చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రాష్ట్రప్రభుత్వానికి వచ్చే ఆదాయం.. అప్పులు, వడ్డీలకే సరి

టిడిపి జాతీయ అధికార ప్రతినిధి జివి రెడ్డి

by చైతన్యరధం
Sep 2, 2022 at 12:37pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
రాష్ట్రప్రభుత్వానికి వచ్చే ఆదాయం.. అప్పులు, వడ్డీలకే సరి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ద్రవ్యలోటు, తెచ్చిన అప్పులపై వైసిపి ప్రభుత్వ తప్పుడు లెక్కలు
  • కేంద్రానికి దొంగలెక్కలు చెప్పి తప్పించుకోలేరు
  • శ్రీలంకలో సగటు అప్పు రూ.లక్ష.. ఏపీలో రూ.1.70 లక్షలు!
  • ప్రైవేటు సంస్థ అయితే ఈపాటికి దివాలా ప్రకటన చేసేది
  • జగన్‌ సీఎం అయ్యాక చేసిన అప్పు రూ.5.43 లక్షలకోట్లు
  • దేశం మొత్తం మీద ద్రవ్యలోటు అత్యధిక ఉన్న రాష్ట్రం ఏపీనే

    అమరావతి: సూట్‌ కేసు కంపెనీలు పెట్టి ప్రైవేట్‌ వ్యాపారాల్లో వేలకోట్లు దోచుకున్నట్లు కేంద్రానికి దొంగ లెక్కలు ఇచ్చి గత మూడేళ్లుగా పరిమితికి మించి అప్పులు చేశారని టిడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి దుయ్యబట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యా లయం ఎన్టీఆర్‌ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఆంధ్రప్రదేశ్ జగన్‌రెడ్డి సర్కారు కాగ్‌కు దొంగలెక్కలు సమ ర్పించందని ఆయన ఆరోపించారు.  జగన్‌ రెడ్డి బండారం బయటపడుతుందనే దొంగ లెక్కలు ఇస్తున్నారు.
    రాష్ట్రప్రభుత్వ అప్పులకు సంబంధించి అన్ని అంశాలను పరిశీలించి గతనెల 22తేదీన కేంద్రం వివిధ అంశాలకు సంబంధించి ఒక లేఖ రాసింది. కేంద్రం పంపిన నిధులని రాష్ట్ర ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేస్తోందో ఆ లేఖలో స్పష్టంగా పేర్కొంది. కేంద్రం రాసిన లేఖకు రాష్ట్రప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?
    అప్పులు, ద్రవ్యలోటులో తప్పుడు లెక్కలు
    ఆర్థికమంత్రి బుగ్గన, ఆర్థిక సలహాదారులు జులై 21న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఒక ప్రెస్‌ నోట్ విడుదల చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి మాకు ఫిస్కల్‌ డెఫిసిట్‌ (ద్రవ్యలోటు) చాలా తక్కువగా 2.09 శాతంగా చూపించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఉత్త రప్రదేశ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌ల కంటే ఆంధ్రప్రదేశ్‌లో తక్కువగా ఉందని చూపించారు. అయితే ఆగస్టులో విడుదల చేసిన కాగ్‌ రిపోర్టు తర్వాత వాస్తవ విషయాలు వెల్లడయ్యాయి. 2022 ఫిబ్రవరి వరకు రాష్ట్ర వాస్తవ అప్పు 55వేల కోట్ల పైచిలుకు ఉంటే దానిని మార్చికి 25వేల కోట్ల రూపాయలుగా తగ్గించి చూపించారు. ఒక్క సారిగా 30వేల కోట్ల రూపాయలు అకస్మాత్తుగా తగ్గడానికి బుగ్గన గారి మాయజాలమే కారణం. ఆర్థిక సంవత్సరం మార్చిలో ముగుస్తుంది. ద్రవ్యలోటు, రెవిన్యూ లోటు, డెట్‌ టు జిడిపి, ఎఫ్‌ఆర్‌ బిఎం వంటి వాటికి మార్చి చివరి లెక్కలెక్కలే ప్రాతిపదిక కాబట్టి అప్పులను తగ్గించి చూపించారు. ఆదాయ,వ్యయాలను వాస్తవ గణాంకాలతో సంబంధం లేకుండా చూపడం వల్ల తక్కువగా ద్రవ్యలోటు ఉన్నట్లు కన్పిస్తోంది. 2022 ఏప్రిల్‌, మే తరువాత లెక్కలు బయటికొచ్చాయి. తక్కువ చూపించిన 30వేల కోట్లను సరిచేయడానికి 2022 ఏప్రిల్‌లో 13వేల 422 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. సాధార ణంగా దివాలా అంచున ఉన్న ప్రైవేటు కంపెనీలు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి పబ్బం గడుపుకోవడానికి బ్యాలెన్స్‌ షీట్లు తారుమారు చేస్తుంటాయి.
    5నెలలకే ఏడాదికి సరిపడా అప్పు
    2022-23 ఆర్ధిక సంవత్సారానికి కేవలం పబ్లిక్‌ డెట్‌, కార్పొరేషన్‌ ద్వారా కాకుండా ఆర్బిఐ ద్వారా 46, 608 కోట్ల రూపాయలు 7.84శాతం వడ్డీ సగటుకి తెచ్చారు. ఈ ఆర్థిక సంవత్సారానిక ఉన్న లిమిట్‌ మొదట రూ.28 వేలకోట్లు మాత్రమే కాగా, తర్వాత కేంద్రాన్ని బతిమాలుకొని రూ.48వేల కోట్లకు పెంచుకున్నారు. రాష్ట్రం మొత్తం అప్పు ఆగస్టు 2022 నాటికి 8,87,397 కోట్ల రూపాయలు. జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు రాష్ట్రానికి తెచ్చిన అప్పు 5,42,902కోట్ల రూపాయలు. పరిమితికి మించిన అప్పు లు చేసి రాష్ట్రాన్ని దివాలా అంచుకు తీసుకెళ్లారు. ప్రస్తుత రాష్ట్ర ఆదాయం, అప్పులతో బేరీజు వేస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 80శాతం వడ్డీలకే సరిపోతుంది. కేంద్రప్రాయోజిత పథకాల నిధులనూ మళ్లించారు.
