- టీచర్ల సర్దుబాటు ప్రక్రియ వాయిదాకు నిర్ణయం
- మండల పాఠశాలల్లో అక్కడి వారితోనే చేయాలి
- అప్పటికీ కాకుంటే రెవెన్యూ డివిజన్‌లోని మండలాలు
- ఇంకా కొరత ఉంటే విద్యా వాలంటీర్లకు ప్రాధాన్యం
- గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను నాశనం చేశారు
- జీవో 117తో ప్రైమరీ పాఠశాలలు అస్తవ్యస్తం
- ఐబీ, సీబీఎస్ సిలబస్, టోఫెల్ ట్రైనింగ్ రద్దు చేస్తాం
- ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ
మంగళగిరి(చైతన్యరథం): ఆగస్టు 12,13 జరగాల్సిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ను వాయిదా వేయాలని కోరడంతో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆ ప్రక్రియను ఈనెల 17కి వాయిదా వేసినట్లు ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ తెలి పారు. సోమవారం మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావే శంలో వారు మాట్లాడుతూ మండలంలో ఒక పాఠశాలలో విధులు నిర్వహించే ఉపాధ్యా యులు అదే మండలంలో తక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలకు సర్దుబాటులో వెళతారని తెలిపారు. అప్పటికీ ఉపాధ్యాయులు సరిపోకపోతే రెవెన్యూ డివిజన్ల అధారంగా మరో మండలంలోని ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తారని, అది కూడా స్టేక్ హోల్డర్లను సంప్రదించాకే సర్దుబాటు ఉంటుందని వివరించారు. ఇది కేవలం సర్దుబాటు మాత్రమేనని బదిలీ కాదని వెల్లడిరచారు.
ఈ రోజు ప్రకటించే లిస్టులో మార్పులు ఉంటే డీడీవో, ఎంఈవో, హెచ్‌ఎంవోలకు తెలపాలని, వాటిని రివైజ్డ్ లిస్టుల కింద పరిగణలోకి తీసు కుంటామని తెలిపారు. సీనియార్టీ లిస్టుల్లో మార్పులు ఈనెల 15 వరకు అవకాశం ఇస్తామ ని కమిషనర్ తెలిపారని వెల్లడిరచారు. సబ్జెక్టుల వారీగా ఎక్కువ మంది ఉన్న ఉపాధ్యాయు లను లేని చోట్లకు సర్దుబాటు చేస్తున్నామని తెలిపారు. ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్ సబ్జెక్టులకు ఉపాధ్యాయులు అవసరమున్న చోటకు సర్దుబాటు చేస్తున్నామని వెల్లడిరచారు. అప్పటికీ టీచర్ల కొరత ఉంటే విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశా లిచ్చారని వెల్లడిరచారు. కూటమి ప్రభుత్వం వచ్చాక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచాలన్న ఆలోచన చేసిందన్నారు. విద్యావ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఆ శాఖలో వినూత్న మార్పులకు నాంది పలికారన్నారు. ఓ సందర్భంలో విద్య అనేది సమాజానికి ఒక ఫౌండేషన్ లాంటిదని వెల్లడిరచారని, విద్యా శాఖను మోడల్ శాఖగా తీర్చిదిద్ధాలని సంకల్పం మంత్రిలో కనిపించిందని తెలిపారు.
గత ప్రభుత్వ నిర్ణయాలతో విద్యా వ్యవస్థ నాశనం
గత ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అవలంభించిందని, అసమర్థ నిర్ణయాలతో విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టిందని ధ్వజమెత్తారు. ప్రీ స్కూల్ 1,2 తరగతులు అంగన్‌వాడీలు, 3 నుంచి 10 తరగతులు హైస్కూల్లో విలీనం చేయడం వల్ల 2 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యా విధానంతో ఇంటి వద్ద చదు వుకునే పిల్లలు సుమారు మూడు, నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లి చదవాల్సిన దుస్థితి ఏర్పడిరదన్నారు. ఈ విధానం వల్ల ప్రైవేటు విద్యా సంస్థలకు అడ్మిషన్లు పెరిగాయని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు.
కేంద్ర విద్యా విధానంతో అస్తవ్యస్తం
కేంద్ర విద్యావిధానం వల్ల ప్రైమరీ స్కూల్లో ఉన్న 3,4,5 తరగతులు తీసేసి 1,2 తరగతులు పెట్టారని దీనివల్ల విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోయిందని, 3,4,5 తరగతులను హైస్కూల్లో విలీనం చేయడంతో అక్కడ సంఖ్య పెరిగిందని తెలిపారు. ప్రైమరీ స్కూళ్లలో టీచర్లు ఎక్కువగా, హైస్కూల్లో టీచర్ల కొరత ఏర్పడిరదని వెల్లడిరచారు. కేంద్ర విద్యా విధానం వల్ల విద్యా వ్యవస్థ అంత అస్తవ్యస్తమైందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం జాతీయ విద్యా విధానం కింద చేసిన పాఠశాల విలీనం వల్ల 5 వేల పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడిరదని, 11 వేల పాఠశాలల్లో ఏకోపాధ్యాయులు ఉన్నారన్నారు. 16 వేల పాఠశాలల్లో విద్యా విధానం కుంటుపడిరదన్నారు.
