- వారి ఆక్రమణలతోనే నేడు వరద నగరాన్ని ముంచెత్తింది
- ఈ విపత్తులకు కారణం నాటి అరాచక పాలన ఫలితమే
- పోలవరం, వెలిగొండ, పట్టిసీమ, ప్రాజెక్టులను విస్మరించారు
- నాడు వరదలొస్తే గాల్లో తిరుగుతూ గాలికి వదిలేశారు
- వరదల్లో బురద రాజకీయాలు చేయడం బాధాకరం
- గృహనిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి
విజయవాడ(చైతన్యరథం): మ్యాన్ మేడ్ డిజాస్టర్‌లకు జగన్‌రెడ్డి అరాచక పాలనే నిదర్శన మని సమాచార పౌర సంబంధాలు, గృహనిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డా రు. శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ కార్యాలయంలో మీడియాతో మాట్లా డుతూ మానవ తప్పిదం వల్లనే వరదలు ముంచెత్తి పెద్దఎత్తున ఆస్తి, ప్రాణనష్టం జరిగిన విషయం వాస్తవమని చెప్పిన మంత్రి ఆ తప్పిదానికి ప్రధాన కారణం జగన్‌రెడ్డి అని ధ్వజ మెత్తారు. దేవతలు, రుషులు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు వచ్చి వాటిని భగ్నం చేసిన విధం గా 2014-19 మధ్య టీడీపీ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను ధ్వంసం చేయడ మే మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని పేర్కొన్నారు. 70 శాతం పూర్తయిన పోలవరం, వెలిగొండను ఐదేళ్ల పాటు పక్కన పెట్టడం, పట్టిసీమను పట్టించుకోకపోవడం, సాగునీటి ప్రాజెక్టులను తట్ట మట్టి వేయకపోవడం వంటివన్నీ జగన్ చేసిన మానవ తప్పిదాలేనని వివరించారు. జగన్ సృష్టించిన విపత్తులకు అంతే లేదని, కాలువ గట్లపై యథేచ్ఛగా మట్టి తవ్వకాలు, నిషేధిత ప్రాంతాల్లో ఇసుక తవ్వకాల వల్ల ప్రజలు పెద్దఎత్తున నష్టపోయారని వ్యాఖ్యా నించారు. విపత్తు సంభవిస్తే నాయకుడు ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించి వారికి అన్ని విధాలా అండగా నిలబడాలే తప్ప వరదల్లో కూడా బురద రాజకీయాలు చేయడం బాధాక రమన్నారు. ప్రతి కుటుంబానికి తండ్రి ఏ విధంగా అండగా నిలబడతాడో వరద బాధితుల కు చంద్రబాబు అదేవిధంగా రేయింబవళ్లు పనిచేస్తూ భరోసా కల్పించారని తెలిపారు.
జగన్ సృష్టించిన మ్యాన్‌మేడ్ డిజాస్టర్లు
2019 ఆగస్టులో చంద్రబాబు ఇల్లు ముంచడానికి ప్రకాశం బ్యారేజ్‌లో పడవ వదిలి నీటి ప్రవాహాన్ని అడ్డుకున్నారు. నేడు వరదల్లో ప్రకాశం బ్యారేజ్ 69వ గేట్ ధ్వంసం చేసిన 5 పడవల్లో 4 పడవలపై వైసీపీ రంగులు ఉన్నాయి. దీనిని ఏమని అర్థం చేసుకోవాలి. 2021లో పించా ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి జగన్ ఆధ్వర్యంలో ఇసుక మాఫియానే కారణం. 2021లో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 44 మంది చనిపోయి వేలాదిమంది నిరాశ్రయులవడానికి కారణం ఇసుక మాఫియా. 2023 డిసెంబరులో గుండ్లకమ్మ ప్రాజెక్టు లో రెండో గేటు కొట్టుకుపోవడం, 2023 ఆగస్టులో పోలవరం గైడ్ బండ్ కుంగిపోవడం వంటివన్నీ జగన్ చేసిన మానవ తప్పిదాలు. గేట్లకు గ్రీజు కూడా పెట్టకుండా జగన్ చేసిన తప్పులే నేడు ప్రజలకు శాపాల్లా మారాయి. వరదల వల్ల ప్రజలు నష్టపోయినా ఆదుకోలేదు. కోనసీమలో వరదలు వస్తే కుళ్లిపోయిన 3 టమోటాలు, కిలోబియ్యం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ప్రజలు వరదల్లో ఉంటే నాడు గాల్లో తిరుగుతూ ప్రజలను గాలికి వదిలే శారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో పోలవరం, పట్టిసీమ, బుడమేరు, హంద్రీ-నీవాతో పాటు అనేక కాలువ కట్టలపై మట్టి కూడా తరలించి ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు పెను విపత్తులా జగన్ మారారని ధ్వజమెత్తారు.