    అప్పులు తెచ్చి వడ్డీలు చెల్లిస్తారా?
    తీసుకొచ్చిన అప్పులని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కాకుండా వడ్డీలకువాడే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రప్రభుత్వం దివాలా అంచున ఉన్నట్లే. అందుకే మేం ఎపి..శ్రీలంక దారిలో ఉందని చెబుతున్నాం. కేంద్ర ప్రభు త్వం ఆగస్టు 22వ తేదిన రాసిన16పేజీల లేఖలో ప్రభుత్వం తెచ్చిన అనధికార అప్పుల చిట్టాను స్పష్టంగా పేర్కొ న్నారు. కేంద్రప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు ఇచ్చిన నిధులను రాష్ట్రప్రభుత్వం వాడేసుకుందని కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్‌ సెక్రటరీ సోమనాథన్‌ రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. లిక్కర్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని స్టేట్‌ బేవరేజ్‌ కార్పొరేషన్‌కి దారి మళ్ళించి 8వేల 305కోట్ల రూపాయలు 9.62శాతం వడ్డీతో తీసుకొచ్చారని మేం చెబితే లేదని బుకాంచారు. కేంద్ర రాసిన లేఖలో 2వ పేజీలోని 2వ పేరాలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఎఫ్‌ఆర్‌ బియం నిబంధనలకి విరుద్దమని కేంద్రం లేఖ రాసింది.
    డిస్కమ్‌ ల అప్పులపై సమాధానం లేదు
    డిస్కం అప్పుల గురించి కేంద్రం అడిగితే ఇప్పటి వరకు సమాధానం లేదు. రైతులకి ఇస్తున్న సబ్సీడీలు డిస్కమ్‌ లకు చెల్లించడం లేదు. సమాధానం చెప్పకుండా ఎన్నిరోజులు దాక్కుంటారు. ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా డిస్కమ్‌లు అప్పలు భారంతో దివాలా అంచున ఉన్నాయి. పవర్‌ జనరేటింగ్‌ కంపెనీలకు చెల్లించాల్సిన అప్పు రూ.10,109 కోట్ల రూపాయలు ఉందని కేంద్రం లేఖ రాసింది. మూడు నెలల నుంచి ఎటువంటి పేమెంట్లు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టారు. ఏపేమెం ట్‌ చేయలేదు. కేంద్రం రాసిన లేఖలో పేజి నెం.4లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు.
    రాష్ట్రంలో కొత్తగా రైల్వేప్రొజెక్ట్‌ల కోసం అన్ని అనుమతులూ ఇచ్చిన కేంద్రం 2వేల 470హెక్టార్ల భూమిని కోరింది. దానికి సంబంధించి 3వేల 558కోట్ల రూపాయలు డబ్బు కూడా ఇచ్చింది. రైల్వే ప్రాజెక్టులకు కేవలం భూమిని కూడా రాష్ట్రప్రభుత్వం ఇవ్వలేకపోయింది. అమరావతిలో రైతులు ఇచ్చిన భూమిని ఏంచేస్తున్నారో అందరికీ తెలుసు. అందుకే ఈ ప్రభుత్వాన్ని నమ్మి భూమి ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో భూమిని సేకరించలేక పోతున్నారు. చంద్రబాబునాయుడు హయాం లో అప్పులచేసి భారాన్నే తాము మోస్తున్నామని వైసిపి ప్రభుత్వం చెబుతున్న మాటలు పూర్తిగా అబద్దం. ఒక్కో జిల్లాకు 50కోట్ల చొప్పున 7జిల్లాలకు ఇస్తుండగా,ఆ నిధులను వెనుకబడిన జిల్లాలకు వాడకుండా దారిమళ్లించా రు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అప్పులు, వడ్డీలకే సరిపోతుంది.
    శ్రీలంకకు మించిన అప్పులు
    శ్రీలంకలో వ్యక్తి సగటు అప్పు భారం రూ. లక్షకా గా, ఏపీలో రూ.1.70లక్షలుగా ఉది.ప్రైవేటు సంస్థ అయి తే ఈపాటికి కోర్టులో దివాలాపిటిషన్‌ పడేది. జగన్‌ సీఎం అయ్యాక రూ.5.43లక్షల కోట్లు అప్పు చేశారు. కేంద్రానికి దొంగ లెక్కలు ఇచ్చి కొనితెచ్చుకున్న సమస్యలే ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలపై కేంద్రం కూడా లేఖలు రాసే దుస్థితి నెలకొంది. కేంద్రానికి వాస్తవాలు చెప్పకుండా దాచలేరని తాజా లేఖతో రుజువైంది. ఏపీలో ద్రవ్యలోటు తక్కువగా ఉందని ప్రకటించడం పూర్తి అవాస్తవం. దేశం మొత్తంమీద ద్రవ్యలోటు అత్యంత అధ్వాన్నంగా ఉన్న రాష్ట్రం ఏపీనే. మూడు సంవత్సరాలుగా రాష్ట్రాన్ని సమ స్యలు వెంటాడుతున్నాయి. అప్పులు తెచ్చి పంచడానికి ప్రభుత్వమే అవసరం లేదు.. ఎవరైనా చేయొచ్చు. ఒక్క సంతకంతో పీడీ అకౌంట్లలో సొమ్ము లాగేసుకుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఎఫ్‌ ఆర్‌ రూల్స్‌ ప్రకారం రావాల్సిన అప్పులను కూడా వాళ్లు కంట్రోల్‌ చేయలేదు. ఇప్పుడు రాసిన లెటర్‌ ప్రకారం మార్చి 31న ఎఫ్‌ఆర్‌ బిఎం ను గట్టిగా అమలుచేస్తామని కేంద్రం చెబుతోంది. ఈ విషయంలో కేంద్రం తీరునుబట్టి వైసిపి ప్రభుత్వ భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందని జివి రెడ్డి పేర్కొన్నారు.

