అమరావతి : జగన్ రెడ్డి ప్రచారమేమో దేవుడెరుగు గానీ వాస్తవంలో ప్రజల పాలిట యముడిగా దాపురించాడని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుయ్య బట్టారు. ఆపదలో వచ్చినవారిని సూదీ దూదిలేని ఆస్పత్రులు వెక్కిరిస్తున్నాయి. నిన్న తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో చేర్చుకోకపోవడంతో నడిరోడ్డుపై మహిళ ప్రసవించింది. నేడు కుప్పంలో బాలింత, కవలలో ఒకరు వైద్యం అందక చనిపోయారు. సాక్షి పత్రిక ఫస్ట్ పేజీలో కోటి రూపాయల ప్రకటనలో కనిపించిన ప్రజారోగ్య దేవుడు యాడా కనిపించడేం? ఫ్యామి లీ ఫిజిషియన్ అంటూ మెజీషియన్ మాయలు చేసే బదులు.. ఆస్పత్రిలో వైద్యులుండేలా.. వారు వైద్యం అందించేందుకు మందులు, పరికరాలు ముందు ఇవ్వండి. ప్రజారోగ్య దేవుడినని పబ్లిసిటీ చేసుకుంటు న్న ముఖ్యమంత్రిని ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలే నమ్మడంలేదు. ఇక ప్రజల ప్రాణాలకు భరోసా ఎలా ఇస్తారని లోకేష్ ప్రశ్నించారు.