- అప్పుల్లో, గ్యారెంటీల్లో దేశంలోనే నెంబర్ 1గా ఏపీ
- ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ గ్యారెంటీలు రాజ్యాంగ విరుద్ధం
- ఈ ప్రభుత్వం దిగిపోయేనాటికి రూ.2 లక్షల కోట్లకు చేరనున్న గ్యారెంటీలు
- వచ్చే ఏడాది మార్చికి రూ.10 లక్షల కోట్లకు రాష్ట్ర అప్పులు
- ఏడాదికి రూ.50 వేల కోట్ల మేర రుణ వాయిదాలు చెల్లించాల్సిన పరిస్థితి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అప్పుల భారం లెక్కలేనంతగా పెరిగిందని శాసనమం డలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. దీనిపై శ్వేతపత్రం కోరుతూ గతంలో తానురాసిన లేఖలకు ఆర్థిక మంత్రి, కార్యదర్శు ల నుండి జవాబు రాకపోవడం వల్ల ఆర్థిక పరిస్థితిపై తమ అంచనాలు సరైనవిగానే భావి స్తున్నామని మంగళవారం ఒక ప్రకటనలో యనమల పేర్కొన్నారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం 2024 మార్చి నాటికి 10 లక్షల కోట్ల అప్పు, సంవత్సరానికి రూ.50 వేల కోట్ల వాయిదా కట్టే పరిస్థితిని తీసుకువస్తుంది.దీనికి అదనంగా ఎడాపెడా ప్రభుత్వ గ్యారెంటీల పేరుతో రుణాలకు ఎగపడుతోంది. 2018-19 నాటికి ప్రభుత్వ గ్యారెంటీ లు రూ.50వేల కోట్ల లోపు ఉంటే గత సంవత్స రం అంతానికి రూ.1,50,000కోట్లు దాటాయి. ఈ ప్రభుత్వం 2024లో దిగిపోయే నాటికి గ్యారెంటీలు రూ.2 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని యనమల ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ప్రభుత్వ గ్యారెంటీలు నిర్దిష్ట ప్రాజెక్టుల కోసం మాత్రమే ఇవ్వాలి. ఈ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెచ్చి వాటిని చెప్పిన పనులకు విని యోగించకుండా తనరెవెన్యూ ఖర్చులకు వినియోగించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం, అప్పులు ఇచ్చిన బ్యాంకులు, కాగ్ వంటి సంస్థలు వీటిని నియంత్రించాలి. ఏ పనుల కోసం అప్పు తీసు కున్నారో.. ఆ పనులకు మాత్రమే ఉపయోగించేలా పర్యవేక్షించడం అప్పు ఇచ్చిన బ్యాంకులు, సంస్థల బాధ్యత.అది వారు పాటిం చకపోతే భవిష్యత్‌లో చాలా పర్యవసానాలు ఉంటాయని గుర్తుంచుకోవాలని యనమల హితవు పలికారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ గ్యారెంటీలు ప్రైవేటు కంపెనీలకు, సంస్థలకు ఇవ్వడం నిషిద్ధం. దీనిని ఉల్లంఘిం చి తమకు నచ్చిన కాంట్రాక్టు సంస్థలకు బ్యాం కు గ్యారెంటీలు ఇస్తున్నారని వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలా చేయటం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం. ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ గ్యారెంటీలు ఇస్తే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. ఎఫ్.ఆర్. బి.ఎం చట్ట పరిమితులను కూడా యథేచ్ఛగా పెంచి పరిమితులు దాటి మరీ ఇస్తున్న ప్రభుత్వ గ్యారంటీలు రాష్ట్ర భవిష్యత్ ను శాశ్వ తంగా దెబ్బ తీస్తాయి. ఈ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ప్రభుత్వ గ్యారెంటీలు, ఆ నిధులను ఏ ప్రయోజనాలకు వెచ్చించారో తెలియ జేస్తూ శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని యనమల డిమాండ్ చేశారు.