- అన్నదాతలను ఆదుకుంటా
- విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తా
- మద్య నియంత్రణకు ప్రాధాన్యత
- ఉన్నచోటే ఉద్యోగావకాశాలు కల్పిస్తా
- సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా
- ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు
- మహాశక్తితో మహిళలకు పెద్దపీట
- సకాలంలో అన్నివర్గాలకూ పింఛన్లు
- రోడ్లకు మహర్దశ తీసుకొస్తా
- రేషన్ ద్వారా మళ్లీ 8 రకాల వస్తువులు
- భవితకు భరోసానిస్తున్నా!
- అన్నివర్గాల సంక్షేమం కూటమి లక్ష్యం
- రాష్ట్ర పునర్నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం
- పది భరోసాలతో ప్రజా జీవితాల్లో వెలుగు
- ధరలు నియంత్రణతో భారం తగ్గిస్తా
- గిరిజనుల కోసం ఐటీడీఏ ఏర్పాటు చేస్తా
- వంశధార నిర్వాసితులకు న్యాయం చేస్తా
- కేంద్ర సహకారంతో పోలవరం పూర్తి చేస్తా
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తా
- ప్రజా చైతన్యం తేవాల్సిన బాధ్యత యువతదే
- ప్రజాగళంలో చంద్రబాబు పిలుపు
- పాతపట్నంలో పోటెత్తిన జనకెరటం
పాతపట్నం (చైతన్యరథం): ‘జగన్ అసమర్థ పాలనా విధానాల కారణంగా రాష్ట్రంలోని అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయి. అన్ని వర్గాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునాధుల నుంచీ పునర్నిర్మించుకోవాల్సిన తరుణమిది. కూటమిని గెలిపించండి. అన్ని వర్గాల భవితకు భరోసానేనిస్తా. అన్ని వ్యవస్థలనూ పునరుత్తేజితం చేస్తా. నవనోత్తేజిత నవ్యాంధ్రను ఆవిష్కరించే బాధ్యత నాది. చైతన్యంతో ముందుకు కదలాల్సిన బాధ్యత మీది’ అని రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దఎత్తున సాగిన పాతపట్నం ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబు అమితోత్సాహంతో పది భరోసాలు ప్రకటించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న ప్రధాన వ్యవస్థలు, వర్గాలను ప్రస్తావిస్తూ.. దెబ్బతిన్న రాష్ట్రం ఉనికి కాపాడుకోవడానికి ప్రతి పౌరుడూ, యువత కంకణం కట్టాల్సిన సమయం ఇదేనన్నారు. గత ఎన్నికలలో జగన్‌కు ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా విధ్వంస పాలకుడిగా, చరిత్రహీనుడిగా మిగిలాడని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు పది భరోసాలు ప్రకటించారు.
అన్నదాతలను ఆదుకుంటా
జగన్ పాలనలో దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకునే భరోసాను చంద్రబాబు ప్రకటించారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించి, పంటలబీమా అమలు చేస్తామని, సాగునీరు సమృద్ధిగా అందించి బంగారం పండిరడే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. యేటా పంట పెట్టుబడిగా 20వేలు ఇస్తామని, వ్యవసాయేతర అనుబంధ రంగాలనూ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆక్వా రంగానికీ ప్రాధాన్యతనిచ్చి, సబ్సిడీలు అందించి, అభివృద్ధికి బాధ్యత తీసుకుంటానన్నారు. వ్యవసాయాన్ని ఆధునీకరించి సాగు ఖర్చులు తగ్గించి, దిగుబడి పెంచే మార్గం చూపిస్తానని, రైతును రాజు చేస్తానని భరోసానిచ్చారు. రాష్ట్రంలో జగన్ దోపిడికి హద్దులేకుండా పోయిందని, ఇసుక, మద్యం, గ్రావెల్ సహజవనరులన్నీ దోపిడి చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మేంటి? భూములు జగన్ ఇచ్చాడా? అని ప్రశ్నించారు. సర్వే రాళ్లపైనా సైకో బొమ్మలు వేసుకున్నాడని, చుక్కల భూములు కొట్టేశాడన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌తో భూదోపిడీకి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే కొత్త చట్టాన్ని రద్దుచేస్తామని హామీ ఇచ్చారు.
విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తా
విద్యుత్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచిన జగన్‌ను తరిమికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే విద్యుత్ సంస్కరణలపై దృష్టి పెడతానని, కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదన్నారు. సోలార్ విధానాలను అందుబాటులోకితెచ్చి విద్యుదుత్పాదక అవకాశాలు కల్పించడమే కాకుండా, మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అమ్మి సంపద సృష్టించుకునే వినూత్న కార్యక్రమాలు అందుబాటులోకి తేనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.
