- ఎన్నికేసులైనా పెట్టుకో.. మీ ఇష్టం
- భయం మా బయోడేటాలో లేదు జగన్ రెడ్డీ
- ప్రవీణ్‌కుమార్‌రెడ్డి చేసిన తప్పేమిటి?
- బాధితులపై కేసులు రాజారెడ్డి రాజ్యాంగం స్పెషల్
- మా నినాదం అభివృద్ధి వికేంద్రీకరణ
- అమరావతి రైతులపై దాడులు సైకోయిజం
- కడప జిల్లా పర్యటనలో యువనేత లోకేష్
- ప్రవీణ్ కుమార్‌రెడ్డి కుటుంబానికి పరామర్శ
కడప: తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్న పిల్లికి టిడిపి నాయకుల్ని చూస్తే వణుకు.. టిడిపి నాయకులు బయట తిరిగితేనే భయపడిపోతున్నారు. టిడిపి కార్యకర్త ట్వీట్ పెడితే ప్యాలెస్ పిల్లికి తడిచిపోతోందని టిడిపి యువ నేత, తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. వైసిపి తప్పుడు కేసుల తో కడప జైలులో రిమాండ్‌లో ఉన్న ప్రొద్దుటూరు ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని కడప జైలులో లోకేష్ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా జైలు వెలుపల లోకేష్ విలేకరులతో మాట్లాడు.. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నారు. ప్రజాసమస్యలపై పోరాడినా, ప్రశ్నించినా టిడిపి నాయకుల్ని, కార్య కర్తల్ని అరెస్ట్ చేసి, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ మర్చి పోయారు. జగన్ పీనల్ కోడ్ అమలు చేస్తున్నారు. జగన్‌రెడ్డి పాలనలో రివర్స్ పోలీసింగ్ నడుస్తుంది. బాధితులపైనే కేసులు పెట్టడం రివర్స్ పోలీసింగ్ స్పెషల్ అని అన్నారు. టిడిపికి చెందిన 60 మంది ముఖ్యనాయకులు, 5వేల మంది కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. 70మంది తెలుగుదేశం పార్టీ నాయ కులు, కార్యకర్తల్ని హత్య చేసారని తెలిపారు.
టిడిపి సీనియర్లపై కక్షసాధింపు చర్యలు
వేల కోట్ల ఆస్తిని పేద ప్రజల కోసం దానం చేసిన వ్యక్తి అశోక్ గజపతి రాజు గారు…అలాంటి వ్యక్తి పై అక్రమ కేసులు పెట్టి వేధించిన చెత్త ప్రభుత్వం జగన్ సర్కారు అని లోకేష్ మండిపడ్డారు. మా సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప కాకినాడలో ఒక పెళ్లికి వెళితే ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అసెంబ్లీలో నిలదీస్తున్నారని మా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై అక్రమ కేసు లు పెట్టి వేధించారు. ఇక అయ్యన్నపాత్రుడు మాట్లాడి తే కేసు, నిలబడితే కేసు, కూర్చుంటే కేసు. చింతమ నేని ప్రభాకర్ కారు ఎక్కితే కేసు… కారు దిగితే కేసు. ఇంకా విచిత్రం ఏంటంటే సీఎం సొంత నియోజక వర్గం పులివెందులలో నాగమ్మ అనే దళిత మహిళని చంపేస్తే కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన టిడిపి ఎస్సి నాయకులు ఎంఎస్ రాజు, అనితపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. వివేకా గారి కుటుం బానికి న్యాయం చెయ్యమని మాట్లాడినందుకు బిటెక్ రవిపై పెట్టిన కేసులకు లెక్కే లేదు. అంతర్జాతీయ టెర్రరిస్ట్ రేంజ్‌లో రన్ వే పై అరెస్ట్ చేశారు.
ప్రవీణ్‌కుమార్‌రెడ్డి చేసిన తప్పేమిటి?
