- గిరిజన గ్రామాలు, కొండ ప్రాంతాల్లో వైద్యసేవలే లక్ష్యం
- అక్కడే ఓపీ సేవలు, మందులు, అన్నిరకాల పరీక్షలు
- డోలీల మోతకు స్వస్తి పలికేలా మౌలిక వసతులు
- గిరిజన, మహిళా శిశు సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి
పార్వతీపురం(చైతన్యరథం): రాష్ట్రంలోని గిరిజన ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని, అందులో భాగంగా తొలి కంటైనర్ ఆసుపత్రిని ప్రారంభించి గిరిజనుల డోలీ మోతలకు స్వస్తి పలికినట్లు గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. సాలూరు మండలం కరడవలసలో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన గిరి ఆరోగ్య కేంద్రాన్ని (కంటైనర్ ఆసుపత్రి) సోమవారం ఉదయం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో తొలి కంటైనర్ ఆసుపత్రిని ప్రాంతీయ ఆరోగ్య సేవల కోసం ప్రారంభించడం జరిగిందని వివరించారు. ప్రాంతీయ గిరిజన గ్రామాలు, కొండ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా దీనిని రూపొందించడం జరిగిందని తెలిపారు. సుమారు 2,000 మంది పక్క గ్రామాలకు చెందిన నివాసితుల ఆరోగ్య అవసరాలను తీర్చడంలో ఇది ముందడుగుగా పేర్కొన్నారు. బెల్లపాక, బొడ్డపాడు, నరింజపాడు, కరడవలస, కరడకోటవలస (సాలూరు మండలం)తో పాటు చాకిరేవువలస, కంకనపల్లి, ఆజూరు, కుంబివలస (పాచిపెంట మండలం) గ్రామాలకు ఈ సేవలు అందుబాటులో ఉంటా యని వివరించారు. ప్రాథమిక వైద్య సంరక్షణ కోసం గ్రామీణులు చాలా దూరం ప్రయా ణించాల్సిన అవసరాన్ని ఇది తగ్గిస్తుందని గుర్తుచేశారు.
104 మెడికల్ యూనిట్‌తో వైద్యసేవలు
ఇందులో వారానికి ఒకసారి వైద్యాధికారి ఓపీ సేవలు అందిస్తారని, నెలకు రెండుసార్లు రెండు, నాలుగు బుధవా రాల్లో 104 మొబైల్ మెడికల్ యూనిట్ ఇక్కడికి వస్తుందని చెప్పారు. ఏఎన్ఎం, ఎం.ఎల్.హెచ్.పి వారానికి మూడుసార్లు ఇక్కడ ఓపీ సేవలు నిర్వహిస్తారని తెలిపారు. ఆశా కార్యకర్త ప్రతిరోజూ ఇక్కడ అందుబాటులో ఉంటారని, 105 రకాల మందులు అందుబాటులో ఉంచామని చెప్పారు. రక్తపోటు, మధుమేహానికి సంబంధించిన మందులు ఇక్కడ తీసుకోవచ్చని, అలాగే గర్భిణులకు కూడా సేవలు అందుబాటులో ఉన్నట్లు ఆమె వివరించారు. వారిలో రక్తహీనత కలిగిన వారికి ఐరన్ టాబ్లెట్లు అందుబాటులో ఉంటాయని, వారు ఆసుపత్రికి వెళ్లే అవసరం లేకుండా ఐరన్ – ఇంజక్షన్లు ఇక్కడే ఎక్కించే సౌకర్యం కల్పించినట్లు వివరించారు. నెలకు ఒకసారి గర్భిణులకు ఇక్కడ రక్త పరీక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా మలేరియా, డెంగ్యూ, షుగర్, రక్తశాతం, హెపటైటీస్, హెచ్ఐవీ, నీటి పరీక్షలు, టీబీ-కెల్ల, హెచ్వీ, ఐఓడిన్, యూరిన్, హెచ్‌సీజీ – కిట్, కంటి చూపు మొ దలైన 14 రకాల పరీక్షలు ఇక్కడ చేస్తారని వివరించారు. చిన్నపిల్లలకు టీకాలు వేసి కార్యక్రమం ఉంటుందని, ప్రతినెలా రెండో శనివారం సార్వత్రిక రోగనిరోధకత కార్యక్ర మం(యూఐపీ) నిర్వహించడం జరుగుతుందని వెల్లడిరచారు.
వైద్యసేవలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో డోలి మోతలకు స్వస్తి పలికి వారికి అందుబాటులో వైద్య సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో గిరి ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. ఇక్కడ అన్ని రకాల పరీక్షలు చేయడమే కాకుండా మందులు ఇస్తారని తెలిపారు. గిరి ప్రాంతాల్లో ముఖ్యంగా రక్తహీ నత లోపం ఉందని, ఇందుకోసం ఎనీమియా యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పా రు. ఈ కమిటీ 15 రోజులకు ఒకసారి ఇక్కడ సమీక్షించుకుని గర్భిణులు, బాలింతలకు, ఐదేళ్ల లోపు పిల్లలకు ఆరోగ్యం, పోషణ గురించి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కౌమార దశలో ఉన్న బాల బాలికలకు ప్రత్యేక ఆరోగ్య సదస్సులు, ట్యూబర్‌క్యూలోసిస్ గురించి అవగాహన సదస్సులు జరుగుతాయని వివరించారు. స్వయం సహాయక బృం దం సభ్యుల సమీక్షలు, వయోజన విద్య అవగాహన సదస్సులు జరుగుతాయన్నారు.
వీటితో పాటు గర్భధారణ, ప్రసవ సమయంలో శ్రద్ధ తీసుకోవడం, నవజాత శిశువు, శిశు ఆరోగ్య సేవలు ఇక్కడ లభిస్తాయన్నారు. బాల్య, వయో పరితుల ఆరోగ్య సంరక్షణ సేవలు, కుటుంబ సంకల్పం, నిరోధక సేవలు, ఇతర ప్రధాన ఆరోగ్య సేవలు, సంక్రమ ణ వ్యాధులు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, సాధారణ ఆవుట్ పేషెంట్ సేవల్లో భాగంగా తేలికపాటి వ్యాధులకు చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు. సాధారణ కంటి, చెవి, ముక్కు, గొంతు సమస్యలకు చికిత్స, ప్రాథమిక దంత ఆరోగ్య సంరక్షణ సేవలు, వృద్ధుల, పాలియేటివ్ ఆరోగ్య సేవలు, అతి తీవ్రగాయాలు, ఇతర అత్యవసర వైద్య సేవలు, మానసిక ఆరోగ్య సమస్యల స్క్రీనింగ్, ప్రాథమిక నిర్వహణ కూడా ఉంటుందని వివరించారు. ఈ సేవలను గిరి ప్రాంత ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కె.విజయపార్వతి, వైద్య ఆరోగ్య శాఖ నోడల్ అధికారి ఎం.వినోద్, వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారి టి.జగన్మోహన్రావు, వైద్య సిబ్బంది, జిల్లా అధికారులు పాల్గొన్నారు.