- తెలుగుదేశం పార్టీకి బిసిలే వెన్నెముక
- తెలుగుజాతి ఉన్నంతవరకు తెలుగుప్రజల గుండెల్లో టిడిపి
- ఆర్థిక అసమానతల తొలగించడమే తెలుగుదేశం లక్ష్యం
- కాసాని ప్రమాణ స్వీకారోత్సవ సభలో చంద్రబాబునాయుడు
- అంగరంగ వైభవంగా జ్జానేశ్వర్ ప్రమాణస్వీకారం
హైదరాబాద్ : ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తే రాబోయేరోజుల్లో తెలంగాణా గడ్డపై తెలుగుదేశం పార్టీకి గతవైభవం రావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. టి.టిడిపి అధ్యక్షుడిగా కొత్తగా నియమితులైన కాసాని జ్జానేశ్వర్ ప్రమాణస్వీకారోత్సవం గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఎన్టీఆర్ భవన్ లో అంగరంగ వైభవంగా సాగింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ తో తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి బడుగు, బలహీనవర్గాలే వెన్నెముక..ఏపిలో, తెలంగాణలో అధ్యక్షులుగా బీసి నాయకులే ఉండటమే అందుకు నిదర్శనమని అన్నారు. తెలంగాణాలో కాసాని జ్జానేశ్వర్ నేతృత్వంలో పార్టీ అభివృద్ధి చెందగలదన్న నమ్మకంతోనే ఆయనను టి.టిడిపి అధ్యక్షుడిగా నియమించామని తెలిపారు. ఇప్పటివరకు అధ్యక్షుడిగా పనిచేసిన బక్కని నర్సింహులు పార్టీని సమర్థవంతంగా నడిపించారని కొనియాడారు.
తెలుగుజాతి ఉన్నంతవరకు తెలుగుదేశం
తెలుగువారి ఆత్మగౌరం కోసం పుట్టిన పార్టీ తెలు గుదేశం అని చంద్రబాబునాయుడు అన్నారు. తెలుగు జాతి గుండెచప్పుడు అన్న ఎన్టీఆర్ చేతుల మీదుగా తెలుగుదేశంపార్టీ పుట్టింది తెలంగాణా గడ్డపైనే… రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపై టీడీపీ గత వైభవం సంతరించుకునేందుకు ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం, ఈ లక్ష్యసాధన కోసం కృషిచేస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో టిడిపిదే కీలకపాత్ర, దేశ రాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశమని అన్నారు. తెలంగాణలో ప్రతిష్టాత్మక ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎన్టీఆర్ నాందిపలికారు, హైద రాబాద్‌లో టెక్నాలజీ అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన కృషే కారణమని అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందని స్పష్టం చేశారు. ఎపిలో జగన్‌రెడ్డి విధ్వంసక పాలనతో అక్కడి ప్రజలు తెలుగుదేశం పార్టీని కోరుకుంటున్నారు… అందువల్లే అక్కడ ఫోకస్ చేస్తున్నాం…ఇక్కడ ఎక్కువ సమయం కేటాయించకపోవడం పార్టీపై అభిమానం లేక కాదన్నారు. కాసాని జ్జానేశ్వర్ నేను సీఎంగా ఉన్న ప్పుడు రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పని చేశారు, నీతి, నిజాయితీగా పదవికి న్యాయం చేసిన వ్యక్తి కాసాని, ఏ పదవిలో ఉన్నా పదవికే వన్నె తెచ్చే వ్యక్తి కాసాని అని కొనియాడారు. తెలంగాణాలో చాలా మంది నేతలకు టీడీపీ రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ ఇప్పుడు ఎపి కంటే అభివృద్ధి లో ముందంజలో ఉందంటే టీడీపీ హయాంలో చేసిన నిర్మాణాత్మక కృషే కారణమని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