ప్రొద్దుటూరు టిడిపి ఇంఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి చేసిన తప్పేంటి? ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేసారని లోకేష్ నిలదీశారు. ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడటమే ప్రవీణ్ చేసిన తప్పా? కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పోరాడిన వ్యక్తి ప్రవీణ్ రెడ్డి. ప్రవీణ్ ఇంటి పై దాడి చేసింది వైసిపి రౌడీలు, రాళ్లు వేసింది వైసిపి రౌడీలు. పోలీసులు అరెస్ట్ చేసింది ప్రవీణ్ కుమార్ రెడ్డిని. రాజారెడ్డి రాజ్యాంగంలో ముద్దాయిలను వదిలి బాధితులను అరెస్ట్ చేయడం కామన్. అందుకే ఏపీలో నడుస్తుంది రివర్స్ పోలీసింగ్ అంటున్నాను. ప్రవీణ్ కుమార్ రెడ్డి, టిడిపి నాయకుల పై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే పేరు రాచమల్లు ప్రసాద్ రెడ్డి కాదు రాచమల్లు బెట్టింగ్ రెడ్డి. నియోజకవర్గంలో భారీగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. ప్రొద్దుటూరు కేంద్రంగా నడుస్తున్న క్రికెట్ బెట్టింగ్ మాఫియా కి రాచమల్లు బెట్టింగ్ రెడ్డి డాన్. బెట్టింగ్ దందా నిర్వహించే వాళ్ళ నుండి కోట్ల రూపాయిల షేర్ ఎమ్మెల్యే కి వెళ్తుంది. బావమరిది బంగారురెడ్డి తో కలిసి భారీ దందాలు చేస్తున్నారు. దందాలు, సెటిల్ మెంట్లకు ఎమ్మెల్యే రాచమల్లు పోలీసులను వాడుకుంటున్నారు. ప్రొద్దుటూరులో రాచమల్లు బెట్టింగ్ రెడ్డి కలక్షన్ ఏజెంట్లుగా పెట్టుకున్న 9 మంది కానిస్టేబుళ్లను ఉన్నతాధికారుల బదిలీ చేస్తే వారే కావాలని రాష్ట్ర సచివాలయానికి వెళ్లి ఒత్తిడితెచ్చి మరీ వెనక్కి తెచ్చుకున్నారు. రెండేళ్ల కిందట ప్రొద్దుటూరు టిడిపి నేత నందం సుబ్బయ్యను హత్య చేసిన కేసులో ఎమ్మెల్యే ఆయన బావమరిది పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇంతవరకు కేసు నమోదు చేయలేదు.
భయం మా బయోడేటాలో లేదు
భయం మా బయోడేటాలో లేదు..ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకోమని లోకేష్ ముఖ్యమంత్రి జగన్ కు సవాల్ చేశారు. రాష్ట్రంలో ఎవరికి స్వేచ్ఛ లేదు. పవన్ కళ్యాణ్ కార్యక్రమాన్ని అడ్డుకోవడం, ఆయన బస చేస్తున్న హోటల్ లో సోదాలు, జన సేన కార్యకర్తల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాను. అభివృద్ది వికేంద్రీకరణ చేసి చూపించిన ఘనత మాది. పులివెందులకి నీళ్ళు ఇచ్చింది టిడిపి. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి మూడున్నర ఏళ్ళు అయ్యింది. సొంత జిల్లా కి చేసింది గుండు సున్నా. సొంత నియోజకవర్గంలో బస్ స్టాండ్ కట్టలేని వాడికి అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. పులివెందులలో ఉన్న బస్ స్టాండ్ ని ఆరు నెలల కిందట తొలగించారు. ప్రజల్ని చెట్ల కింద నిల బెట్టారు. ఏడాది కిందట కమలాపురం, జమ్మల మడుగు వద్ద రెండు వంతెనలు కూలిపోయినా ఇప్పటికీ పూర్తిచెయ్యలేదు. అక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏడాది కిందట రాజం పేట మండలంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకు పోయి 40 మంది చనిపోయారు. కోట్లరూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఇల్లు కోల్పోయిన మూడు గ్రామాల ప్రజలకు ఇల్లు కట్టిస్తామని జగన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పటికీ పునాదుల దశ దాటలేదు. వైఎస్ వివేకానంద రెడ్డిని దారుణంగా హత్య చేశారు. జగన్ రెడ్డి చెల్లెలు సునీతా రెడ్డి ఒంటరిగా పోరాడుతున్నారని లోకేష్ పేర్కొన్నారు. అప్రూవర్ గా మారిన దస్తగిరి ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేసాడు. ఎలక్షన్ ముందు డ్రామా చేసిన జగన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు బాబాయ్ హత్య గురించి మాట్లాడటం లేదు?