మద్య నియంత్రణకు సత్వర చర్యలు
మద్య నిషేధం తరువాతే ఓట్లడుగుతానన్న జగన్ `నాసిరకం మద్యాన్ని పరవళ్లు తొక్కించడమే కాకుండా అధిక ధరలకు అమ్మి కోట్ల రూపాయల ప్రజాధనం కొల్లగొట్టాడని, ప్రజలకు అనారోగ్యం మిగిల్చి అక్కచెల్లెమ్మల తాళిబొట్లు తెంచిన దుర్మార్గుడని దుమ్మెత్తిపోశారు. అధికారంలోకి రాగానే మద్య నియంత్రణపై దృష్టిపెట్టి ప్రజారోగ్యం కాపాడుతానన్నారు. సైకో జగన్ విధానాల కారణంగా రాష్ట్రం గంజాయిమయమైందని, యువత ప్రమాదకర స్థితిలో ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. తాను అధికారంలోకి రాగానే గంజాయిని ఉక్కుపాదంతో అణిచేస్తానని భరోసానిచ్చారు.
ఉన్నచోటే ఉద్యోగావకాశాలు కల్పిస్తా
ఉద్యోగావకాశాలు లేక యువత విలవిల్లాడుతోందని చంద్రబాబు చలించిపోయారు. జాబు రావాలంటే బాబు రావాలన్నది నినాదం కాదని, నిజం చేస్తానని భరోసానిచ్చారు. అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిపస్సీపైనే పెడతానని, క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తానని హామీ ఇస్తూ, పెట్టుబడులు సాధించి పరిశ్రమలు తీసుకురావడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు భృతిని కల్పించి ఆత్మస్థయిర్యం పాదుకొల్పుతానన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి రుణం తీర్చుకునే బాధ్యత తనదని చంద్రబాబు ప్రకటించారు. పాతపట్నం యువత రాష్ట్రం నలుమూలలకు వెళ్లి పనిచేసుకోవాల్సిన దుస్థితి లేకుండా.. ఉన్నచోటినుంచే సుదూర ప్రాంతాల కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకునే ‘వర్క్ ఫ్రమ్ హోం’ ఫెసిలిటీ కల్పిస్తానన్నారు. యువత ఉన్నత చదువులు చదివేందుకు అవసరమైన విద్యా సంస్థలు నెలకొల్పేందుకూ ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థకు అన్యాయం చేసేది లేదని చెబుతూనే, నెలకు గౌరవ వేతనంగా పదివేలు ఇస్తామని చంద్రబాబు భరోసా నిచ్చారు.
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా
పెండిరగ్ ప్రాజెక్టులు త్వరతగతిన పూర్తిచేసి ఈ ప్రాంత స్వరూపాన్ని మారుస్తానని చంద్రబాబు భరోసానిచ్చారు. ప్రాజెక్టుల పూర్తితో సాగు, తాగునీటి ఇబ్బందులు అధిగమించవచ్చని చెబుతూనే, సురక్షిత మంచినీరు ఇంటింటికీ అందించే పథకాన్ని తీసుకొస్తానన్నారు. అదేవిధంగా కేంద్రం సాయంతో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి `నదుల అనుసంధానంతో అద్భుతాలు సాధిద్దామని భరోసానిచ్చారు.
ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు
ప్రజాస్వామ్యంలో ఉద్యోగస్తులూ కీలక భాగమేనంటూ, జగన్ ఏలుబడిలో అన్నివిధాలా నష్టపోయిన ఉద్యోగ వర్గాలకు పూర్తి న్యాయం చేసే బాధ్యత తనదని చంద్రబాబు భరోసానిచ్చారు. ప్రతినెలా ఫస్ట్‌కే జీతాలు అందే ఏర్పాట్లు చేస్తానని, పెండిరగ్ బకాయిలు త్వరతగతిన క్లియర్ చేస్తానన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లూ మొదటి రోజునే అందే ఏర్పాట్లు చేస్తానని భరోసానిస్తూ.. మెరుగైన పీఆర్సీ అమలు చేసే బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు.
