- జనం సమస్యలు పరిష్కరించాలి
- అందుకు కంకణబద్ధులు కావాలి
- కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో భువనేశ్వరి
కుప్పం(చైతన్యరథం): రాజకీయాలు, వ్యాపార రంగాల్లో టీమ్ వర్క్ అనేది చాలా ముఖ్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. అభివృద్ధి జరగాలంటే టీమ్ మధ్య సమన్వయం అనేది చాలా ముఖ్యం అన్నారు. హెరిటేజ్ సంస్థలో నేను మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నప్పటికీ, కిందిస్థాయి ఉద్యోగులతో కూడా కలిసి, సంస్థ అభివృద్ధిలో వారిని సమన్వయం చేసేందుకు నా శాయశక్తులా ప్రయత్నం చేస్తానని తెలిపారు. కుప్పంలో బుధవారం నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ మనం గెలిచాం అనేది ఒక అంశం అయితే…గెలుపు ఫలాలను ప్రజలకు అందించటం మరో అంశమన్నారు. ఈ విషయంలో సమన్వయ కమిటీ సభ్యులు కంకణబద్ధులు కావాలన్నారు. కార్యకర్తలు, ఓటర్లను మనం దృష్టిలో పెట్టుకోవాలి…వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తే వారు సంతోషంగా ఉంటారు. నా కుప్పం పర్యటనలో సామాన్యులంతా రోడ్లు, లైట్లు, కుళాయిలు, రెవెన్యూ సమస్యలు అత్యధికంగా నా దృష్టికి తెస్తున్నారు. వాటిపై సమన్వయ కమిటీ, అధినాయకత్వం దృష్టి పెట్టాలి. నేను కూడా ప్రతి 3నెలలకు ఒకసారి నియోజకవర్గానికి వస్తాను..ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని భువనేశ్వరి పిలుపు ఇచ్చారు. కుప్పంలో ఘన విజయానికి కృషి చేసిన సమన్వయకమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
భువనమ్మ నాయకత్వం స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్సీ శ్రీకాంత్
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ రాజకీయాలు అంటే తెలియని భువనమ్మ ఎన్నికలకు ముందు, అదేవిధంగా చంద్రబాబు అరెస్టు తర్వాత బయటకు వచ్చి వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి నిజం గెలవాలి కార్యక్రమాన్ని చేశారు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలకు ధైర్యం చెప్పారని అన్నారు. భువనమ్మ ఎంతో స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని ప్రదర్శించారు. హెరిటేజ్ కంపెనీ బాధ్యతలను భువనమ్మకు చంద్రబాబు అప్పజెబితే దాన్ని ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారో అందరికీ తెలుసు. అదేవిధంగా భువనమ్మకు చంద్రబాబు నిజం గెలవాలి అనే కార్యక్రమం చేయాలని సూచించినప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా కార్యక్రమాన్ని పోరాట స్ఫూర్తితో నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భువనమ్మ తిరిగిన పోలింగ్ బూత్ లలో గతం కంటే ఎక్కువ మెజార్టీ స్పష్టంగా కనిపించింది. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం నేడు కుప్పం ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారు. రాష్ట్రానికి ఓ నిజమైన యువ నాయకుడిని భావితరాలకు అందించిన ఘనత భువనమ్మకే దక్కుతుంది… నియోజకవర్గానికి ఏ సమస్య ఉన్నా నేడు భువనమ్మ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన సమస్యలను పరిష్కరించుకునేందుకు మార్గం ఏర్పడిరది.
రానున్న 5ఏళ్లు గతంలో ఎన్నడూ చూడని విధంగా అభివృద్ధి ప్రణాళికలను చంద్రబాబు ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేక అధికారులను నియమించారు. కుప్పం నియోజకవర్గం కోసం ప్రస్తుతం రూ.250కోట్లను చంద్రబాబు మంజూరు చేశారు. కుప్పం మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చి దిద్దాలని చంద్రబాబు భావిస్తున్నారు. సెజ్ ఏర్పాటు కోసం 2వేల ఎకరాలు చూడాలని, అవసరమైతే కొనుగోలు చేద్దాం అని చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. కుప్పం నియోజకవర్గం పట్ల చంద్రబాబు మరింత అంకితభావంతో ఉన్నారు. మొదటి 40రోజుల్లోనే కుప్పం నియోజకవర్గానికి కేంద్ర సంస్థలను తెచ్చారు…కుప్పం పట్ల చంద్రబాబు చిత్తశుద్ధి ఏంటో చెప్పేందుకు ఇదే నిదర్శనం. సెజ్ లో మరిన్ని కంపెనీలు పెట్టి 25వేల నుండి 30వేల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు నేరుగా అందించేందుకు చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అనుకున్నంత మెజార్టీ ఎన్నికల్లో రాకపోవడం కొంత నిరాశకు గురిచేసినా, రాక్షసులతో యుద్ధం చేసి గెలిచాం అని చెప్పుకోవచ్చు. అనేక ఇబ్బందులు, నిర్బంధాలు, అక్రమ కేసులను ఎదుర్కొంటూ 2024 కురుక్షేత్రాన్ని గెలిచాం. 2029నాటికి లక్ష మెజార్టీ లక్ష్యంతో నేటి నుండే పని చేస్తాం. నియోజకవర్గంలోని కార్యకర్తలు, ప్రజలు అన్ని విధాలా సంతోషంగా ఉండందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటాం. కుప్పం నియోజకవర్గంలో అధినేత ఆలోచనలను అమలు చేస్తూ, కుప్పం నియోజకవర్గాన్ని శత్రుదుర్బేధ్యంలా తీర్చి దిద్దేందుకు మా వంతు ప్రయత్నం చేస్తామని ఎమ్మెల్సీ శ్రీకాంత్ అన్నారు.
కార్యకర్తలకు అండా ఉంటాం: పీఎస్ మునిరత్నం
నియోజకవర్గ సమన్వయకర్త పీఎస్ మునిరత్నం మట్లాడుతూ అధికారంలో ఉండగా కొన్ని చిక్కుముడులు వస్తాయి…వాటిని అధిగమించేందుకు ఉమ్మడిగా పనిచేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం పై పూర్తిస్థాయి దృష్టి పెట్టి కార్యకర్తలకు అండగా నిలబడతాం. ప్రజాధనాన్ని ప్రజలకు అందించాలనేది చంద్రబాబు నైజం…దానిని మరింత పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లేందుకు కుప్పం నియోజకవర్గ నాయకులందరం జాగ్రత్తలు తీసుకుంటాం. రానున్న 5 సంవత్సరాలు కుప్పం చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచిపోతుంది. సమన్వయ కమిటీ సభ్యులు టీమ్ వర్క్‌తో పనిచేయాలి, ఈర్ష్యా, ద్వేషాలను ప్రక్కనబెట్టాలి. పార్టీ పటిష్టానికి కృషి చేయాలి. కుప్పం నియోజకవర్గం నుండి చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమన్వయ కమిటీ జాగ్రత్తలు పాటించాలి…సమన్వయం పాటించాలి. నియోజకవర్గ అభివృద్ధికి భువనమ్మ నడుం బిగించడం చాలా అదృష్టం, సంతోషదాయకం అని మునిరత్నం అన్నారు.