సహకారం రంగంలో అతిపెద్ద రంగం డెయిరీ అని ధూళిపాళ్ల నరేంద్ర సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వాల సహకారంతో దశాబ్దాలుగా మనుగడలో ఉన్న డెయిరీ రంగాన్ని నిర్వీర్యం చేసి స్వలాభం కోసం గుజరాత్ నుండి అమూల్ ను తెచ్చి 3వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులు, రాయతీలు కట్టబెట్టి అమూల్ కి తానే బ్రాండ్ అంబాసిడర్ గా మారి వాటాల లబ్ధి పొందుతున్న జగన్ రాష్ట్ర డెయిరీల కోసం కనీసం 3 కోట్లు అయినా ఎందుకు సహకారం అందించలేదో చెప్పాలని సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.