బుడమేరు వరదకు జగన్‌రెడ్డి అండ్ కో కబ్జాలే కారణం
1995లో తీసుకున్న నిర్ణయాలను ఇప్పటి బుడమేరు వరదకు ముడిపెట్టడం అంబటి రాం బాబు నటనా చాతుర్యానికి నిదర్శనం. బుడమేరును నేరుగా కృష్ణా నదిలో కలిపాల్సింది.. కేవలం చంద్రబాబు ఇళ్లు మునుగుతుందని కలపలేదనడం వారి అవివేకమని మండిపడ్డారు. విజయవాడ నగర పరిధిలో బుడమేరు కాలువ సుమారు 11 కి.మీ ప్రవహి స్తోంది. భవానీపురం, అజిత్‌సింగ్ నగర్, అయోధ్య నగర్, పాయకాపురం తదితర ప్రాంతా ల్లో ప్రవహించే ఈ కాలువ చుట్టుపక్కల కబ్జాలకు పాల్పడ్డ నాటి వైసీపీ మంత్రులు, ఎమ్మె ల్యేలు వారి నాయకుడు జగన్ రెడ్డే ఈ వరదలకు కారణం. బుడమేరు నుంచి 37,555 క్యూసెక్కుల వరద నీటిని కృష్ణానదికి తరలించడానికి 2017-18లో టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టి రూ.150 కోట్లు ఖర్చు చేస్తే 2020లో జీవో నెం.365 జారీ చేసి పనులు ఆపేయించింది జగన్‌రెడ్డి కాదా అని ప్రశ్నించారు. బుడమేరు ఆనుకుని ఉన్న స్థలాలను కబ్జా చేసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి అక్రమ లేఅవుట్లు వేసి గజం రూ.30 వేల నుంచి రూ.50 వేలకు అమ్మింది జగన్‌రెడ్డి అనుచరులు కాదా? అని ధ్వజమెత్తారు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే బుడమేరు ఆధునికీకరణ పనులను ఆపేసి కమీషన్ల కోసం కాంట్రాక్టర్‌ను మార్చి ఐదేళ్ల పాటు పనులు పూర్తి చేయకపోయినా అతడికి పూర్తి స్థాయి బిల్లులు చెల్లించి పెద్ద తప్పిదానికి పాల్పడ్డారని తెలిపారు. బుడమేరులో రూ.500 కోట్ల విలువ చేసే 600 ఎకరాలను జగన్ మనుషులు అన్యాక్రాంతం చేశారు. 2022లో బుడమేరుకు గండిపడిన విషయం జగన్ దృష్టికి రైతులు తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం ఒక తప్పిదమైతే గతంలో ఉన్న ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం మరో తప్పిదమని వ్యాఖ్యానించారు. ఈ తప్పిదాలకు అంతే లేదన్నారు. గత ప్రభు త్వ ఐదేళ్ల కాలంలో కాలువలో పూడిక తీసే పనులకు, మరమ్మతులకు ఎంత ఖర్చు చేశారో వెల్లడిరచాలని ప్రశ్నించారు.
బురద రాజకీయాలకు పెట్టింది పేరు జగన్‌రెడ్డి
వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరును సాక్షాత్తు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రశంసించిన విషయం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వంలో లోపాలుంటే ఎత్తిచూపి నిర్మాణాత్మక సలహాలు ఇచ్చి బాధ్యతమైన ప్రతిపక్షంగా ప్రవర్తించాల్సింది పోయి బురద రాజకీయాలు చేయడం తగదని మండిపడ్డారు. అసెంబ్లీకి వచ్చి సమస్యలు ఎత్తి చూపాల్సిన చోట తోకముడిచి వెళ్లిపోతారని విమర్శించారు. తనకున్న పత్రిక, చానల్ ద్వారా బురద రాజకీయాలు చేయడం శోచనీయమన్నారు. బాధ్యతా రాహిత్యంతో వ్యవస్థలను ధ్వంసం చేసిన వ్యక్తి జగన్ అని ధ్వజమెత్తారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కష్టపడుతున్న చంద్రబాబుపై బురదజల్లడం సరికాదన్నారు. ప్రజలందరికీ భరోసా కల్పించి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.