోకపోవటంతో నా లారీలు తిరగనివ్వలేదు. వారానికొక స్టేషన్ కు తిప్పారు. వ్యాపారం లేదు…కిస్తీలు కట్టాలి. నా పెద్ద కూతురుకు బంగారు గొలుసు చేయించా..దాన్ని కుదువపెట్టి కిస్తీ కట్టాను. కుటుంబాన్ని పోషించుకోగలుగుతానా అని బాధతో ఎమ్మెల్యే ఇంటిముందుకు వెళ్లి సెల్ఫీ తీసి గడ్డిమందు తాగాను. నేను బతకనని డాక్టర్లు చెప్పారు. నాకు రూ.30 లక్షలు వైద్యానికి అయింది..నా బిడ్డలను చంద్రబాబు దత్తత తీసుకుని చదివిస్తున్నారు. చలో కావలికి వస్తుంటే ఎం.ఎస్.రాజును 30 గంటల పాటు అడవుల్లో తిప్పారు. మా అమ్మ, నాన్న ఫిర్యాదు చేస్తే తీసుకోలేదు. రాజీ చేయకుంటే మరో కేసు పెడతామని హెచ్చరించారు.
లోకేష్ : దళితులపై జరిగే దాడులపై పోరాడుతున్న ఎం.ఎస్.రాజుపై కేసులు పెట్టి ఈ ప్రభుత్వం వేదిస్తోంది. దళితుల తరుపు మాట్లాడిన వారి గొంతులను నొక్కుతోంది ఈ ప్రభుత్వం. దళితులు కనీసం నామినేషన్ కూడా వేయకూడదంట. గట్టిగా మాట్లాడితే కొట్టి చంపేస్తున్నారు. గొంతు విప్పితే రౌడీషీట్ తెరుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులంతా ఆలోచించాలి. మన గళం విప్పకపోతే ఇంకా చితక్కొట్టి చంపేస్తారు. గళం విప్పి తాడేపల్లి ప్యాలెస్ లో పడుకునే సైకోకు వినిపించేలా నినదించాలి.
కండవల్ల లక్ష్మీ (రాజానగరం): రాజానగరంలో బ్లేడ్ బ్యాచ్, డ్రగ్స్ బ్యాచ్ ఎక్కువగా ఉంది. జక్కంపూడి రాజా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎస్సీలం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మహిళలకు కూడా కుటుంబాలను పోషించుకుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం. మహిళలకు భరోసా ఇచ్చేందుకు ఏదోఒకటి చేయాలి.
లోకేష్ : మహిళలను ఆదుకునేందుకు చంద్రబాబు, పవనన్న కలిసి మహాశక్తి పథకం ప్రవేశపెట్టారు. 18 నుండి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకు చూ.15 వందలు ఇస్తారు. తల్లికి వందనం ద్వారా ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఇస్తాం. నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు మహాశక్తి కార్యక్రమం ప్రవేశపెట్టారు. టీడీపీ ప్రభుత్వం రాగానే ఆడుకుంటాం.
ప్రశ్న : కొడవలి గ్రామంలో వైసీపీ నేతలు మట్టితోలుతున్నారు..అడిగితే కేసులు పెడతున్నారు. చిర్ల జగ్గిరెడ్డి అంబేద్కర్ విగ్రహం పెడతామని పెట్టలేదు..నిధులు మంజూరైనా స్పందించడం లేదు.
లోకేష్ : ఇసుకలో రోజూ రూ.3కోట్లు జగన్ దోచుకుంటున్నారు. ఎవరన్నా అడిగితే దళితులకు గుండు కొట్టిస్తున్నారు. వరప్రసాద్ అనే యువకుడికి స్టేషన్ లో గుండుకొట్టించారు. టీడీపీ వచ్చిన వెంటనే ఆపేసిన 27 పథకాలు ప్రవేశపెడతాం. అట్రాసిటీ కేసును బలోపేతం చేస్తాం. టీడీపీ %–% జనసేన అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామన్నది ప్రతి గడపకు మీరు తీసుకెళ్లాలి.
ఎం.కిరణ్ : ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని కిరణ్ కుమార్ తీసుకొచ్చారు. సబ్ ప్లాన్ నిధులు చంద్రబాబు మా కోసమే ఖర్చు చేశారు. కానీ ఈ ప్రభుత్వం సరిగా ఖర్చే చేయలేదు. అందరికీ ఇచ్చే పథకాలే మాకూ ఇస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మా సబ్ ప్లాన్ నిధులు మాకే ఖర్చు చేస్తారా.?
లోకేష్ : సబ్ ప్లాన్ నిధులు ఎస్సీ, ఎస్టీలకే ఖర్చు చేస్తాం. సబ్ ప్లాన్ నిధులకు చట్టబద్ధత ఉంది..దాన్ని ఈ ప్రభుత్వం ఉల్లంఘించింది. టీడీపీ వచ్చాక పేదరికం నుండి బయటకు వెళ్లేందుకు సబ్ ప్లాన్ నిధులు ఎస్సీ, ఎస్టీలకే ఖర్చు చేస్తాం. నేను సైకో జగన్ లా పరదాలు కట్టుకుని రావాలనుకోవడం లేదు. నేను ఏనాడూ తప్పు చేయలేదు కాబట్టే గర్వంగా ప్రజల ముందుకు వచ్చా. దాదాపు 3,000 కిమీ నడిచా…మీరు మాకు చేసిందేంటని ఎవరూ అడగలేదు. అది టీడీపీ చిత్తశుద్ధి. మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తాం.
రామ్ జీ, (మాలమహానాడు, కొత్తపల్లి):పాదయాత్ర మొదలుపెట్టాక దళితుల ఇబ్బందులు తెలుసుకున్నారు. జగన్ అధికారంలోకి రావడానికి కారణం దళితులే. మేము ఓట్లేశాక మాకు కొత్తపథాకలు తీసుకురాకుండా ఉన్న పథకాలు తొలగించారు. రిజర్వేషన్లు అమలు చేయడంలేదు. అసైన్డ్ భూమలు స్వాధీనం చేసుకుంటున్నారు. ఎంఎస్‌ఎంఈ రాయితీలు ఇవ్వడం లేదు. జగన్ లా మీరు కూడా మమ్మల్ని వదిలేస్తారా.?
లోకేష్ : 2014లో టీడీపీ రాగానే రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.2వేలు చేశాం. బీమా ఇస్తామని చెప్పకపోయినా అమలు చేశాం. పసుపుకుంకుమ, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశాం. సబ్ ప్లాన్ పక్కాగా అమలు చేశాం. దళిత కాలనీల్లో నివసించేవారికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తాం. ఓనర్ కం డ్రైవర్ గా ఉపాధి కల్పించాం. పనులు చేసుకునేందుకు జీవో కూడా ఇచ్చాం. ప్రభుత్వానికి వాహనాలు అవసరం ఉంటే కార్పొరేషన్ ద్వారా కొన్న వాహనాలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చాం. ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తాం. ఆత్మగౌరవంతో పని చేయాలనే జేసీబీలు ఇచ్చి పనులు కల్పించాం. నేను పాదయాత్ర గంగాధర నెల్లూరులో చేస్తున్నప్పుడు..ఒక యువకుడు వచ్చి నాకు గతంలో 3 లారీలు ఉన్నాయి…ఇప్పుడు డ్రైవర్ గా మారాను అన్నాడు. పేదవాడు పేదవాడుగా ఉండాలనేది ఈ ప్రభుత్వం ఆలోచన. సొంత కాళ్లపై నిలబడాలనేది టీడీపీ ప్రభుత్వ విధానం. తలెత్తుకునేలా ఉండేలా చేసింది టీడీపీనే. ఆ ఆలోచనతోనే చంద్రబాబు విదేశీ విద్య తీసుకొచ్చారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసి పేదరికం లేని రాష్ట్రంగా చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది.
కన్యా నాగభూషణం : జీఎంసీ బాలయోగికి లోక్ సభ స్పీకర్ గా అవకాశం ఇచ్చారు. ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్ చేశారు. 2024లో టీడీపీ వచ్చాక మళ్లీ దళిత శాసనసభ్యులకు ఈ అవకాశం ఇస్తుందా.?
లోకేష్ : దళితులకు గౌరవం ఇచ్చిన పార్టీ టీడీపీనే. దళితుల తరపున పోరాడిన వారిపై ఈ ప్రభుత్వం కేసులు పెడుతోంది. ఎంఎస్.రాజుపై ఈ ప్రభుత్వం దొంగ కేసులు పెడుతోంది. టీడీపీ వచ్చాక మల్లీ దళితులు తలెత్తుకుని బతికేలా చేస్తాం.