సంబంధితవార్తలు

చివరి నిమిషంలో సొంత కాంట్రాక్టర్లకు చెల్లింపులకు సిద్ధమైన జగన్ రెడ్డి

అది భూములు భక్షించే చట్టం

ఓటరు తుది జాబితాలోనూ అనేక తప్పులు

Tags: అప్పులుఆర్థికమంత్రికాగ్‌జగన్‌రెడ్డిజీవీ రెడ్డిడిస్కమ్‌తప్పుడు లెక్కలుద్రవ్యలోటుప్రైవేట్‌ వ్యాపారాలుబుగ్గనలేఖవడ్డీలుశ్రీలంకసర్కారుసూట్‌ కేసు కంపెనీలు
Previous Post

ఆర్థిక నేరాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన జగన్‌ రెడ్డి

Next Post

పేదల బియ్యాన్ని కూడా వదిలిపెట్టని వైసిపి ప్రభుత్వం

మరిన్ని వార్తలు

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట
ఆంధ్రప్రదేశ్

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

చైతన్యరధం
@ February 21, 2026
సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం
ఆంధ్రప్రదేశ్

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

చైతన్యరధం
@ February 21, 2026
ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది
ఆంధ్రప్రదేశ్

ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

చైతన్యరధం
@ February 21, 2026
అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం
ఆంధ్రప్రదేశ్

అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

చైతన్యరధం
@ February 21, 2026
టెన్త్‌లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి
ఆంధ్రప్రదేశ్

టెన్త్‌లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి

చైతన్యరధం
@ February 21, 2026
ఢిల్లీలో ఏఐ సమ్మిట్..ఏపీ సీఎం బిజీబిజీ…
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో ఏఐ సమ్మిట్..ఏపీ సీఎం బిజీబిజీ…

చైతన్యరధం
@ February 21, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

వెంకన్నతో పెట్టుకోవద్దు జగన్

చైతన్యరధం
@ February 21, 2026
వైసీపీ ఘోర అపచారం
ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఘోర అపచారం

చైతన్యరధం
@ February 21, 2026
Load More

ముఖ్య వార్తలు

వైసీపీ ఘోర అపచారం

వైసీపీ ఘోర అపచారం

చైతన్యరధం
@ February 21, 2026
నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

చైతన్యరధం
@ February 21, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

చైతన్యరధం
@ February 21, 2026
సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

చైతన్యరధం
@ February 21, 2026
ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

చైతన్యరధం
@ February 21, 2026
అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

చైతన్యరధం
@ February 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist