- మా… ఇంటికొచ్చావా మారాజా..
- కాదమ్మా మనింటికొచ్చా.. మీ చంద్రబాబునొచ్చా…
ఇటీవల ఈ సన్నివేశాలు.. తరచూ కనిపిస్తున్నాయి. కోట్లకు పడగలెత్తిన వారికి కూడా సాకారం కాలేని దృశ్యాలు… సామాన్యుల ఇళ్లల్లో సాక్షాత్కరించడం.. అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతున్నాయి.
సీఎం చంద్రబాబు అంతరాళాల్లో దాగివున్న వాత్సల్యం ఆయన కొత్త ఆలోచనలతో వెలుగు చూస్తోంది.. వెల్లి విరుస్తోంది.. ఉరకలేస్తోంది. ఉప్పొంగుతోంది. ఈయన ముఖ్యమంత్రి చంద్రబాబేనా అని అనుకునే లోపే కాదు మీ చంద్రబాబును అంటూ గుండె గుడిలోకి ఆప్యాయంగా చొరబడి పోతున్నారు. ప్రపంచంలోని ఎన్నో దేశాలను తన రాజకీయ చాతుర్యంతో స్పృశించిన చంద్రబాబు తాను సాధించిన అభివృద్ధి ఫలాలను అందుకుంటున్న సామాన్యుల ఆవాసాల్లోకి తరచి చూస్తున్నారు. బీద, బడుగుల పూరిళ్లవైపు అడుగులేస్తున్నారు. నెలకోసారి పేదల ఇళ్లకు నేరుగా వెళుతున్నారు. వారి జీవితాల్లోకి తొంగి చూస్తున్నారు. వారితో కలగలిసి పోతున్నారు. ముచ్చట్లాడుతున్నారు. ఎవరి జీవితాలు బాగుపడాలని మనసులో అనుకున్నారో.. ఆటు వైపు మళ్లుతున్నారు.
ఇప్పుడు ఏకంగా పేదల ఇంట్లోకి వెళ్లిపోయి తానొక రాష్ట్రానికి ముఖ్యమంత్రినని మరిచిపోయి.. ఇల్లంతా కలియ తిరిగేస్తున్నారు. ఎక్కబడితే అక్కడ కూర్చుంటున్నారు. ఇంటికొచ్చిన చంద్రబాబును చూసిన అవ్వా, అమ్మా, తమ్ముడూ, చెల్లీ… ముందు కంగారు పడుతున్నారు. దండాలు పెడుతున్నారు. తేరుకునే లోపే ఆయన కలుపుగోలుతనానికి మైమరిచి పోతున్నారు. సొంత కొడుకులా తమ్ముడిలా, మనవడిలా అనేసుకుని మీద చనువుగా చేతులేసేస్తున్నారు. చేయీ చేయీ కలిపి కష్ట సుఖాలను మాటలతో ఒలకబోసేస్తున్నారు. అయితే చంద్రబాబు మనసెరిగిన వారు.. ఆయన విజన్ తెలిసిన వారు మాత్రం.. ఆయన వేస్తున్న అడుగు మాత్రం బడుగు జీవులకు బాసటేనని భావిస్తున్నారు. ఇక వారి జీవితాలు సాయం అందుకునే సామాన్యుల్లా కాకుండా వారే పదుటి వారికి సాయం చేసేలా మారతాయని ఘంటా భజాయిస్తున్నారు.