మనవల్లే హైదరాబాద్‌కు అంతర్జాతీయ ఖ్యాతి
ఐటితోనే యువతకు భవిత అని ముందే గ్రహించి తెలంగాణలో వందలాది ఇంజనీరింగ్ కళాశాలు నెల కొల్పి, సైబరాబాద్‌ను, హైటెక్ సిటీని అభివృద్ధి చేశాం, ఐటిలో ఆరోజు మనం నాటిన మొక్క, ఈరోజు మహా వృక్షంగా ఎదిగింది. ఆరంకెల జీతాలతో లక్షలాది యువత గొప్ప ఐటి నిపుణులుగా పనిచేస్తున్నారంటే ఆనాడు జరిగిన అభివృద్దే కారణం. ట్రిపుల్ ఐటి, ఉర్దూ యూనివర్సిటి, నల్సార్ వంటి ప్రతిష్టాత్మక సం స్థలను ఇక్కడ నెలకొల్పాం. 25 ఇంజనీరింగ్ కాలే జీలను 250కు పెంచాం. ప్రతి కిమీకు ఒక పాఠశాల, ప్రతి 3కిమీ ఒక హైస్కూల్, మండలానికో జూనియర్ కళాశాల, డివిజన్‌కో ఇంజనీరింగ్ కాలేజి, జిల్లాకొక మెడికల్ కాలేజి, అన్నింటినీ ఒక విజన్ ప్రకారం చేశాం. రూరల్‌లో స్కూళ్లను నెలకొల్పి విద్యా రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేశాం. కరోనా వ్యాక్సిన్ తయారీ నగరంగా హైదరాబాద్ రూపొందిందంటే ఆనాడు అభివృద్ది చేసిన జినోమ్ వల్లే సాధ్యమైంది. జినోమ వ్యాలీలో నెలకొల్పిన భారత్ బయోటెక్ కరో నా వ్యాక్సిన్ తయారీకి వేదికైంది. దేశంలో ఈరోజు తెలంగాణ నెంబర్‌వన్ కాగలిగిందంటే దానికి పునాది వేసింది టిడిపినే. తాను చేసిన అభివృద్దిని తర్వాత
సంస్కరణలకు నాందిపలికిన ఎన్టీఆర్
గొప్ప సంస్కరణవాది ఎన్టీఆర్.. పేదవాడికి కడుపు నిండా తిండి, కట్టుకోడానికి బట్ట, నివాసానికి ఇల్లు ఉండాలన్న ఆశయంతో అనేక సంస్కరణలు తెచ్చి అమలు చేసిన ఘనత ఎన్టీఆర్ దే. ఎన్టీఆర్ పెట్టిన రూ 2బియ్యం ఈరోజు దేశంలో ఆహార భద్రతా చట్టానికి నాంది అయ్యింది. ఆడబిడ్డలకు ఆయనిచ్చిన ఆస్తిహక్కు ఈ రోజు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. విద్యార్ధులకు ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకం ఇప్పుడు దేశవ్యాప్తమైంది. మాండలిక వ్యవస్థ తెచ్చి పరిపాలన పేదవాడి ముంగిటకు తెచ్చిన మహోన్నతుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. పేదరికం, ఆర్ధిక అసమానతలు లేని సమాజం ఏర్పడాలన్నదే ఎన్టీఆర్ ఆశయం.. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం… అధికారం కోసమో, పదవుల కోసమో పెట్టిన పార్టీ కాదని అన్నారు. సమాజంలో సంపద సృష్టించి…ఆ సంపదను పేదలకు పంచిన పార్టీ తెలుగుదేశం అని అన్నారు.
ముఖ్యమంత్రులు కొనసాగించడం వల్లే హైదరా బాద్ త్వరితగతిన అభివృద్ధి చెందింది. ప్రస్తుత ఎపి సిఎం జగన్ మాదిరి ఆ రోజు చంద్రబాబు కట్టాడు కాబట్టి హైటెక్ సిటీని కూల్చివుంటే ఈరోజు ఐటి అభివృద్ధి చెంది ఉండేదా అని ప్రశ్నించారు. ఏపిలో ప్రస్తుతం జరుగుతున్న విధ్వంసంపై చంద్రబాబు ఆవేదన చెందారు.
