అమరావతి: కొలిమిగుండ్లలో తెలుగు యువత అధికార ప్రతినిధి మంద విజయ్గోపాల్పై వైకాపా మూకల దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండిరచారు. వైకాపా వాళ్లు దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఎక్స్ వేదికగా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్గోపాల్పై వైకాపా సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మా విజయ్ గోపాల్ ని చెప్పులతో కొట్టిన ప్రతి ఒక్క వైకాపా సైకోని అవే చెప్పులతో ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. పాలక పార్టీ ఫ్యాక్షనిస్టుల కంటే ఘోరంగా దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? బాధితులపై రివర్స్ కేసులు బనాయించడం సిగ్గుచేటని లోకేష్ విమర్శించారు.