అమరావతి: పొట్టకూటి కోసం పొరుగురాష్ట్రానికి వెళ్తున్న శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన 12మంది వలస కూలీలు బెంగుళూరు మార్గమధ్యలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందడం తీవ్రంగా కలచివేసిందని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మృతిచెందిన వారంతా రెక్కాడితేగానీ డొక్కాడని వ్యవసాయ కూలీలే కావ డం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగా ఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రాష్ట్రప్రభుత్వం పెద్దమనసుతో మృతుల కుటుంబాలను ఆదుకోవా లని లోకేష్ విజ్ఞప్తి చేశారు