సూర్యచంద్రులున్నంత కాలం టిడిపి ఉంటుంది: కాసాని
రాష్ట్రపార్టీ నూతన అధ్యక్షులు శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ గడ్డ మీద, హైదరాబాద్ నడిబొడ్డున పుట్టిన పార్టీ తెలుగుదేశం. తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ఎన్టీఆర్, చంద్ర బాబులకే దక్కుతుందన్నారు. సమాజాభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో పథకాలకు నాంది పలికిం ది టిడిపినే.. మంచి చెప్పే పార్టీ, మంచి చేసే పార్టీ టిడిపి.. బీదవర్గాలు, బడుగు బలహీన వర్గాలవారు గుండెల్లో పెట్టుకుని అభిమానించారు. సూర్యచంద్రు లున్నంత కాలం తెలుగుదేశం ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో టిడిపి విజయం సాధించబోతోందని పేర్కొన్నారు.
పోలిట్ బ్యూరో నూతన సభ్యులు శ్రీ బక్కని నర్సిం హులు మాట్లాడుతూ ఎన్టీఆర్, చంద్రబాబు ఆశీస్సుల వల్లే గ్రామ కమిటీ నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా, పొలిట్ బ్యూరో స్థాయికి ఎదిగానన్నారు. జీవితాంతం పార్టీకి సేవలందించడమే తన విద్యుక్తధర్మమని అన్నా రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్‌లో కొన్ని దశా బ్దాలుగా గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన లక్షా 25 వేల ఫైళ్లనుపరిష్కరించిన ఘనత చంద్రబాబుదే అన్నా రు. అప్పట్లో పెండిరగ్ ఫైళ్ల పరిష్కారాన్ని ఒక యజ్ఞం గా చేపట్టిన విషయం గుర్తుచేశారు. సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో తెలంగాణ అన్నిరంగాల్లో గణనీ యంగా అభివృద్ధి చెందిందన్నారు. చంద్రబాబు సూచ నల మేరకే వాజ్‌పేయి హయాంలో గోల్డెన్ క్వాడ్రిలేట రల్ రోడ్లు వచ్చాయని, మైక్రో ఇరిగేషన్ రైతులకు చేరువైందని గుర్తుచేశారు.
తెదేపా జాతీయ అధికార ప్రతినిధి శ్రీ నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ గడీల రాజ్యాన్ని అంతం చేసి గరీబోళ్ల రాజ్యం తెచ్చిన చరిత్ర తెలుగుదేశందేనని అన్నారు. పసుపు జెండాలో రైతు నాగలి, పేదల గుడి సె,కార్మికుడి చక్రమే అందుకు నిదర్శనమని అన్నారు. తెలంగాణ గడ్డ, తెలుగుదేశం అడ్డాగా చేసేందుకు అందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యులు అరవింద్‌కు మార్ గౌడ్, తెలంగాణపార్టీ వ్యవహారాల సమన్వయ కర్త శ్రీ కంభంపాటి రామమోహన్‌రావు, జాతీయపార్టీ ఉపాధ్యక్షులు శ్రీ చిలువేరి కాశీనాథ్,క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, జాతీయ పార్టీ అధికార ప్రతినిధి, తిరునగరి జ్యోత్స్న, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరామ్, మాజీ ఎమ్మెల్యే కాట్ర గడ్డ ప్రసూన, రాష్ట్రపార్టీ ఉపాధ్యక్షులు నందమూరి సుహాసిని, సామ భూపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఫణీశ్వరమ్మ, డా సిహెచ్ పవన్ కుమార్, టిఆర్ ఎస్ నాయకులు పెద్దపల్లి సత్యనారా యణ, అక్కపాక తిరుపతి, రాజ్‌కుమార్, ఎమ్మార్పీఎస్ నాయకులు వాసాల సంపత్, మాజీ ఎంపిపి రమణ రావు, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఎఎస్ రావు, ఎం.శ్యాంసుందర్, మందూరి సాంబశివ రావు, ఎల్‌ఆర్ వెంకన్న, ముప్పిడి గోపాల్, సాయిబా బా, అక్కపాక తిరుపతి,వాసాల సంపత్,పెద్దపల్లి సత్య నారాయణ,జి.రమేశ్, కరిడె తిరుపతి,లక్ష్మీనారాయణ, సదానంద్ గైడ్,హనుమంత్, వెంకటరమణ, పొట్టిరా జు,సాయిబాబా, నందిగామ సత్యనారాయణ తదితరు లు తెలుగుదేశంపార్టీలో చేరారు. పసుపు కండువాలు కప్పి చంద్రబాబువారిని పార్టీలోకి ఆహ్వానించారు.