- పేదల బియ్యం పందికొక్కుల్లా బొక్కేస్తున్న వైసీపీ గ్యాంగ్
- ఖతర్నాక్ కారుమూరి, దోపిడీకి ద్వారం.. ద్వారంపూడి
- బియ్యం దిగుబడి పెరగపోయినా పెరిగిన ఎగుమతులు
- 2018-19లో బియ్యం దిగుబడి 82.30 లక్షల టన్నులు
- 2020-21 నాటికి 78.90 లక్షల టన్నులకు తగ్గిన దిగుబడి
- 2018-19లో బియ్యం ఎగుమతులు 18.09 లక్షల టన్నులు
- 2021లో 31.51 లక్షల టన్నులకు, 2022లో 48.26 లక్షల టన్నులకు ఎలా చేరాయి?
- విదేశాలకు ఎగుమతి చేస్తున్న రేషన్ బియ్యం
- 5.70 లక్షల టన్నుల కేంద్రం రేషన్ బియ్యం మాయం
- టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం
అమరావతి : ఖతర్నాక్ కారుమూరి, దోపిడీకి ద్వారం.. ద్వారంపూడి అని తెలుగుదేశంపార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మా రెడ్డి పట్టాభిరాం దుయ్యబట్టారు. వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో బియ్యం మాఫియా రాజ్యమేలుతోందని మండిపడ్డారు. దేశంలోనే అతిపెద్ద బియ్యం కుంభ కోణం రాష్ట్రంలో చోటుచేసుకుందన్నారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించి అక్రమార్కుల్ని బజారు కీడ్చి బోనెక్కించి బొక్కలో తోయాలని చెప్పారు. అంత వరకు తెలుగుదేశంపార్టీ పోరాటం చేస్తూనే ఉంటుం దన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశంపార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకర్ల సమా వేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌రెడ్డి మూడున్నరేళ్ల పాలన మొత్తం స్కాముల తోనే నడిచింది. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజా యి స్కాములతో పాలనంతా సాగింది.ఇప్పుడు పేదోడి రేషన్ బియ్యాన్ని సైతం పక్కదారి పట్టించి కుంభకోణా నికి తెరలేపారు. పేదల పొట్టగొట్టి జేబులు నింపుకుం టున్నారు. ఎవడి జేబు ఎలా కొట్టేయాలా? తన జేబు లు ఎలా నింపుకోవాలా? అనే ఆలోచనే తప్ప, పేదలు ఎలా పోయినా, వారు ఆకలితో అలమటించి చచ్చినా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న బియ్యం కుంభకోణానికి ఇద్దరు రథసారధులున్నారు. వాస్తవానికి వారిద్దరినీ బియ్యం బకాసురులు అనాలి. ఒకరు ‘ఖతర్నాక్ కారుమూరి’. పౌరసరఫరాల శాఖా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గురించి తెలిసిన వారు, దగ్గర నుంచి చూసిన వారు అతన్ని ముద్దుగా కంత్రీ కారుమూరి, ఖతర్నాక్ కారుమూరి అని పిలుచు కుంటారు. ఎందుకంటే అతని పనులన్నీ అంత ఖతర్నాక్‌గా ఉంటాయి.
రెండో వ్యక్తి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి కుమారుడు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి. ‘దోపిడీకి ద్వారం.. ద్వారంపూడి’. ఇంకా చెప్పాలంటే దోపిడీకి సింహద్వారం లాంటి వ్యక్తి. ఎందుకంటే, ఎక్కడ ఏం దోచుకోవాలో, ఎలా దోచుకోవాలో దానికి సింహద్వారాలు ఏర్పాటు చేస్తుం టారు. అందుకే రెండో బియ్యం బకాసురుడు ద్వారం పూడి చంద్రశేఖర్‌రెడ్డి. జగన్‌రెడ్డి సారధ్యంలో ఈ ఇద్ద రు బియ్యం బకాసురులు రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసి కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగు మతి చేస్తూ వేల కోట్లు జగన్‌రెడ్డి ఖజానాకు తరలిస్తున్నారు.
పంట దిగుబడి తగ్గితే ఎగుమతులు ఎలా పెరిగాయి?
రాష్ట్రంలో ధాన్యం దిగుబడులు పెరిగిపోతున్నా యంటూ ద్వారంపూడి చెప్పిన మాట శుద్ధ అబద్దం. కేంద్ర ప్రభుత్వ రికార్డుల్ని పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్ట్రాటస్టిక్స్ వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బియ్యం దిగుబడులు ఈవిధంగా ఉన్నాయి.
2015-16లో 74.90 లక్షల టన్నులు
2016-17లో 74.50 లక్షల టన్నులు
2017-18లో 81.70 లక్షల టన్నులు
2018-19లో 82.30 లక్షల టన్నులు
2019-20లో 86.60 లక్షల టన్నులు
2020-21లో 78.90 లక్షల టన్నులు
2021-22కి సంబంధించి అంచనాల ప్రకారం సుమారు 89 లక్షల టన్నులు
ఈలెక్కల ప్రకారం 2018-19లో బియ్యం దిగు బడులు 82.30లక్షల టన్నులుంటే, 2020-21 నాటి కి 78.90 లక్షల టన్నులకు తగ్గింది. అంటే 3.40 లక్షల టన్నులు తగ్గింది. దిగుబడులు పెరిగాయని ద్వారంపూడి చెప్పిన లెక్కలు పచ్చి అబద్దమని తేలింది.
2021-22కి సంబంధించి అంచనాల ప్రకారం 89 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులున్నాయి. తద్వా రా గతంతో పోల్చినపుడు పెద్దగా పెరుగుదల ఏమీ లేదని స్పష్టమవుతోంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పిన విధంగా ఎక్కడా ఆంధ్ర రాష్ట్రంలో బియ్యం దిగుబడులు గణనీయంగా పెరగలేదు. కానీ,ఏపీ నుం చి, మరీ ముఖ్యంగా కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు బియ్యం ఎగుమతులు ఎలా పెరిగాయో ఈ బియ్యం బకాసురులు సమాధానం చెప్పాలి.
ఎగుమతుల పరంగా చూస్తే.. 2018-19లో కాకి నాడ పోర్టు ద్వారా 18,09,274 టన్నుల బియ్యం ఎగుమతి చేశారు. 2020-21 నాటికి 31.51 లక్షల టన్నులకు చేరుకున్నాయి. 2021-22నాటికి అమాం తం 48.26లక్షల టన్నులకు చేరాయి. పంట దిగుబ డులు పెరగకుండా ఎగుమతులు మాత్రం పెరిగిపోతు న్నాయి. ఇది ఎలాసాధ్యం? రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించడం వలన కాదా? తెలంగాణ, ఛత్తీస్ గఢ్ బియ్యం కూడా కాకినాడ పోర్టు నుంచే ఎగుమతి చేస్తు న్నారంటూ గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. ఆ కోణంలో కూడా తాము పరిశీలిస్తే, ఆం ధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ మూడు రాష్ట్రాలు కలిపి బియ్యం దిగుబడులు 2018-19లో 2.14 కోట్ల టన్నులుండగా, 2020-21కి 2.27 కోట్ల టన్ను లకు పెరిగాయి. అంటే 13 లక్షల టన్నులు(5.80 శాతం)పెరిగాయి. కానీ, కాకినాడ కేంద్రంగా బియ్యం ఎగుమతులు మాత్రం 2018-19తో పోలిస్తే 2020 -21లో 42.5శాతం పెరిగాయి. అంటే, మూడు రాష్ట్రాల బియ్యం దిగుబడులు మొత్తం కలిపినా 2018-19కి 2020-21తో పోలిస్తే కేవలం 5.80 శాతం పెరుగుదల నమోదు కాగా, అదే కాలానికి కాకినాడ పోర్టు ద్వారా బియ్యం ఎగుమతులు మాత్రం
8 రెట్లు పెరిగి, 42.50శాతం పెరుగుదల నమోదు చేయడం జరిగింది. ఈ అద్బుతం ఎలా సాధ్యం? పేద వాడి రేషన్ బియ్యాన్ని మింగడం వల్ల కాదా అని ఈ ఇద్దరు బియ్యం బకాసురులు, వారిని నడిపిస్తున్న జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.
2018-19కి, 2021-22కి పోల్చి చూస్తే మూడు రాష్ట్రాలు కలిపి బియ్యం దిగుబడులు 12.96 శాతం పెరిగితే,అదే కాలానికి కాకినాడ పోర్టు ద్వారా బియ్యం ఎగుమతులు మాత్రం 62 శాతం పెరిగాయి. అంటే, బియ్యం దిగుబడుల పెరుగుదల శాతం కంటే 5 రెట్లు ఎక్కువ. ఈ విధంగా, దిగుబడులు తక్కువ, ఎగుమ తులు ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఎగుమతి చేస్తున్న బియ్యం ఆకాశం నుంచి ఊడి పడ్డాయా? ఈ బియ్యం బకాసురులు చెబుతున్నట్లు ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఎక్కడా వారు చెప్పిన స్థాయిలో పంట దిగుబడులు పెరగలేదు. కానీ, ఎగుమతులు మాత్రం 5-8 రెట్లు పెరిగాయి. ఈ పెరుగుదలకు కారణం బియ్యం బకాసురులు బొక్కేసిన రేషన్ బియ్యమే.
దొంగ బిల్లులతో ఖజానాకు కన్నం
పొలాలు లేకపోయినా,పంట పండిరచకున్నా వారి పేరుతో బిల్లులు పెట్టి డబ్బులు వసూల్ చేస్తున్నారని, దొంగ బిల్లులతో రూ.146 కోట్లు దోచేశారని సాక్షాత్తు సివిల్ సప్లయిస్ కమిషనర్ వీరపాండ్యన్ ఈ మధ్యనే అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాసి, ఆ డబ్బును తిరిగి వసూలు చేయాలని ఆదేశించారు.