రాజధానిపై మడమతిప్పిన జగన్‌రెడ్డి
రాజధానిపై మాట మార్చింది.. మడమ తిప్పింది జగన్ రెడ్డి. 2014 ఏప్రిల్ 13 న మ్యానిఫెస్టో విడుదల చేస్తూ హైదరాబాద్ ని మించిన నగరం.. వాషింగ్టన్ డిసి లాంటి నగరం కడతామని అన్నారు.
ఎన్నికలు అయిన తరువాత 2014 జులై 23న జగన్‌రెడ్డి ఎం అన్నారు? రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉండాలి కనీసం 30వేల ఎకరాలు ఉండాలి అన్నారు. 2014 సెప్టెంబర్ 4న జగన్‌రెడ్డి గారు అసెంబ్లీలో ఎం అన్నారు? అమరావతిలో రాజధాని ని పెట్టడాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అన్నారు. అంతే కాదు ఆయన మరో మాట కూడా అన్నారు చిన్న రాష్ట్రం అయ్యింది ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం మాకు ఇష్టంలేదు అనిఅన్నారు.జగన్‌రెడ్డి కోరిక మేరకే మేము అమరావతిని రాజధానిగా ప్రకటించాం. 2017 జూలై 9న ప్లినరీలో అమరావతి వేదికగా చెబుతున్నా ఇక్కడే రాజధాని అన్నారు. 2017 జూలై 19న అమరావతి లో ఇళ్ళు కట్టుకున్నా, రైతులు ఆనంద పడేలా రాజ ధాని నిర్మిస్తా అన్నారు జగన్‌రెడ్డి. 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత జగన్‌రెడ్డి మాటమార్చారు. మడమ తిప్పారు. అమరావతి పై అనేక ఆరోపణలు చేసారు. ఒక్కటి నిరూపించలేకపోయారు. అక్కడ వైసిపి కుప్పి గంతులు చెల్లవు. సీఆర్డీఏ చట్టం ఉంది.
ఉత్తారాంధ్రను దోచుకోవడానికి జగన్‌రెడ్డి స్కెచ్
ఉత్తరాంధ్రని దోచుకోవడానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్కెచ్ వేసారు. విజయసాయిరెడ్డి దసపల్లా భూములు దోచుకుంటే.ఎంపీ ఎంవివి సత్యనారాయణ కూర్మ న్నపాలెంలో భూకబ్జా. మంత్రి ధర్మాన సైనికులకు చెందిన 71ఎకరాలు కొట్టేసారు. విశాఖలో ఏమి మిగ లలేదు. నిజమైన ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది విశాఖ లో.భూములు, కొండలు, ఘనులు అన్ని వైసిపి నాయకులు మింగేశారు. రూ.40 వేలకోట్లు విలువ చేసే భూమి ఈమూడున్నర ఏళ్లలో కొట్టేసారు. మాది నాడు – నేడు ఒకటే నినాదం. పరిపాలన ఒక చోట ఉం డాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. విభజన సమ యంలో రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన వివిధ సం స్థలను అన్నిజిల్లాలోనూ ఏర్పాటుచేసాం. రాయలసీ మకి ఆటో మొబైల్, సోలార్, ఎలెక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చాం. విశాఖకి ఐటి కంపెనీలు తీసుకొచ్చాం. టిడిపి హయాంలో ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టు లు పూర్తిచేయడానికి 1600 కోట్లు ఖర్చు చేస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం 500 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను జగన్‌సర్కార్ అస లు పట్టించుకోవడం లేదు.అమరావతి రైతులపై జరిగి న దాడిని యువనేత లోకేష్ తీవ్రంగా ఖండిరచారు.