టెన్త్ కూడా సరిగ్గా చదవని పాతకాలపు రైతు. లాభసాటిలేని సాగును వదిలేసి `రాజకీయ మడిలోకి దిగాడు. అదృష్టం కలిసొచ్చింది. తెదేపా ఎమ్మెల్యేగా పదవి దక్కింది. కాని `అతనికి కావాల్సింది ఆస్తులు. అందుకు `నేర రూప రాక్షసి వైసీపీ వైపు చూశాడు. జగన్ సారథ్యంలో `అక్రమార్జనకు తావు దొరికింది. అంతే `పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో అవినీతి విత్తు నాటాడు. విషపూరిత గంజాయికంటే బలమైన పంటే పండిరది. అలా `రాజకీయ వ్యవసాయ క్షేత్రంలో కోట్లు కూడబెట్టాడు. పుణ్యక్షేత్రమైన మంత్రాలయం కూడా `అతని అవినీతి ముందు మౌనం వహించక తప్పలేదు. `మూడుసార్లు తన రాక్షస పరాక్రమాన్ని చూపించి ‘హ్యాట్రిక్’ భుజకీర్తిని తగిలించుకున్నాడు. ఆ ఉత్తమ అవినీతి రాజకీయ రైతు పేరు `యెల్లారెడ్డిగారి బాలనాగిరెడ్డి. ముసలి వయసులో సాధించిన ముద్దు పేరు `బాలనాగు. అనకొండను సైతం ఆవకాయ బద్ధలా బుగ్గన పెట్టుకోగల `క్రైం క్రోకడైల్.
వైసీపీని ఏలుతున్న అవినీతి చక్రవర్తి జగన్.
మంత్రాలయానికి సామంత బాధ్యతలు బాలనాగుకు ఇచ్చాడు. అలా `నియోజకవర్గాన్ని చప్పరించి బలపడ్డాడు బాలనాగు. వయసు మీదపడటంతో అవినీతి పాలనా సౌలభ్యం కోసం `సామంత రాజ్యాన్ని నాలుగు దత్త మండలాలుగా విభజించాడు. కుటుంబాన్నే దత్త నాయకుల్ని చేసి `మొత్తం మంత్రాలయాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్నాడు బాలనాగు. దత్త నాయకులుగా `కౌతాళం మండలానికి పీఏ వెంకట్రామిరెడ్డి, కోస్గి మండలానికి ఎమ్మెల్యే బావమరిది మురళీరెడ్డి, మంత్రాలయానికి అన్న కొడుకు ప్రదీప్‌రెడ్డి, పెదకడగూరుకు అన్న సీతారాంరెడ్డి నియమితులయ్యారు. మొత్తం పర్యవేక్షణ బాధ్యతలన్నీ భార్య జయమ్మ, కొడుకు ధర్మేందర్‌రెడ్డి చూస్తుంటారు.
చేతికి మట్టి అంటకుండా..
బాలనాగు పాలనలో `మంత్రాలయం ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది. తడినవ్వుతో గొంతులు కోసే నైపుణ్యవంతుడు కనుక `నియోజకవర్గంలో అవినీతి సైతం అంతే సైలెంట్‌గా సాగిపోతుంటుంది. కమిషన్ల కప్పం కట్టకుంటే `అడుగు ముందుకు వేయలేమని అందరికీ తెలుసు కనుక.. ఎమ్మెల్యేతో ఎవరికి వాళ్లే సెటిల్‌మెంట్లు చేసేసుకుంటుంటారు. ఎంత పద్ధతిగా అంటే.. చివరకు `అధికారులకు చెల్లించే వేతనాల్లోనూ ఎమ్మెల్యే వర్గానికి పర్సంటేజీలు ఇచ్చేసేటంత. ఏ పనికైనా సెగ్మెంట్‌లో టెండర్ పడాలంటే `పేపర్లు రూపొందించడం నుంచి బిల్లులు చెల్లించే వరకు అన్ని దశల్లోనూ బాలనాగుతో కాటు వేయించుకోక తప్పదు. బిల్లుల్లో సింహభాగం కమిషన్ల రూపంలో బాలనాగుకు హారతి ఇవ్వాల్సిందే. లేకుంటే పనులు ఆగిపోతాయి. బిల్లులు రావు. బాలనాగును ప్రసన్నం చేసుకోలేక కాంట్రాక్టర్లు పనులు మధ్యలో వదిలిపెట్టి పారిపోయిన సందర్భాలు లెక్కలేనన్ని.
2009లో బాలనాగు `రాజకీయ క్షేత్రంలోకి దిగేసరికి అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల విలువ 96 లక్షలు. అప్పులు సుమారు 12 లక్షలు. 2014లో బాలనాగు మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసినపుడు `అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల విలువ 1.85 కోట్లు. తిరిగి 2019లో మంత్రాలయం నుంచి పోటీ చేసినపుడు `అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తులు 2.29 కోట్లు. ప్రస్తుతం బాలనాగు ఆస్తుల విలువ 1800 కోట్లని అంచనా.
