విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి, సమాచార పౌరసంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్‌రెడ్డిపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ధర్మారెడ్డి, విజయ్ కుమార్‌రెడ్డిల పదవీ కాలంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ధర్మారెడ్డిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగా… విజయ్ కుమార్‌రెడ్డిపై జర్నలిస్టు సంఘాలు ఫిర్యాదులిచ్చాయి. ఇటీవలే ధర్మారెడ్డి ఉద్యోగ విరమణ చేయగా, కేంద్రంలో చేరేందుకు ఢల్లీికి వెళ్లిన తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వీలవకపోవటంతో వెనక్కు వచ్చారు. దర్యాప్తులో భాగంగా వారి అవినీతికి సహకరించిన ఇతర ఉద్యోగులనూ విచారణ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శ్రీవాణి టిక్కెట్లలో అక్రమాలకు పాల్పడ్డారని, టీటీడీని అడ్డం పెట్టుకుని వైసీపీకి విరాళాలు సేకరించారని, బడ్జెట్‌తో సంబంధం లేకుండా సివిల్ కాంట్రాక్ట్ పనులు ఇచ్చారని ధర్మారెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. సమాచార శాఖలో ప్రకటనల పేరిట కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడ్డారని విజయ్ కుమార్‌పై ఆరోపణలు వచ్చాయి. పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది.
`
హజ్ యాత్రికులకు ఘన స్వాగతం పలికిన మంత్రి ఫరూక్
అమరావతి (చైతన్యరథం): హజ్ యాత్రను ముగించుకొని ఆంధ్రప్రదేశ్ కు తిరిగి వచ్చిన హజ్ యాత్రికులకు గన్నవరం విమానాశ్రయంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ మాట్లాడుతూ హజ్ యాత్రికులకు ఎటువంటి కష్టం రాకుండా, యాత్రలో ఎటువంటి ఆటంకాలు రాకుండా వారికి కావాల్సిన సౌకర్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. హజ్ యాత్రికులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ అన్ని ఏర్పాట్లను చేశారని, వారికి హజ్ యాత్రికుల కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ హర్షవర్ధన, హజ్ కమిటీ సీఈవో అబ్దుల్ ఖాదర్, టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ఫతావుల్లా, ముస్లిం మత పెద్దలు మౌలానా హుస్సేన్, ముఫ్తీ ఫారూఖ్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఫీ, తదితరులు పాల్గొన్నారు.