అమరావతి: మనం ధర్మాన్ని కాపా డితే అది మనల్ని కాపాడుతుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం సతీమణి భువనేశ్వరితో కలిసి ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తొలుత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను. తరువాత శక్తి స్వరూపిణి దుర్గమ్మ తల్లిని దర్శించుకున్నాను. ధర్మాన్ని పరిరక్షించమని, దుష్టుల్ని శిక్షించమని దుర్గమ్మ తల్లిని కోరుకున్నాను. తెలుగు జాతి అభివృద్ది కోసం 45 ఏళ్ల నుంచి కష్టపడుతున్నా. దుష్ట శక్తులు ఎన్ని కుట్రలు పన్నినా వాటిని ప్రతిఘటిస్తూ ముందుకెళ్తా.
ప్రపంచంలో తెలుగుజాతికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.నేడు 5కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. నేను కష్టకాలంలో ఉన్న ప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా, దేశ విదేశాల్లో ఉన్న తెలుగుప్రజానీకం మద్దతుగా నిలిచారు. న్యాయం కోసం, ధర్మం కోసం ప్రజలు పోరాడారు. ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. నా కోసం వారు నమ్ముకున్న దేవుళ్లను ప్రార్థించారు. ఎంతోమంది ఇప్పటికీ ప్రార్థన లు చేస్తూనే ఉన్నారు. అన్ని దేవుళ్ల అనుగ్రహంతో నేడు న్యాయం జరుగుతోంది. నాకు మద్దతు తెలిపిన అంద రికీ ధన్యవాదాలు చెపుతున్నా.మానవ సంకల్పానికి దైవ సంకల్పం, ఆశీస్సులు ఉండాలి. అందుకే భవి ష్యత్‌లో చేయబోయే కార్యక్రమాలు విజయవంతం చేయాలని ప్రార్థించేందుకు వచ్చాను. తెలుగు ప్రజ లకు మళ్లీ సేవ చేసే భాగ్యం కల్పించమని దేవుళ్ల ను ప్రార్దిస్తున్నాను.
తెలుగు ప్రజానీకానికి సేవచేసి రాష్ట్రానికి పూర్వవైభవం తెచ్చే శక్తి ప్రసాదించాలని కనకదుర్గమ్మను వేడుకున్న ట్లు తెలిపారు. తెలుగు ప్రజలు సిరిసంపదలతో ఆనం దంగా జీవించేందుకు వారికి సేవచేసే అవకాశం అమ్మ వారు ప్రసా దిస్తారని నమ్ముతున్నాన్నారు. సింహాచలం అప్పన్న, శ్రీశైలం మల్లన్న దర్శనం తర్వాత చర్చిలు, దర్గాల కు కూడా వెళతాను. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. అధర్మం ముందు కొచ్చి ఇష్టానుసారం చేస్తే అందరి బతుకులు అత లాకుతలం అవుతాయి. రాష్ట్ర భవిష్యత్ అంధకార మవుతుంది. దీన్ని ప్రజలుగమనించాలి.అధికారులు కూడా ధర్మంగా నడుచుకోవాలి అని చంద్ర బాబునాయుడు అన్నారు.
సతీమణి భువనేశ్వరితో కలిసి అమ్మవారి దర్శనా నికి వచ్చిన చంద్రబాబుకు ఆలయ ముఖ ద్వారం వద్ద మేళతాళాలతో బాబు దంపతులకు వేదపండితులు స్వాగతం పలికారు. ఆలయ అధికారులు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి, అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. దుర్గమ్మ ఆలయానికి వచ్చిన చంద్రబాబుకు ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీలు అశోక్ బాబు, పంచుమర్తి అనురాధ, మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమా, మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పార్టీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, కేశినేని చిన్ని, జనసేన నేత పోతిన మహేష్, తదితరులు స్వాగతం పలికారు.