- 12 జిల్లాల నుండి 110 వినతులు
- గత ప్రభుత్వంలో జరిగిన కబ్జాలపై ఎక్కువ అర్జీలు
- వెంటనే అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించాలని ఆదేశించాం
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పనబాక లక్ష్మి వెల్లడి
అమరావతి(చైతన్యరథం): మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌కు 12 జిల్లాల నుండి 110 వినతులు వచ్చాయని…గత ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలపై అధిక వినతులు అందాయని.. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి పరిష్కరించాలని ఆదేశించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ , టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పనబాక లక్ష్మి తెలిపారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎక్స్ ఆర్మీ అధికారులు కూడా భూమస్యలపై వినతులు ఇచ్చారన్నారు. గత ప్రభుత్వంలో అనర్హులుగా చూపి పింఛన్‌లు నిలిపేశారంటూ లబ్ధిదారులు వాపోయారని పేర్కొన్నారు. ఆ శాఖ మంత్రిగా పింఛన్ సమస్యలపై అధికారులకు ఫోన్ చేసి పరిష్కారానికి కృషి చేశామన్నారు. ఎంఎస్‌ఎం ఇండస్ట్రీలో ప్రోత్సాహకాలపైనా వినతులు అందాయన్నారు.
వాటిని కూడా పరిష్కరిస్తామన్నారు. లోకల్ ఇండస్ట్రీలకు సంబంధించిన పలు సమస్యలు వచ్చాయని.. వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. కడప జిల్లాలో పనికి రాలేదనే కోపంతో ఒక వ్యక్తిపై వేడి నూనె పోస్తే.. అక్కడి పోలీసులు నాడు ఆ ఫిర్యాదును పట్టించుకోలేదనే వినతి అందిందని.. దానిపై వెంటనే అక్కడి పోలీసులకు ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. టీడీపీ ఆఫీసుకు వెళితే ప్రజల సమస్యలు వింటారు.. సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం ప్రజలకు కలిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
వినతులు స్వీకరించిన కొండపల్లి, పనబాక లక్ష్మి
అతి నికృష్ట, నీచ, పైశాచిక పాలనలో మూగవోయిన బాధితుల గొంతులకు స్వేచ్ఛ లభించింది. గతంలో పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుండి వైసీపీ పిల్ల సైకోల వరకు కొనసాగించిన దందాలు, దౌర్జన్యాలు, భూ ఆక్రమణలపై బాధితులు లబోదిబోమంటూ.. న్యాయం కోసం నేడు కూటమి నేతలు, అధికారుల వద్దకు క్యూ కడుతున్నారు. అధికారం చేపట్టిన మొదటి రోజు నుండే ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ప్రజల నుండి వినతుల స్వీకరణకు శ్రీకారం చుట్టింది. అందుకోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ను పెట్టింది. అంతే కాకుండా.. ప్రతి శనివారం నేరుగా సీఎం చంద్రబాబు నాయుడే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను వింటున్నారు. మరోపక్క మంత్రులు, నాయకులు ప్రతిరోజు పార్టీ జాతీయ కార్యాలయంలో అందుబాటులో ఉంటూ ప్రజల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో… రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పనబాక లక్ష్మి అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు.
బూచోళ్ల భూదాహానికి… భకాసురుల అరాచకాలకు బలైన బాధితులు.. బటన్ నొక్కుడు మోసాలకు బలై అర్హులైనా లబ్ధి అందక నష్టపోయిన అభాగ్యులు.. అధిక సంఖ్యలో తరలివచ్చి తమ వినతులను జాతీయ కార్యాలయంలో అందించారు. గత పాలకుల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అర్హులమైనా తమకు న్యాయం జరగలేదని వారు వాపోయారు. సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పనబాక లక్ష్మి వారికి భరోసా కల్పిస్తూ… గత పాలకుల పాపాలకు బలైన బాధితులకు న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరికి చట్టబద్దంగా న్యాయం జరిగేలా చూస్తామని అర్జీదారులకు వారు హామీ ఇచ్చారు.
గుంటూరు జిల్లా పేరేచర్ల తెల్లక్వారీ వర్కర్స్ లేబర్ కాంట్రాక్ట్ సహకార సంఘం ప్రతినిధులు తమ సమస్యలు తెలుపుతూ.. 2020లో క్వారీకి దరఖాస్తు చేసుకుని వంద కుటుంబాలు బతుకుతున్నాయని… దాన్ని వైసీపీ నేత పీవీఆర్ లాక్కున్నాడని.. దాంతో ఇళ్ల గడవకా.. పిల్లలను చదివించుకోలేక ఇబ్బంది పడుతున్నామని.. కావున క్వారీని తిరిగి తమకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కొలమడుగు పంచాయతీ, వేటగిరి కొత్తూరు గ్రామానికి చెందిన నాగరాజు భార్య శారద మాట్లాడుతూ… తమకు వారసత్వంగా వచ్చిన భూమిని దౌర్జన్యంగా కబ్జా చేశారని.. అక్రమార్కుల ఆక్రమణ నుండి తమ భూమిని విడిపించాలని కన్నీటి పర్యంతం అయ్యారు. పల్నాడు జిల్లా మాచర్ల మండలానికి చెందిన బాణావత్ లక్ష్మానాయక్ టీడీపీ నేత కావడంతో తన పొలాన్ని వైసీపీ నేతలు లాక్కుని పొలంలోకి వెళితే చంపుతామని బెదిరిస్తున్నారని..
