- మాతృభాషతోనే చైనా, జపాన్ దేశాలు ఎదిగాయి
- వికసిత్ భారత్, స్వర్ణాంధ్రలో భాగస్వాములు కావాలి
- విద్యార్థులతో వైద్య మంత్రి సత్యకుమార్ యాదవ్
- సరస్వతీ విద్యామందిర్ భవనానికి శంకుస్థాపన
రేపల్లె/బాపట్ల జిల్లా(చైతన్యరథం): ప్రధాని మోదీ వికసిత్ భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు భాగస్వాములు కావాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా రేపల్లె రూరల్ మండలం చాట్రగడ్డ గ్రామంలో సనాతన వేదాంత నిష్టాశ్రమ సరస్వతీ విద్యామందిర్ నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ మాతృభాషలో అధ్యయనం కొనసాగించాలని సూచించారు. ఆంగ్ల భాషతో మాత్రమే అభివృద్ధి చెందగలమన్న అపోహను విడనాడాలని హితవు పలికారు. ఆంగ్లభాష కేవలం ఒక సమాచార మాధ్యమం మాత్రమేనని స్పష్టం చేశారు. జపాన్, చైనా వంటి దేశాలు తమ తమ మాతృభాషలోనే విద్య అభ్యసించి ఎదిగాయన్నారు. విద్యాదానం అన్నిదానాల కన్నా గొప్పదన్న సిద్ధాంతాన్ని నమ్మి ఆచరించి సరస్వతీ విద్యా మందిర్ సంస్థకు శతాబ్ది కాలం క్రితమే ఇంత పెద్ద స్థలాన్ని విరాళంగా ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్న వీరమాచినేని వీరాంజనేయ శాస్త్రి, మైనేని రాజగోపాలరావు, వెలగపూడి రామకృష్ణ, సీతారామయ్య సామాజిక సేవా దృక్పథం అభినందనీయమని కొనియాడారు. దాతలు విద్యా సంస్థలకు సమకూర్చిన ఆస్తులను కబ్జా చేసే ప్రయత్నాలు గత ఐదేళ్ల కాలంలో పెరిగిపోయాయన్నారు. దీన్ని అంతం చేసి విద్యా, వైద్య సౌకర్యాల కోసం దాతలు ముందుకొచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఆంగ్ల భాషపై మోజుతో అనేక పాఠశాలలు మూతపడుతున్న తరుణంలో మూతపడిన ఈ పాఠ శాలను 2023లో పున:ప్రారంభించి ఆదర్శ పాఠశాలగా అభివృద్ధి చేస్తున్న యాజమా న్యానికి, అందుకు సహకరిస్తున్న గజపతిరావు వంటి విశ్రాంత ఉపాధ్యాయునికి తాను అభినందించారు. దీనిని విస్తరించే కార్యక్రమంలో తనను భాగస్వాములను చేసిన యాజ మాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సరస్వతి విద్యా మందిర్ మాత్రు సంస్థ అయిన విద్యాభారతి సంస్థ దేశంలో 24,128 పాఠశాలలు నిర్వహిస్తోందన్నారు. ఇటీవల ఒక అమెరికన్ సంస్థ నిర్వహించిన ఇంపాక్ట్ స్టడీలో సరస్వతీ విద్యా మందిర్ సంస్థలు కొన్ని కోట్ల కుటుంబాలలో వెలుగులు నింపిన విషయం బయటపడిరదన్నారు. రేపల్లె ప్రాంతంలో వైద్య సౌకర్యాల అభివృద్ధిపై తాను దృష్టి పెడతానని రెవెన్యూ మంత్రి అనగా ని సత్యప్రసాద్‌కు సత్యకుమార్‌యాదవ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కమిటీ అధ్యక్షుడు, కరస్పాండెంట్ పి.రమేష్ చంద్ర, సరస్వతీ విద్యా పీఠం రాష్ట్ర కార్యదర్శి కొసం జగదీష్, పవర్ మేక్ రావూరు శ్రీనివాసరావు, సెక్రటరీ నార్ల సాయన్న తదితరులు పాల్గొన్నారు.