మహాశక్తితో మహిళలకు పెద్దపీట
మహిళలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని గుర్తు చేస్తూ, ఆడబడుచులకు తెదేపా పుట్టినిల్లని వ్యాఖ్యానించారు. ఈసారి మహిళలకు ప్రత్యేక పథకాలు రూపొందించామని చెప్తూ, ‘మహాశక్తి’ పథకంతో మహిళలకు ఎనలేని లబ్ది చేకూరుస్తున్నట్టు ప్రకటించారు. ఈ పథకంలో తల్లికి వందనం పేరిట ఎంతమంది పిల్లలుంటే అందరినీ చదివించేందుకు ఒక్కొక్కరికీ ఏటా 15వేలు అందిస్తామని, ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఆర్థిక భరోసా కల్పిస్తున్నామన్నారు. అలాగే డ్వాక్రాలను బలోపేతం చేసి సున్నా వడ్డీకింద పది లక్షల వరకూ రుణాలిస్తామన్నారు. దీపం కింద ఏటా 3 ఉచిత సిలెండర్లు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. నామమాత్రపు సంక్షేమం ఇస్తూ మాయమాటలతో జగన్ అక్కచెల్లెమ్మలను దారుణంగా మోసం చేశాడని చెప్తూ, నాన్న ఆస్తిలో చెల్లికి ఇవ్వాల్సిన హక్కును అప్పుగా ఇచ్చిన దుర్మార్గుడు జగన్ అని చంద్రబాబు దుయ్యబట్టారు. అలాంటి అన్న మీ ఇంటికి కావాలా? అని మహిళలను ప్రశ్నించారు.
సకాలంలో అన్నివర్గాలకూ పింఛన్లు
వచ్చెనెల మొదటి తారీఖునే అర్హులందరికీ పింఛన్లు అందించాలని జగన్‌ను చంద్రబాబు హెచ్చరించారు. శవరాజకీయాలకు ఫుల్‌స్టాప్ పెట్టి, సమయానికి పింఛన్లు ఇవ్వకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ అర్హులందరికీ నెలవారీ పింఛను రూ.4వేలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. పెంచిన పింఛను ఏప్రిల్‌నుంచే అమలు చేస్తామని చెబుతూ, 1వ తేదీన ఇంటిదగ్గరే పింఛన్లు అందిస్తామని భరోసా ఇచ్చారు. వికలాంగులకు రూ.6వేలు, 50యేళ్లు దాటిన బీసీలకు నెలకు రూ.4వేలు పింఛను ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
రోడ్లకు మహర్దశ తీసుకొస్తా
జగన్ ఏలుబడిలో రాష్ట్రంలోని రహదార్లు దౌర్భాగ్య స్థితికి చేరాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తెదేపా ప్రభుత్వం హయాంలో అద్భుతంగా తీర్చిదిద్దిన రోడ్లను జగన్ నిర్లక్ష్యంతో అధ్వాన్నస్థితికి తీసుకొచ్చాడని దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారులను తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్న భరోసాను చంద్రబాబు ప్రకటించారు.
రేషన్ ద్వారా మళ్లీ 8 రకాల వస్తువులు
రేషన్ లబ్దిదారులకు పూర్వ లబ్దిని అందిస్తామన్న భరోసానిచ్చారు చంద్రబాబు. తెలుగుదేశం హయాంలో 8 వస్తువులు అందిస్తే.. జగన్ పాలనలో ఒకటి, రెండు వస్తువులకూ దిక్కులేని పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ షాపుల్లో మళ్లీ 8 వస్తువులు అందిస్తామని భరోసానిచ్చారు. పెరిగిన నిత్యావసరాలు, పెట్రోలు ధరలు, విద్యుత్ ఛార్జీల కారణంగా దెబ్బతిన్న మధ్యతరగతి వర్గాలనూ ఆదుకుంటామని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. గత ఎన్నికల్లో జగన్ అడిగిన ఒక్కఛాన్స్ ప్రజలు ఇచ్చారని, అదే చివరి ఛాన్స్ అని చంద్రబాబు హెచ్చరించారు. రాజకీయాల కోసం తాము పొత్తు పెట్టుకోలేదని, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పెట్టుకున్న పొత్తును ప్రజలు అర్థం చేసుకుని ఆశీర్వదించాలని చంద్రబాబు కోరారు.
గోవిందరావును, రామ్మోహన్‌నాయుడుని గెలిపించండి
ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గోవిందరావును, ఎంపీగా రామ్మోహన్‌నాయుడుని గెలిపిస్తే `పాతపట్నం చరిత్ర తిరగరాసేలా అభివృద్ది చేసుకుందామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గిరిజనులకు ఐటీడీఏ మంజూరు చేస్తామని, మహిళా డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్, వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని, వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీనిచ్చారు.