- అప్పుడు లిఫ్ట్ నిలిపేసి..ఇప్పుడు నాటకాలు దేనికి?
- ఒక్క సంతకంతో 102 ప్రాజెక్టుల పనులు రద్దు చేశాడు
- ఏం చేయలేదని వైసీపీ సభ్యులే మండలిలో ఒప్పుకున్నారు
- మీరు అన్యాయం చేస్తే..చంద్రబాబు న్యాయం చేస్తున్నారు
- మహా యజ్ఞానికి రాక్షసుల్లా అడ్డుపడకండి
- మండలిలో మంత్రులు నిమ్మల, పయ్యావుల, అచ్చెన్న
అమరావతి(చైతన్యరథం): జగన్ హయాంలో రాయలసీమ లిఫ్ట్ పనులు ఆగిపోతే కూటమి ప్రభుత్వంపై వైసీపీ సభ్యులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండలిలో మంత్రులు నిమ్మ ల, పయ్యావుల, అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. 2020లోనే ఎన్జీటీ క్లియర్‌గా రిపోర్ట్‌లో చెప్పింది.. మేమే ఆపింది..ఆ ఘనత మాదే అని మాజీ మంత్రి హరీష్‌రావు స్వయంగా ప్రకటించాడు. ఇంకా ఎందుకు వైసీపీ సభ్యులు ఈ డొంకతిరుగుడు వాదనలు చేస్తున్నా రు? రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను ఐదేళ్ల పాటు నిర్వీర్యం చేసి.. ప్రాజెక్టులు కొట్టుకుపోయి ప్రజల మరణానికి కారణమైన జగన్‌రెడ్డి రాయలసీమ ద్రోహి. ఐదేళ్ల పాలనలో రాయలసీమకు చేసింది శూన్యం. రూ.12 లక్షల కోట్ల బడ్జెట్‌లో రాయలసీమకు ఖర్చు చేసింది 1 శాతం కూడా లేదని ఘాటుగా సమాధానమి చ్చారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌తో పాటు రాయలసీమ లిఫ్ట్‌కు సంబంధించి మంత్రి నిమ్మల రామానాయుడు సరైన సమా ధానం ఇచ్చారు. అయినా వైసీపీ సభ్యులు సభను తప్పుదారి పట్టిం చే విధంగా వ్యవహరించారు. దీనికి మంత్రులు ఘాటుగా సమాధా నమిచ్చారు. రాయలసీమలో ఇంకే ఇతర ప్రాజెక్టులు లేవా? వైసీపీ సభ్యులు కేవలం రాయలసీమ లిఫ్ట్ డ్రామా దేనికి ఆడుతున్నట్టు? అని ప్రశ్నించారు.
చంద్రబాబు సమర్థతకు నిదర్శనం
హంద్రీనీవా పూర్తి చేసి 190 రోజుల్లోనే 44 టీఎంసీల నీటిని రాయలసీమ ప్రాంతాలకు తరలించాం. ఇది రాయలసీమ కోసం కాదా? రాయలసీమ ప్రాజెక్టులు, చెరువుల్లో ప్రస్తుతం 366 టీఎంసీల నీటిని నీల్వ చేశాం. ఇది మా నాయకుడు చంద్రబాబు సమర్థతకు నిదర్శనం. కేవలం 22 టీఎంసీల రాయలసీమ లిఫ్ట్‌పై ఎందుకు ఇంత డ్రామా ఆడుతున్నారు. ఎన్జీటీ ఆదేశాలతో పనులు మీరు ఆపేసి.. దాన్ని మేం చేశామని బుకాయించడం సిగ్గుచేటు. రాయలసీమ లిఫ్ట్ పథకం 2020లో ఆగిపోతే జగన్ రెడ్డి నాలుగే ళ్లు కౌంటర్ కూడా దాఖలు చేయలేదు. రాయలసీమకు చెందిన ఏ ఒక్క ప్రాజెక్టుకు కనీసం నిధులు కేటాయించి పనులు పూర్తి చేయలేదు, హంద్రీనీవా పనులు వెడల్పు పేరుతో నిలిపివేశాడు. జీఓ 365 తెచ్చి 102 సాగునీటి ప్రాజెక్టుల పనులు రద్దు చేశాడు.. గోరుకల్లు, గాలేరు నగరి, ఇలా అనేక ప్రాజెక్టులను పట్టించు కోలే దు. ఇవన్ని వైసీపీ సభ్యులకు ఎందుకు కనిపించడం లేదు.. రాయ లసీమకు ఐదేళ్ల పాటు ద్రోహం చేసి.. నేడు నీతులు మాట్లాడితే ఎలా? మీ హయాంలో నిలిచిపోయిన పనులను మాపై రుద్దే ప్రయత్నం చేయొద్దని హితవుపలికారు. మీ దరిద్రపు పాలనలో మీ అసమర్థ నాయకుడైన జగన్ చేతకానితనం వల్లే రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయింది. వైసీపీ ఐదేళ్ల పాలనలో రూ.2 వేల కోట్లు కూడా సక్రమంగా రాయలసీమ ప్రాజెక్టుల కోసం కోసం ఖర్చు చేయలేదు. కూటమి ప్రభుత్వంలో రాయలసీమ సాగుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ… 20 నెలల్లో రూ.8 వేల కోట్లు ఇప్పటికే ఖర్చే చేశాం. మరో రూ.10,014 కోట్లు తాజాగా బడ్జెట్‌లో పెట్టాం. మరో రూ.30 వేల కోట్లతో రాయలసీమ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దబోతున్నాం. రాయలసీమను రతనాల సీమగా మార్చే ఒక యజ్ఞానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పూనుకున్నారు. దానికి రాక్షసుల్లా వైసీపీ నాయకులు అడ్డుపడరాదని హితవుపలికారు.
సోము వీర్రాజుపై దాడికి యత్నం
శాసన మండలిలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు పైకి వైకాపా సభ్యులు ఇజ్రా యెల్, విక్రాంత్, రమేశ్ యాదవ్ దూసుకెళ్లారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం పూర్తయిన తర్వాత చర్చకు వైకాపా సభ్యులు పట్టుబట్టారు. మంత్రి సమాధానం పూర్తవడంతో తర్వాత ప్రశ్నకు మండలి చైర్మన్ అవకా శం కల్పించారు. దీంతో ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఆయన పైకి ఎమ్మెల్సీ ఇజ్రాయెల్‌తో పాటు ఆ పార్టీకి చెందిన కొందరు సభ్యులు దూసుకెళ్లారు. తాము నిరసన తెలుపుతుంటే మైక్ ఎందుకు తీసుకున్నారంటూ వీర్రాజుపై దాడికి యత్నించారు. సోము వీర్రాజుకు మద్దతుగా మంత్రులు అనిత, గొట్టిపాటి రవికుమార్ వెళ్లి అడ్డుకున్నారు. ఉద్రిక్త వాతా వరణం మధ్య సభను మండలి చైర్మన్ మోషేనురాజు కాసేపు వాయిదా వేశారు.












