- జగన్‌రెడ్డి ఇంటికి పోవడం ఖాయం
- డ్రామాల కంపెనీ వైసీపీకి తాళంపడక తప్పదు
- కూటమి ఎన్నికల ప్రచార సభలో బాబు, పవన్ పిలుపు
- మళ్లీ జగన్ వస్తే ఆస్తులూ కొల్లగొడతాడు
- గాలేరు `నగరి పూర్తిచేసి కృష్ణా జలాలిస్తా
- రాజంపేటలో మెడికల్ కాలేజీ: చంద్రబాబు
- యువత తలచుకుంటే మార్పు సాధ్యం
- ఇసుక తవ్వకాలతో డ్యాము కూల్చేశారు
- వైసీపీని పాతాళానికి తొక్కేద్దాం: పవన్ కల్యాణ్
- కూటమి సభకు పోటెత్తిన జనకెరటం
రాజంపేట (చైతన్యరథం): రాష్ట్రంలో అన్నిచోట్ల నుంచీ వైసీపీ ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు మొదలైంది. మహోధృతమైన ప్రజా తిరుగుబాటులో జగన్‌రెడ్డి కొట్టుకుపోవడం ఖాయం. కూటమి కొట్టే దెబ్బతో డ్రామాల కంపెనీ వైసీపీకి తాళంపడటం ఖాయమని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిర్వహించిన కూటమి ఎన్నికల ప్రచార బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్తంగా మాట్లాడారు. ప్రజాకంటక పాలన సాగించిన వైకాపా ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దామని, కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని అగ్రనేతలు పిలుపునిచ్చారు. అశేష జనాన్ని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ `పొరబాటున మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే ఆస్తలు దోచేస్తాడని చంద్రబాబు హెచ్చరించారు. ఒంటిమిట్ట చేనేత కార్మికుడు సుబ్బారావు భూమిని వైసీపీ మూకలు కబ్జాచేసి, కుటుంబం ఆత్మహత్యకు కారణమైందని చంద్రబాబు వివరించారు. కుమార్తె లక్ష్మీప్రసన్న హైదరాబాద్‌లో ఉండటంతో బతికిందని, ఆమెకు తెలుగుదేశం పార్టీ ఐదు లక్షలు ఆర్థిక సాయం అందించి ఆమె బాగోగులకు బాధ్యత తీసుకుందని వివరించారు. వైకాపా భూదందాలతో అన్యాయానికి గురైన కోవూరి లక్ష్మీ ఢల్లీికి వెళ్లి ఇండియా గేటు వద్ద బొటన వ్రేలు కోసుకున్న ఉదంతాన్ని గుర్తుచేస్తూ `ప్రజల జీవితాలు బాగుపడాలంటే వైసీపీ అభ్యర్థి మిధున్‌రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడిరచాలని పిలుపునిచ్చారు.
అన్నమయ్య ప్రాజెక్టు పూర్తి చేసి రైతులను ఆదుకుంటాం:
కూటమి ప్రభుత్వం రాగానే అన్నమయ్య ప్రాజెక్టును బాగు చేసి బాధితులను ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ దొంగలు పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి ఇసుక తవ్వకాల కారణంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 40మంది చనిపోతే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా ఒక్కొక్కరికి లక్ష ఆర్ధిక సహాయం ఇచ్చామన్నారు. జగన్‌రెడ్డి ఎవ్వరినీ ఆదుకోలేదన్నారు. కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టుకు దిక్కులేదు కానీ మూడు రాజధానులు కడుతానంటున్నాడని బాబు ఎద్దేవా చేశారు. డ్యామ్ కొట్టుకుపోవడానికి కారణమైన పెద్దిరెడ్డి, మిధున్‌రెడ్డిని చిత్తుగా ఓడిరచాలని బాబు పిలుపునిచ్చారు. ఎక్కడైనా ప్రజాభిప్రాయం మేరకే పాలన జరగాలి. రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం కిరణ్‌కుమార్ రెడ్డిది. పరస్పరం పాలకపక్ష ప్రతిపక్షంలోవున్న సందర్భాలు ఉన్నాయి. కాని, జగన్‌లాంటి ముఖ్యమంత్రిని ఇద్దరం ఎక్కడా చూడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పేదలకు రెండు.. మూడు సెంట్లు ఇంటి జాగా ఇచ్చి, ఇళ్లు కట్టించి ఇస్తామని, గాలేరు-నగరి కాలువ పూర్తి చేసి కృష్ణా జలాలు తీసుకొస్తామని, ఏప్రిల్ నుంచే పింఛను రూ.4వేలు ఇంటి వద్దే ఇస్తామని, 3 నెలల బకాయిలు జులైలో ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తెదేపా మద్దతుదారుల పింఛన్లు వైసీపీ తీసేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు, ఉద్యోగం వచ్చే వరకు రూ.3వేల నిరుద్యోగ భృతి, ప్రతీ రైతుకు అన్నదాత కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు. రైతుల కోసం అన్నమయ్య ప్రాజెక్టును పూర్తి చేస్తామని, బాధితులకు నష్టపరిహారం ఇస్తామని, పునరావాసం కల్పించి ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