తాటి సత్యనారాయణ, రాజోలు : దళితులకు పూర్వం నుండి పడుతున్న అవస్థలు, వివక్షను అరికట్టేందుకు అట్రాసిటీ చట్టం వచ్చింది. కానీ అదే చట్టంతో మాపై కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. దళిత నాయకులపైనా కేసులు పెడుతున్నారు. ఈ రోజుల్లో కూడా మాపై వివక్ష ఇంకా కొనసాగుతోంది. ఉపముఖ్యమంత్రిని జగన్ తన పక్కన కూర్చోనివ్వకుండా నిలబెట్టారు. టీడీపీ ప్రభుత్వంలో అట్రాసిటీ చట్టాన్ని పటిష్టం చేసి రక్షణ కల్పిస్తారా.?
లోకేష్ : చట్టాల్ని అమలు చేసే బాధ్యత టీడీపీదే. హోమంత్రి వనిత దళితులను కాపాడే పరిస్థితి లేదు. ఆమే వెళ్లి దళితున్ని చంపిన అనంతబాబుతో కూర్చుంటున్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామిని కూర్చోనివ్వకుండా నిలబెట్టారు. టీడీపీ ఉన్నప్పుడు అట్రాసిటీ యాక్ట్ చట్టబద్ధంగా అమలు చేశాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 4 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది నిఖార్సుగా అట్రాసిటీ చట్టం అమలు చేస్తాం.
మహాసేన రాజేష్ : బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్ల పథకం ద్వారా దళితుల పిల్లలు మంచి స్కూళ్లో చేర్చితే మీ ప్రభుత్వమే ఫీజులు చెల్లించింది. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ కూడా అందించారు. కానీ జగన్ వచ్చాక స్కూళ్లకు రంగులు వేసుకున్నారు తప్ప ఏమీ చేయలేదు. గురుకులాల వ్యవస్థను ఎన్టీఆర్ తీసుకొచ్చారు.
లోకేష్ : ఎన్టీఆర్ ఎయిడెడ్ స్కూల్లో చదివారు. కానీ ఈ ప్రభుత్వం వాటిని కూడా చంపేసింది. కుటుంబం పేదరికం నుండి బయటకు రావాలంటే చదివించాలని చంద్రబాబు నమ్మారు. దగ్గర్లో ప్రభుత్వ పాఠశాల లేకుంటే ప్రైవేటు స్కూళ్లో చేర్చుకుంటే ఫీజులు చెల్లించాం. కానీ ఈ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. టీడీపీ వచ్చాక బెస్ట్ అవెయిలబుల్, విదేశీ విద్య, పీజీ విద్యార్థులకు పీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తాం.
మెహేమియా : తెలంగాణలో ప్రియాంక రెడ్డి చనిపోతే రాష్ట్రంలో దిశ చట్టం తీసుకొచ్చారు. కానీ రమ్యను చంపారు. పులివెందుల్లో నాగనమ్మను చంపారు. దీనిపై చర్యలు తీసుకోలేదు. దళితులు హింసకు గుర్యారు. నేను వైసీపీ జెండాను మోశాను. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరలు కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యలను బెదిరించారు. వైసీపీపై దళితులంతా యుద్ధం చేస్తారు.
లోకేష్ : నాగమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని పోరాడిన దళిత నేతలపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారు. కనీసం నాగమ్మ కుటుంబం దగ్గరకు వెల్లనీయలేదు. పులివెందుల్లోనే అలాంటి పరిస్థితి ఉందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది. టీడీపీ రాగానే దళితులను ఆదుకుంటాం.
పైడి హర్ష, కావలి : మా అమ్మను సర్పంచ్ గా నిలబెట్టాను. ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కాలేజీలో ఉన్న డ్రైనేజీని మా పొలాల్లోకి వదిలారు. దాని మీద నేను రైతులతో కలిసి ధర్నాలు చేశాం. సర్పంచ్ గా మా అమ్మ నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని బెదిరించారు. పెద్దపెద్ద వాళ్లే మానున్నారు..నీకేంటి అంత తుత్తర అని బెదిరించారు. విత్ డ్రా చేసుకోకపోవటంతో నా లారీలు తిరగనివ్వలేదు. వారానికొక స్టేషన్ కు తిప్పారు. వ్యాపారం లేదు…కిస్తీలు కట్టాలి. నా పెద్ద కూతురుకు బంగారు గొలుసు చేయించా..దాన్ని కుదువపెట్టి కిస్తీ కట్టాను. కుటుంబాన్ని పోషించుకోగలుగుతానా అని బాధతో ఎమ్మెల్యే ఇంటిముందుకు వెళ్లి సెల్ఫీ తీసి గడ్డిమందు తాగాను. నేను బతకనని డాక్టర్లు చెప్పారు. నాకు రూ.30 లక్షలు వైద్యానికి అయింది..నా బిడ్డలను చంద్రబాబు దత్తత తీసుకుని చదివిస్తున్నారు. చలో కావలికి వస్తుంటే ఎం.ఎస్.రాజును 30 గంటల పాటు అడవుల్లో తిప్పారు. మా అమ్మ, నాన్న ఫిర్యాదు చేస్తే తీసుకోలేదు. రాజీ చేయకుంటే మరో కేసు పెడతామని హెచ్చరించారు.