2019లో ఎమ్మెల్యే అయ్యేనాటికి పాతకాలం ఇన్నోవా కారు (ఏపీ 21ఎయన్116)లో తిరుగుతూ పెట్రోల్‌కు కూడా ఎవరు దాతలుంటారని ఎదురు చూసేవాడు. ఇప్పుడు 20కి పైగా ఖరీదైన వాహనాలు కొనుగోలు స్థాయికి ఎదిగాడు బాలనాగు. కర్నాటకలో దాబాలు, బెంగుళూరులో భూములు, హైదరాబాద్‌లో విల్లాలు, వడ్డీ వ్యాపారాలు.. ఇలా వందలకోట్ల సంపదను పెట్టుబడి పెట్టారు. ఐదేళ్లలో మంత్రాలయం బాలనాగు వెనకేసింది రూ.1800 కోట్లు.
కుటుంబ దోపిడీ..
నియోజకవర్గాన్ని దత్త మండలాలుగా విభజించి కుటుంబానికి అప్పగించడంతో.. అవినీతిలో ఎవరి టార్గెట్‌ను వాళ్లు సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఎక్కడైనా `ఒక కాంట్రాక్టర్ ఒకరికే పర్సంటేజీ ఇవ్వడం చూస్తాం. కానీ మంత్రాలయంలో మాత్రం ఎమ్మెల్యే భార్యకి 10శాతం, బామ్మర్దికి 5శాతం, కుమారుడికి 15శాతం, అనుచరులకు 2శాతం ఇవ్వాల్సిందే. వీళ్ల దందాకు పోను చివరికి మిగిలేదే కంట్రాక్టర్లు తీసుకోవాలి. నియోజకవర్గాన్ని ఫ్యామిలీ ప్యాక్‌లా మార్చుకుని సకుటుంబ దోపిడీకి తెరలపడం మంత్రాలంయలోనే చూస్తాం. ఇంటా బయటా అంతులేని అవినీతికి పాల్పడుతూ అధికారులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
ఎమ్మెల్యే బాలనాగు కొడుకు ధర్మేందర్ రెడ్డే ఇక్కడ షాడో ఎమ్మెల్యే. నియోజకవర్గ అరాచకాలకు కీలక సూత్రధారి. సెటిల్‌మెంట్లు, దందాలకు కేంద్ర బిందువు. కాంట్రాక్టర్లు ఇతని పేరు చెబితే పారిపోయే పరిస్థితి. ఇక ఎమ్మెల్యే సతీమణి జయమ్మ సెగ్మెంట్ సూపర్ బాస్. బాలనాగును గెలిపించుకోవడానికి సమిష్టిగా పనిచేసిన కుటుంబం `దందాలోనూ అంతే బాధ్యతలు చూపిస్తుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, గ్రావెల్ వ్యాపారస్తుల నుంచి వచ్చే డబ్బులు లెక్కలు చూడటం జయమ్మ బాధ్యత. దందాల ద్వారా వచ్చే సొమ్మును తిరిగి కాంట్రాక్టర్లకు, వ్యాపారస్తులకు అధిక వడ్డీలకు ఇచ్చి డబుల్ చేస్తుంటారు. బాలనాగు అన్న సీతారాం రెడ్డి. భూకబ్జాలు చేస్తూ బెదిరింపు చర్యలకు దిగడం, దొంగ పత్రాలు సృష్టించి భూములు మింగేయడం ఇతని కీలక బాధ్యతలు. సీతారాం రెడ్డి కొడుకు వై.ప్రదీప్‌రెడ్డి. కర్నాటక నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకొచ్చి నియోజకవర్గంలో అమ్మడం, రైతులను బెదిరించి తక్కువ మొత్తానికి భూములు సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, వడ్డీ వ్యాపారం, పంచాయతీలు ఇతని బాధ్యతలు. ఎమ్మెల్యే పీఎ వెంకట్రామిరెడ్డి `బదిలీలు, అవుట్‌సోర్సింగ్ పోస్టుల అమ్మకంలో కీలకపాత్ర పోషిస్తుంటారు. ఇక ఎమ్మెల్యే బావమరిది బాపురెడ్డి `ఇసుక, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఎమ్మెల్యే సతీమణి జయమ్మకు వాటాలు అందిస్తుంటారు. రేషన్ బియ్యాన్ని కర్నాటకకు తరలించి కోట్ల రూపాయలు సంపాదించాడు.
సెంటు స్థలం పేరుతో దోపిడీ
పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో కోట్ల రూపాయల అవినీతి దందాకు తెరలేపారు. పెదకబూరులో సెంటు స్థలాల కొనుగోలు కోసం అంటూ ఎకరా రూ.5లక్షల చొప్పున భూమిని కొనుగోలుచేసి ప్రభుత్వానికి రూ.45లక్షలకు అమ్మారు.ఇందులో రూ.20కోట్ల మేర వెనకేసుకోవడం జరిగింది. పెదకడుబూరు మండలం హనుమాన్‌పురం గ్రామంలో ఓంకారప్ప అనే రైతు భూమిని బాలనాగిరెడ్డి తనఅనుచరులతో కబ్జా చేయిం చుకుని రికార్డులు కూడా తారుమారు చేశారు. నియో జకవర్గంలో ప్రసిద్ధిగాంచిన ఈరన్నస్వామి ఆలయంలో ఎటువంటి టెండర్లు లేకండా ప్రసాదాలు,టెంకాయలు, తలనీలాల కాంట్రాక్టును కూడా కొట్టేశారు.