రాజంపేటలో మెడికల్ కాలేజీ కట్టిస్తాం
రాజంపేట జిల్లా కేంద్రమైతే మెడికల్ కాలేజీ వస్తుంది. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. రాజంపేటను ఒక మంచి నగరంగా తీర్చిదిద్దే బాధ్యత మాది. అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులను పూర్తిచేస్తాం. మాచుపల్లి బ్రిడ్జి పూర్తిచేస్తాం. ఓబిలి- టంగుటూరు హైలెవల్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తాం. జర్రికోన ప్రాజెక్టు పూర్తి చేసి సుండుపల్లి మండలానికి త్రాగునీరు, సాగునీరు ఇస్తాం, గాలేరు- నగరి కాలువలు పూర్తిచేసి కృష్ణా జలాలను తీసుకొస్తాం. విభజన తర్వాత ఒంటిమిట్టను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. బ్రహ్మాండమైన రామాలయాన్ని కట్టామని చంద్రబాబు హామీలిచ్చారు.
మహాశక్తితో మహిళలను ఆదుకుంటాం
మహాశక్తితో ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తామని, తల్లికి వందనం కింద ప్రతీ బిడ్డకు ఏడాదికి రూ.15 వేలు.. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని బాబు వివరించారు. ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని, ప్రతీ ఇంటికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఆదుకుంటామని, డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా, ఇప్పుడు గులకరాయి డ్రామాతో జగన్ వస్తున్నాడు. గులకరాయి గాయం రోజురోజుకు పెద్దదవుతోందని ఎద్దేవా చేస్తూ.. ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడిరచి దొంగ గాయానికి మీరే చికిత్స చేయాలి అని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. కిరణ్‌కుమార్‌రెడ్డి చాలా అనుభవజ్ఞుడని, బాలసుబ్రమణ్యం మీ అభిమాన నాయకుడు పాలకొండ రాయుడి కుమారుడని పరిచయం చేస్తూ, ఇద్దరిని మంచి మెజారిటీతో గెలిపించాలని చంద్రబాబు కోరారు.
వైకాపాని పాతాళానికి తొక్కేద్దాం: పవన్
వైకాపా ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ సర్కారుపై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని సుభిక్షం చేసుకోవడానికి కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని సూచించారు. ఉమ్మడి సభలో పవన్ మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి తీసుకొచ్చిన రౌడీయిజం, ఫ్యాక్షనిజం అంతం కావాలంటే కూటమి ప్రభుత్వం రావాలన్నారు. ‘‘రాజ్యాధికారం కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉంది. ఇది మారాలి. ఓడిపోతామని తెలిసి జగన్ 70 నియోజవకర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్ధులను మార్చారు. అందులో రాజంపేట మొదటిది. సారా వ్యాపారం చేసుకునే మిథున్‌రెడ్డి నేను పోటీ చేస్తున్న పిఠాపురం వచ్చి నన్ను ఓడిస్తారట. యువత తలచుకుంటే మార్పు ఎందుకు రాదు? పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిని ఎదుర్కొనే గుండెబలం యువతకు లేదా? అని పవన్ చైతన్యపర్చారు.
ఉపాధి అవకాశాలు లేక యువత రోడ్లపై తిరుగుతున్నారని, సంపదంతా పెద్దిరెడ్డి, ఆయన సోదరుడి కుమారుడు మిథున్‌రెడ్డి వద్దే ఉండిపోయిందన్నారు. అన్నమయ్య డ్యామ్ ప్రమాదంలో ఉందని ముందే హెచ్చరించినా, డ్యామ్‌లో ఇసుక తోడేయడంవల్ల 40మంది చనిపోయిన ఘట్టాన్ని గుర్తు చేశారు. డ్యాము కొట్టుకుపోతున్నా పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి పట్టించుకోలేదని, ప్రశాంతంగా మద్యం వ్యాపారం చేసుకున్నారని దుయ్యబట్టారు. రాజంపేట ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని పవన్ నొక్కిచెబుతూ, ఇక్కడి ముఠా నేతలు రూ.10వేల కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధ్వంసానికి గురైన ఆంధ్ర రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలంటే `కూటమిని గెలిపించుకోవటం ఒక్కటే మార్గమని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.