ఐబీ, సీబీఎస్, టోఫెల్ రద్దు దిశగా అడుగులు
గత ప్రభుత్వం బైజూస్ ద్వారా ట్యాబ్‌లు కొని పనికి రాకుండా చేసిందని, దీనికి వల్ల వందల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. ఈడీఎక్స్ ద్వారా ఐబీ సిలబస్ తీసుకొచ్చిందని, హైదరాబాద్ వంటి మహానగరంలో కేవలం రెండు, మూడు పాఠశాలల్లో అది అందు బాటులో ఉందన్నారు. అలాంటి సిలబస్ హైస్కూల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించిందన్నారు. సీబీఎస్ సిలబస్ ఉండాలని 1000 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిందన్నారు. ఇలాంటి ప్రయోగాలతోనే విద్యా వ్యవస్థలో ఇబ్బందికర పరిస్థితి వచ్చిందన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల సరిచేయాలంటే ఉపాధ్యాయ సంఘాల సహాయం కూడా అవసరమని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే గ్యారంటీ పెన్షన్ స్కీం జీవోను రద్దు నిలుపుదల చేసిందని, మరుగుదొడ్లు, కొన్ని అభ్యంతరకర యాప్‌లను తొలగించామని తెలిపారు. టోఫెల్ ట్రైనింగ్, ఐబీ సిలబస్, సీబీఎస్ సిలబస్ రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. వైకాపా ప్రభుత్వం విద్యా వ్యవస్థను నష్టపరచడానికి తీసుకున్న నిర్ణయాలన్నీ సమీక్షించి రద్దు చేస్తామని వెల్లడిరచారు.
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రద్దు చేస్తాం
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ దిశగా గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 117 కేంద్ర ప్రభుత్వంతో ముడిపడిన అంశమని తెలిపారు. జీవో నంబర్ 117ను ఈ విద్యా సంవత్సరం లేదా వచ్చే విద్యా సంవత్సరం కానీ రద్దు చేసే దిశగా అడుగులు వేస్తామని తెలిపారు. ఇలాంటి పరిస్థతి లో విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే భాగంగా సర్దుబాటు ప్రక్రియ ప్రభుత్వం తీసుకొ చ్చిందన్నారు. ఈ సర్దుబాటుకు కొన్ని ఉపాధ్యాయ సంఘాలు సలహాలు, సూచనలు చేశాయ ని, కొన్ని సంఘాలు యుద్ధం ప్రకటించాయన్నారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు స్వార్థాని కో, రాజకీయ కారణాలకో తెలియదు కానీ సర్దుబాటు అంశాన్ని వ్యతిరేకిస్తు న్నాయని తెలిపారు. మెరుపు సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్నాయని..గత ప్రభుత్వంలో ఇదే సంఘాలు తమ ఉనికిని కూడా కాపాడుకోలేకపోయాయని వెల్లడిరచారు. యాప్‌ల పేరిట దారుణంగా వ్యవహరించినా మాట్లాడకుండా ఉండిపోయాయని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాలు సహకరించాలని కోరారు.
ప్రపంచంలోనే నాణ్యత లేని విద్యా విధానం
విద్యావేత్త మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వంలో విద్య విషయంలో అనేక పురోగామి చర్యలు తీసుకుందన్నారు. డీఎస్సీతో లక్షా 70 వేల మందిని ఉపాధ్యాయులను తీసుకుందన్నారు. జగన్‌రెడ్డి సీపీఎస్ రద్దు దొంగ హామీలను ఉపాధ్యా యులు నమ్మారన్నారు. చివరిరోజుల్లో 6100 మందితో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు. గత ఐదేళ్లలో విద్యకు ఎన్నడూ జరగని హాని జరిగిందన్నారు. ప్రపంచంలోనే అత్యంత నాణ్యత లేని విద్యావిధానాన్ని తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. జెనీవా నుంచి సిలబస్ తయారు, బైజూస్‌తో ఒప్పందం అంటూ వారికి వందల కోట్లు దోచిపెట్టారన్నారు. పాఠశాల వ్యవస్థ సర్వనాశనం కావడానికి 117 జీవో తీసుకొచ్చి 3,4,5 తరగతులను హైస్కూల్లో కలిపి ప్రైమరీ వ్యవస్థను దెబ్బ కొట్టాడని మండిపడ్డారు. 11 వేల పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయని, 5 వేల స్కూళ్లు మూసేశారని తెలిపారు. అలాగే 1000 పాఠశాలల్లో సీబీఎస్ సిలబస్ తీసుకొచ్చారని మండిపడ్డారు.