గ్రావెల్ మాఫియా..
నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్ చేస్తూ వాటిని చెరువుల్లా మార్చేశారు. మంత్రాలయం, రాగిమానుదొడ్డి, కంబదహల్ గ్రామాల్లో పెద్ద ఎత్తున ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. టిప్పర్ మట్టిని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు అమ్ముతూ నెలకు రూ.5 కోట్ల వెనకేసుకున్నారు.
ఇసుక దోపిడీ..
నియోజకవర్గంలో ఇసుక అనేదే లేకుండా బాలనాగిరెడ్డి దోపిడీకి పాల్పడుతున్నారు. ఏ వంకనూ వదలకుండా పెద్దఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడ్డాడు. మంత్రాలయం, మెలిగనూరు, తుంగభద్ర, మాదాపురం, గుడికంబాలి ఇసుక రీచ్‌ల నుండి పెద్దఎత్తున అక్రమ ఇసుక దందాకు పాల్పడ్డారు. సుగురువంక, కోస్గి, కౌతాళం నుంచి పెద్దఎత్తున ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. రోజుకి వంద టిప్పర్ల ఇసుకను ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండలకు సరఫరా చేస్తున్నారు. ఎన్జీటీ ఆదేశాలను సైతం ధిక్కరించి మైనింగ్ కొనసాగిస్తున్నారు. తుంగభద్ర నదినుంచి యధేచ్ఛగా జరుగుతున్న ఇసుక దోపిడీని ప్రశ్నించిన రైతులు, ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేసి జైలుపాలు చేశారు.
అవినీతి చేపలు
మంత్రాలయం మండలంలో నిబంధనలకు విరుద్ధంగా చేపల చెరువుల సాగుకు బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో అనుమతులు ఇచ్చారు. రైతులకు సాగునీరు అందించి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఏర్పాటు చేసిన పులికనుమ, గురురాఘవేంద్ర ప్రాజెక్టులను చేపల చెరువుగా మార్చేశారు. చిన్నతుంబలం చెరువులో ఎమ్మెల్యే కుటుంబసభ్యులే దగ్గరుండి చేపల చెరువులు సాగు చేస్తున్నారు. రైతుల పంట పొలాలకు సాగునీరు ఇవ్వడం లేదు కానీ అవినీతి బాలనాగు కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ చేపల చెరువులకు మాత్రం నీళ్లు వస్తున్నాయి. చినతుంబలం గ్రామం రాయలచెరువులో తరతరాలుగా చేపలు పట్టుకుని జీవనం కొనసాగిస్తున్న మత్స్యకారులను తరిమేసి `చెరువును ఆక్రమించుకోవడం బాలనాగు దౌర్జన్యానికి పరాకాష్ట.
భూమాఫియా..
నియోజకవర్గంలో ప్రభుత్వ భూమి అనేదే లేకుండా ఐదేళ్లలో భూములన్నింటికీ దొంగ పత్రాలు సృష్టించి ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేరు మీద బదలాయించుకున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఫైలు ముందుకు కదలాలంటే ఎమ్మెల్యే అనుమతి తప్పనిసరి. వారి అనుమతి లేకపోతే ఎటువంటి పనులూ ముందకెళ్లవు. కౌతాలం మండలం ఎరిగేరి గ్రామంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఉన్న భూమి గతంలో ల్యాండ్ సీలింగ్‌కు వెళ్తే, దాన్నీ పేదల ఇళ్ల పట్టాల పేరుతో లాక్కుని ఎమ్మెల్యే సతీమణి జయమ్మ ప్లాట్లు వేసి అమ్మడం జరిగింది.
మంత్రాలయంలో కర్నాటక మద్యం
కర్నాటకనుంచి పెద్దఎత్తున మద్యాన్ని అక్రమంగా నియోజకవర్గంలోకి తీసుకొచ్చేది ఎమ్మెల్యే వర్గమే. మద్యం మాఫియాను నిర్వహిస్తూ నెలకు రూ.20 కోట్ల మేర బాలనాగు వెనకేస్తున్నాడు. ఎమ్మెల్యే కుమారుడు, బామ్మర్దులు ఈ దందాను దగ్గరుండి నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం మద్యం దుకాణాలతోపాటు బార్‌లలో కూడా కర్నాటక మద్యం దర్శనమిస్తోంది. బెల్టు షాపులు కూడా గ్రామానికి 5 చొప్పున ఏర్పాటుచేసి తన అనుచరులతో అక్రమ మద్యం వ్యాపారం చేయిస్తున్నాడు.