- ల్యాండ్ మాఫియాకు నాయకుడు జగన్‌రెడ్డి
- రెవెన్యూ సదస్సుల్లో వారి కబ్జాలపై వేల ఫిర్యాదులు
- పేదలను భయపెట్టి భూములు లాక్కున్నారు
- విజయసాయి అవాకులు పేలితే సహించేది లేదు
- ఆయన ఎక్కడుండేది త్వరలో ప్రజలే తేలుస్తారు
- శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనూరాధ
మంగళగిరి(చైతన్యరథం): రెవెన్యూ సదస్సుల్లో వైసీపీ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, భూబకాసురులు వైసీపీ నేతలని శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మె ల్సీ పంచుమర్తి అనూరాధ ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక చంద్రబాబు ప్రజల కష్టాలపై దృష్టి సారించారని పేర్కొన్నారు. వివిధ సమస్యలపై దాదాపు 1.74 లక్షల అర్జీలు వచ్చాయి.. అందులో దాదాపు 68 వేల అర్జీలు భూ అక్రమాలకు సంబంధించినవే..తమ భూములను వైసీపీ నేతలు కబ్జా చేశారని అనేకమంది అర్జీల్లో పేర్కొంటున్నారు. 2019లో గద్దె నెక్కగానే వైసీపీ నాయకులు చేసిన భూ దోపిడీలకు అంతేలేకుండా పోయింది.. పేదలను భయపెట్టి దౌర్జన్యంగా భూముల ను లాక్కున్నారన్నారు. అసైన్డ్ భూములు, ఇనాం, ఫ్రీ హోల్డ్, దేవాదాయ, అటవీ శాఖకు సంబంధించిన ఏ భూములనూ విడిచిపెట్టలేదని మండిపడ్డారు. వైసీపీ హయాంలో గ్రామ గ్రామానికి ల్యాండ్ మాఫియా పాకింది..ఈ ల్యాండ్ మాఫియాకు నాయకుడు జగన్‌రెడ్డి అయితే.. సమన్వయకర్తలు ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎస్.వి.సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, రాయలసీమకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్‌రెడ్డి. అమరావతి, కోస్తా జిల్లాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి. వీరందరూ వీళ్ల అధీనంలో ఉన్న గ్రామాల్లో ల్యాండ్ మాఫియాకు తెగబడ్డారు. వీళ్లతో పాటు ఆనాడు పదవుల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు దోపిడీలకు సహాయ సహకారాలు అందిస్తూ భూ దోపిడీలకు పాల్పడ్డారని తెలిపారు.
కబ్జాల్లో ఆరితేరారు
కాకినాడ పోర్టు దగ్గరలో ఉన్న 4 వేల ఎకరాలను రూ.12 కోట్లకు రాయించుకున్నా రు. అలాగే పెద్దిరెడ్డి, మిధున్‌రెడ్డి రాజాలపల్లిలో దాదాపు వెయ్యి ఎకరాల జమీందారు భూములను కూడా కాజేశారు. భూ అక్రమాలకు సంబంధించిన ఫైల్స్ ఎక్కడ బయట పడతాయోనని మదనపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తగులబెట్టారు. అంతేకాదు పిన్నె ల్లి బ్రదర్స్ రూ.1000 కోట్లకు పైగా విలువైన భూములు కబ్జా చేశారు. ఇంతవరకు వాటికి సంబంధించిన విషయంపై ప్రస్తావన కూడా లేదు. అనంతపురంలో కేతిరెడ్డి బ్రదర్స్, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బ్రదర్స్ వేల ఎకరాలు కబ్జా చేశారు. అంతేకాక వాటితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హీన చరిత్ర వారిదే.. మంత్రులైన సబిత, రోజా, ఉషశ్రీ చరణ్ ల్యాండ్ కబ్జాలకు పాల్పడ్డారు. ఆనాడు 2014-19లో చంద్రబాబు సోలార్ ప్లాంట్ కు వందల ఎకరాల భూములను కేటాయిస్తే వాటిని కూడా కబ్జా చేసిన ఘనత వైసీపీ దొంగల ముఠాదే.. అంతేకాదు ఆన్‌లైన్‌లో రికార్డులు మాయం చేయడం..భూ యజమా నులను బెదిరించి రాయించుకోవడం.. ఏమైనా వివాదంలో భూములు ఉంటే వాటిలో మధ్యవర్తిత్వం వహించి లాక్కోవడం ఈ విధంగా ఎక్కడా వైసీపీ గుండాలు అక్రమాలకు పాల్పడ్డారు. రాష్ట్రమంతా కబ్జాల మయం చేసి నిలువునా ప్రజలను దోచుకోవడమే కాక నేడు నీతులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడూ బయటకు రాని జగన్‌రెడ్డి ఇప్పుడు నీతి నిజాయితీ అంటూ అబద్ధాలతో చిలక పలుకులు పలుకుతూ ప్రెస్‌మీట్‌లు పెట్టడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
ఒక్క విశాఖలో చూసుకుంటే బాక్సైట్‌లు, 22 ఏ భూములు, దసపల్లా భూములు, రుషికొండ భూములు, పంచకర్మ భూములు, క్రమబద్ధీకరణ పేరుతో భూములను కొట్టే యడం.. బోగాపురం ఎయిర్ పోర్టు దగ్గరలో ఉన్న భూములను కబ్జా చేయడం వంటివి కోకొల్లలుగా ఉన్నాయి. వైసీపీ హయాంలో విశాఖ మిగులుతుందా అని ప్రజలు భయపడే స్థాయికి తీసుకువచ్చారు. ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం కూటమి ప్రభుత్వంపై విజయ సాయిరెడ్డి వంటి వాళ్లు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు.. అయినా మీలాంటి ఎక్కడ ఉండాలనేది త్వరలో ప్రజలు తేల్చనున్నారు. ఇలాంటి భూ దురాక్రమణలపై సీఎం చంద్రబాబు స్పందించి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అందులో భాగం గానే రెవెన్యూ సదస్సులు మొదలైన మూడురోజుల్లో 1,102 గ్రామాల్లో జరిగిన సదస్సు ల్లో 20 వేల ఫిర్యాదులు అందాయి.. అంటే వైసీపీ హయాంలో ఏ విధంగా భూ అక్ర మాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు మొద లయ్యాయి. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. త్వరలో ఈ సమస్యలన్నింటిని కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు.