- వైసీపీ పాలనలో యువత భవిష్యత్తు నాశనం
- మహిళల మాన, ప్రాణాలకు రక్షణ కరువు
- వైసీపీ అరాచకాలను కార్యకర్తలు దీటుగా ఎదుర్కోవాలి
- భువనేశ్వరి పిలుపు
పుంగనూరు: చంద్రబాబు పాలనలో అన్నపూర్ణగా వెలుగొందిన రాష్ట్రం వైసీపీ పాలనలో అరాచక ఆంధ్ర ప్రదేశ్‌గా మారిందని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి విమర్శించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం, పులిచర్ల మండలం, కమ్మపల్లి గ్రామం లో పార్టీకార్యకర్త వెంకటపతినాయుడు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం గ్రామస్తులతో భువనమ్మ మాట్లాడుతూ… గంజాయి స్మగ్లింగ్, మహిళలపై దాడు లు, హత్యలు, అత్యాచారాల్లో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏపీని దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలబెట్టింద న్నారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా తెలుగు దేశం కార్యకర్తలు, నాయకులపై వైసీపీ వాళ్లు దాడులు, హింసకు పాల్పడుతున్నారు. వైసీపీ ప్రజావ్యతిరేక విధా నాలను ప్రశ్నిస్తున్నారనే అక్కసుతోనే టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమకేసు పెట్టి 53రోజులు జైల్లో పెట్టారు. చంద్రబాబుకు సంఫీుభావంగా నిరసన తెలిపి న టీడీపీ కార్యకర్తలపై కూడా వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెట్టింది.చంద్రబాబుకు మద్దతుగా శాంతియుత కార్యక్రమాలు చేసిన మహిళలను కూడా జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించింది. అరెస్టులు చేయించింది. వైసీపీ పాలనలో మహిళల మాన, ప్రాణాలకు రక్షణ కరువైంది. ఏపీలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక రాష్ట్ర యువత పక్క రాష్ట్రా లకు వలసలు పోతున్నారు. వైసీపీ పాలనలో యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవాలి…
ఏపీకి పూర్వవైభవాన్ని తీసుకురావాలంటే ఆ సామ ర్థ్యం కేవలం చంద్రబాబు ఒక్కరికే ఉంది. భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు తిరిగి ముఖ్య మంత్రి కావాలి. ఇప్పటి వరకు పోరాటాలతో పార్టీని నిలబెట్టుకున్న కార్యకర్తలు రానున్న ఎన్నికల్లో పట్టుదల తో, చేయిచేయి కలిపి ఎన్నికలను పారదర్శకంగా జరి పించుకునేందుకు ముందుకు రావాలి. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా,ఇబ్బందులు పెట్టినా వచ్చే ఎన్ని కల్లో పోరాడి గెలవాలి. వైసీపీ సిద్ధం అంటే… మనం సై అంటూ ముందుకు దూకాలని భువనమ్మ పిలుపు ఇచ్చారు.