తన పేరు మీద ఉన్న పొలాన్ని నాటి ఎమ్మెల్యే పిన్నెల్లి సహకారంతో వైసీపీ నేతలు వారి పేరుమీదకు మార్చుకున్నారని. తనకు న్యాయం చేయాలని కోరాడు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం మల్లవేముల, పెద్దబోదనం గ్రామానికి చెందిన అబ్బాయిగారి చిన్న ఓబులమ్మ, కుమారి, గాదె ఉపశనయ్యలు తమ సమస్య చెబుతూ.. తాము ఎస్సీలమని.. వైసీపీ నేతలు తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి జేసీబీతో 30 మీటర్ల లోతు వరకు మట్టిని తవ్వి అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. నాడు జోగి రమేష్ ఆదేశాలో కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని బుక్ కీపర్లను మార్చకుండా ఆపేశారని.. పెడన నియోజకవర్గంలో బుక్ కీపర్లు బహిరంగంగా 2024లో వైసీపీకి అనుకూలంగా పనిచేశారని.. వారిని మార్చాలని పోతన వెంకటలక్ష్మీ నరసింహస్వామి కోరారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కోటేశ్వరమ్మ విజ్ఞప్తి చేస్తూ… తాను బతికి ఉండగానే.. చనిపోయినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తన ఆస్తిని కొట్టేశారని.. ఈ అన్యాయానికి సహకరించిన అధికారులు, దోపిడీదారులను కఠినంగా శిక్షించి తన ఆస్తి తనకు దక్కేలా చేయాలని గ్రీవెన్స్ లో కోరారు.
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం సోమవరపాడు గ్రామానికి చెందిన పోలా సుజాత వినతి పత్రం సమర్పిస్తూ.. తనకు భర్త లేడని, తనను అక్రమంగా గంజాయి కేసులో ఇరికించి వేధిస్తున్నారని…తనను జైలుకు పంపి ఇబ్బంది పెట్టారని…తనకు ఇద్దరు పిల్లలు ఇన్నారని.. ఆరోగ్యం కూడా సరిగ్గాలేదని.. తనను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని… వారి నుండి తనను ఆదుకోవాలని.. లేదంటే చావే శరణ్యమని మంత్రి, మహిళానేతల ముందు కన్నీరు పెట్టుకున్నారు. దీనిపై స్పందించిన నేతలు వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యను వివరించి పరిష్కరించాలని ఆదేశించారు.
గతంలో తమకు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మంచి మనసుతో బతుకుదెరువు కోసం పౌల్ట్రీ ఫారాలను ఇచ్చారని… వర్షాల కారణంగా అవి కుప్పకూలి నష్టపోయామని… వాటిపై అప్పులు కూడా పుట్టడంలేదని… వాటికి పక్కా రిజిష్ట్రేషన్ రికార్డులతో శాశ్వతంగా తమకు హక్కు ఉండేలా పాస్ పుస్తకాలు ఇప్పించాలని విశాఖ జిలా ఆనందపురం మండలం లొడగలవానిపాలెం గ్రామ పంచాయతీ వాసులు విజ్ఞప్తి చేశారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న దివ్యాంగుల పెన్షన్లు 2022, ఆగస్ట్ 1న తొలగించారని.. దివ్యాంగులపైనే ఆధారపడి కుటుంబ పోషణ నడుస్తున్న ఇళ్లు చాలా ఉన్నాయని.. వైసీపీ తొలగించిన పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని టీడీపీ వివిధ ప్రతిభవంతుల విభాగం ప్రధాన కార్యదర్శి పెండెం గాంధీ కోరారు. దివ్యాంగులకు ప్రత్యేక చట్టం అమలు చేసి 40% నుండి 100% ఉన్న విజువల్ ఛాలెంజ్‌డ్ వారికి, బధిరులకు ఆర్టీసీలో రాయితీ కల్పిచాలని కోరారు.
తాను దివ్యాంగుడనని…బీఏ చదువుకున్నా ఉద్యోగం రాలేదని… తాను బతికేందుకు శ్రీశైలం దేవస్థానంలో షాపు కేటాయించాలని నాగరాజారావు గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశాడు.
నరేగా సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులకు అములు చేసిన 23% పీఆర్సీ ప్రకారం జీతాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ… అర్జీ ఇచ్చారు. కొల్లి గంగరాజు మాట్లాడుతూ తన భార్య విజయవాడకు చెందిన ఏజెంట్ కుమారి ద్వారా దుబాయ్ వెళ్లిందని… తన భార్య వెళ్లి 5 నెలలు అయినా ఒక్క సారి కూడా మాట్లడలేదని. ఏం జరిగిందో ఏమోనని ఆందోళనగా ఉందని.. ఏజెంట్ ను అడిగితే డబ్బులు కట్టమని బెదిరిస్తోందని.. దయచేసి తన భార్యను దూబాయ్ నుండి వెనక్కి రప్పించాలని విజ్ఞప్తి శారు. అంతే కాకుండా వైసీపీ నేతలు పెట్టిన అక్రమ కేసులు, భూ సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, దివ్యాంగ సమస్యలు, పింఛన్ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఫీజుల సమస్యలు, కారుణ్య నియామకాలు ఇలా అనేక సమస్యలతో వందలం మంది అర్జీ దారులు నేడు గ్రీవెన్స్ కు పోటెత్తారు.