రాయదుర్గం,చైతన్యరథం: జగన్ ది దరిద్ర పాదమని, గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా అనంతపురం జిల్లా ప్రజలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారని నారా లోకేష్ పేర్కొన్నారు. శంఖారావం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా రాయదుర్గం నియోజకవర్గం మాల్యం గ్రామంలో సాగునీరు లేక బీడువారిన పొలాలు, గతుకుల రోడ్లు చూసి ఆయన చలించిపోయాను. ప్రజల కష్టాలను గాలికొదిలేసి… ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్ ల పేరుతో ప్రజల రక్తాన్ని తాగుతున్న జగన్ రాయలసీమ బిడ్డ కాదు… ఈ ప్రాంతానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని అన్నారు. అయిదేళ్ల పాలనలో పట్టుమని పదెకరాలకు కూడా సాగునీరు అందించలేని అసమర్థుడని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా లక్షలాది సీమ రైతుల జీవితాల్లో వెలుగులు నింపడమేగాక కరువుసీమలో కార్లపంట పండిరచిన అపర భగీరథుడు మన చంద్రన్న అని గుర్తు చేశారు. గజదొంగ జగన్ కావాలో, విజనరీ లీడర్ చంద్రబాబు కావాలో తేల్చుకోవాల్సింది విజ్ఞులైన సీమ ప్రజలేనన్నారు.