లోకేష్ : దళితులపై జరిగే దాడులపై పోరాడుతున్న ఎం.ఎస్.రాజుపై కేసులు పెట్టి ఈ ప్రభుత్వం వేదిస్తోంది. దళితుల తరుపు మాట్లాడిన వారి గొంతులను నొక్కుతోంది ఈ ప్రభుత్వం. దళితులు కనీసం నామినేషన్ కూడా వేయకూడదంట. గట్టిగా మాట్లాడితే కొట్టి చంపేస్తున్నారు. గొంతు విప్పితే రౌడీషీట్ తెరుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులంతా ఆలోచించాలి. మన గళం విప్పకపోతే ఇంకా చితక్కొట్టి చంపేస్తారు. గళం విప్పి తాడేపల్లి ప్యాలెస్ లో పడుకునే సైకోకు వినిపించేలా నినదించాలి.
కండవల్ల లక్ష్మీ (రాజానగరం): రాజానగరంలో బ్లేడ్ బ్యాచ్, డ్రగ్స్ బ్యాచ్ ఎక్కువగా ఉంది. జక్కంపూడి రాజా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎస్సీలం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మహిళలకు కూడా కుటుంబాలను పోషించుకుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం. మహిళలకు భరోసా ఇచ్చేందుకు ఏదోఒకటి చేయాలి.
లోకేష్ : మహిళలను ఆదుకునేందుకు చంద్రబాబు, పవనన్న కలిసి మహాశక్తి పథకం ప్రవేశపెట్టారు. 18 నుండి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకు చూ.15 వందలు ఇస్తారు. తల్లికి వందనం ద్వారా ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఇస్తాం. నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు మహాశక్తి కార్యక్రమం ప్రవేశపెట్టారు. టీడీపీ ప్రభుత్వం రాగానే ఆడుకుంటాం.
ప్రశ్న : కొడవలి గ్రామంలో వైసీపీ నేతలు మట్టితోలుతున్నారు..అడిగితే కేసులు పెడతున్నారు. చిర్ల జగ్గిరెడ్డి అంబేద్కర్ విగ్రహం పెడతామని పెట్టలేదు..నిధులు మంజూరైనా స్పందించడం లేదు.
లోకేష్ : ఇసుకలో రోజూ రూ.3కోట్లు జగన్ దోచుకుంటున్నారు. ఎవరన్నా అడిగితే దళితులకు గుండు కొట్టిస్తున్నారు. వరప్రసాద్ అనే యువకుడికి స్టేషన్ లో గుండుకొట్టించారు. టీడీపీ వచ్చిన వెంటనే ఆపేసిన 27 పథకాలు ప్రవేశపెడతాం. అట్రాసిటీ కేసును బలోపేతం చేస్తాం. టీడీపీ ` జనసేన అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామన్నది ప్రతి గడపకు మీరు తీసుకెళ్లాలి.
సత్యనారాయణ, నూకరత్నం (హత్యకు గురైన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు)
సుబ్రహ్మణ్యంను అనంతబాబు చంపి మా ఇంటికి డెలివరీ చేశారు. ఇప్పటికీ మాకు న్యాయం చేయలేదు. లొంగిపోతామని అనంతబాబు అనుకున్నారు. మీరంతా న్యాయం జరిగే వరకూ మాకు అండగా నిలవాలి. బిడ్డను కోల్పోయి కుమిలిపోతుంటే చంద్రబాబు అండగా ఉన్నారు. మా కొడుకు లేని బాధ తీర్చలేనిది. డబ్బులివ్వాలుంటే రేపు పోతాయి..కానీ నిజాయితీగా నిలబడాలి. తప్పు చేసిన అనంతబాబు ధైర్యంగా బయట తిరుగుతున్నారు.