- ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందో కూడా చెప్పలేని ప్రభుత్వమిది
- ఎంత పరిహారం ఇస్తారు.. ఎందరు రైతులకు బీమా చేశారు
- జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్
- రైతు ఆత్మహత్య బాధాకరమని ఆవేదన
రేపల్లె : తీవ్ర తుఫాన్ మిచౌంగ్ దెబ్బకు ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందో కూడా చెప్ప లేని అసమర్థ పభుత్వం రాష్ట్రంలో ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం నగరం మండలంలోని ఉత్తరపా లెంలో తుఫాన్ పంట నష్టాన్ని పరిశీలిం చిన చంద్రబాబు రైతులతో మాట్లాడు తూ సర్వం కోల్పోయిన రైతుల్ని పరామర్శించి, ధైర్యం చెప్పడానికి వచ్చానన్నారు. ఎక్కడ చూసిన హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. తాను వస్తుంటే దారిలో కిలోమీటర్ల కొద్దీ చేతికొచ్చిన పంట నీట మునిగి కనిపిస్తోందని అవేదన వ్యక్తం చేశారు.
ఈ ముఖ్యమంత్రికి కొంచెం కూడా తెలివి లేదు, ఉంటే రైతులు నష్టపోకుండా చూసేవాడు. లక్షలాది మంది రైతులు నష్టపోయారు, వారు మళ్లీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది? ఎంత మంది రైతుల పంటలకు బీమా చేశారు? ఎంత నష్ట పరిహారం ఇస్తారు? ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తమ హయాంలో తిత్లీ, హుదూద్ తఫాన్ల సమయంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం మాత్రం తగ్గించగలిగామన్నారు. నాడు పది రోజుల పాటు తుఫాను ప్రాంతాల్లోనే ఉండి ప్రజల కష్టాలు తీర్చాను, నా బాధ్యతను మరచిపోలేదు. ఈ ప్రభుత్వానికి అడుగడుగునా నిర్లక్ష్యం అహంకారం.. వెరసి రైతుల పాలిట శాపంగా మారింది. తెలుగుదేశం హయాంలో పట్టిసీమ తెచ్చి రైతులను ఆదుకున్నాను. 13 లక్షల ఎకరాలకు నీరందించాలని 10 నెలల్లో పట్టిసీమ పూర్తి చేశాను.
పంటలు కాపాడిన పార్టీ తెలుగుదేశం. గోదావరి నది జలాల ద్వారా కృష్ణా డెల్టాలో లక్షల ఎకరాలు సాగుబడిలోకి వచ్చింది. దుగ్గిరాలలో బసవ పున్నయ్య అనే రైతు 7 ఎకరాల్లో వరి ధాన్యం వేసి.. తుపానుతో నష్టపోయి, ఆదుకునే దిక్కులేక ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. బీమా ఉండిఉంటే రైతుకు భరోసాగా ఉండేది. నాలుగున్నరేళ్లుగా రైతుల జీవితాలతో ఆడుకున్నాడు. పంటలకు నీరు ఇవ్వలేదంటే రైతుల మీద కేసులు పెడతారు. మురికి కాలువ తీయలేదంటే వారిపై కేసులు పెడతారు. రోడ్లు, ఇరిగేషన్, వ్యవసాయశాఖ లను విధ్వంసం చేశారు. చివరికి రాజధాని కూడా లేకుండా చేసి ఉసురు పోసుకున్నారని చంద్రబాబు విమర్శించారు.
నేడు పర్చూరు, పెదనందిపాడుల్లో చంద్రబాబు పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శని వారం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పర్చూరు, పెదనందిపాడు మండలాల్లో పర్యటించి తుఫా న్‌కు దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతుల కు ధైర్యంచెబుతారు. శుక్రవారం రాత్రి బాపట్ల లో బసచేసిన ఆయన శనివారం ఉదయం బయలుదేరి 11గంటలకు పర్చూరు మండలం లోని చెరుకూరు గ్రామంలో దెబ్బతిన్న పంటల ను, పొలాలను ముంచెత్తిన పర్చూరు వాగును పరిశీలిస్తారు. అనంతరం పెదనందిపాడు మం డలంలోని చిననందిపాడు గ్రామంలో నష్టపో యిన పంటలు పరిశీలించి, రైతులతో మాట్లాడ తారు.తరువాత పెదనందిపాడు చేరుకుని,అక్క డినుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకు ని,రాత్రి 8గంటలకు విమానంలో హైదరాబాద్ వెళతారు.