కాకినాడ పోర్టు నుండి బియ్యం ఎగుమతుల అసాధారణ పెరుగుదల వివరాలను పరిశీలిస్తే
2015-16లో 19.41 లక్షల టన్నులు
2016-17లో 20.42 లక్షల టన్నులు
2017-18లో 21.71 లక్షల టన్నులు
2018-19లో 18.09 లక్షల టన్నులు
2020-21లో 31.51 లక్షల టన్నులు
2021-22లో 48.26 లక్షల టన్నులు ఎగుమతి అయ్యాయి.
దేశంలో కాకినాడ పోర్టు, ముంద్రా పోర్టు నుంచి మాత్రమే బియ్యం ఎగుమతులు ఎక్కువగా జరుగుతా యి. ముంద్రా పోర్టు నుంచి 2018-19లో 13.59 లక్షల టన్నులు, 2021-22 నాటికి 18.58 లక్షల టన్నులకు చేరుకున్నాయి. అంటే 26 శాతం మాత్రమే ఎగుమతుల పెరుగుదల నమోదైంది. కానీ, కాకినాడ పోర్టులో 2018-19లో 18.09 లక్షల టన్నులు, 2021-22కి ఏకంగా 48.26 లక్షల టన్నులకు ఎలా పెరిగింది? ఈ పెరుగుదల అసాధారణమే కదా? అక స్మాత్తుగా కనిపిస్తున్న ఈ పెరుగుదల బియ్యం బకాసు రుల రేషన్ బియ్యం దోపిడీ వల్ల కాదా? త్వరలోనే కేంద్ర విజిలెన్స్ కు కూడా ఈ వివరాలన్నీ పంపిస్తాం.
అక్రమార్కుల అంతు తేల్చడం తధ్యం
బియ్యం వ్యాపారం చేయడం తప్పుకాదు. ఎగు మతులు చేయడమూ తప్పు కాదు. న్యాయ బద్దంగా బియ్యం ఎగుమతులు చేసే వ్యాపారస్తులను తాము ఎంత మాత్రమూ తప్పుపట్టడం లేదు. ద్వారంపూడిలా పేదల బియ్యాన్ని అక్రమంగా, అడ్డదారుల్లో విదేశా లకు అమ్ముకోవడాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నాం. ఇలాం టి అవినీతి పరుడి కుటుంబం రైస్ మిర్లందరికీ నాయ కత్వం వహించడం వారి దురదృష్టం. ఈ ద్వారంపూడి కుటుంబం కారణంగా, నిజాయి తీగా బియ్యం వ్యాపారం చేసుకునే వారిపై కూడా అవినీతి మరక అంటుకుంటోందని రైస్ మిల్లర్లు తెలుసుకోవాలి.రాష్ట్రంలో జరుగుతున్న బియ్యం మాఫి యాపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. బియ్యం అక్రమాలపై తక్షణమే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి స్పం దించాలి. ఈ బియ్యం కుంభకోణంపై సీబీఐ విచారణ కు ఆదేశించే దమ్ము జగన్ రెడ్డికి ఉందా? విచారణ జరిపించి అక్రమార్కులను కటకటాల్లోకి పంపే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని కొమ్మారెడ్డి పట్టాభిరాం హెచ్చరించారు.
కేంద్రం ఇచ్చిన బియ్యాన్నీ బొక్కేశారు
కేంద్రం ప్రతి సంవత్సరం రాష్ట్రానికి రేషన్ బియ్యం సరఫరా చేస్తోంది. 2019-20 నుంచి 2022 జూన్ వరకు రాష్ట్రానికి 62,05,788 టన్నుల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సర ఫరా చేయడానికి ఇచ్చింది. ఇందులో 5.70 లక్షల టన్నుల బియ్యం లెక్కలు తేలలేదని పార్ల మెంటులో స్వయంగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కుండ బద్దలుగొట్టారు. ఈ విధంగా బియ్యం మాయం చేయడమే కాకుండా పేదలకు చేరాల్సిన కేంద్ర రేషన్ బియ్యాన్ని కిలో రూ.7-10కి బియ్యం మాఫియా దళారులు కొనుగోలు చేసి కాకినాడ పోర్టు ద్వారా అధిక లాభాలకు విదేశాలకు తరలిస్తున్నారు. ఈ మధ్య కాలంలో బియ్యం అమ్మకాల్లో వచ్చిన తేడాలతో గుంటూ రు జిల్లాలో ఒక వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేసింది ఈ బియ్యం మాఫియాయే. కేంద్రం ఇచ్చే రేషన్ బియ్యాన్ని పేదలకు చేరనీయకుండా తక్కువ ధరకు కొనుగోలు చేసి, అసలు పంచ కుండా పక్కదారి పట్టించి కాకినాడ కేంద్రంగా ఎగుమతి చేస్తున్నారనే విషయం సుస్పష్టం.