- నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
- శ్రీను కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుంది
- టీడీపీ నేత శ్రీను హత్యకు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఖండన
అమరావతి(చైతన్యరథం): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవరాజకీయాలకు పెట్టింది పేరని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ నాయకుడు శ్రీనివాసులును వైసీపీ మూకలు దారుణంగా హత్య చేశాయన్నారు. ఈ హత్యను మంత్రి తీవ్రంగా ఖండిరచారు. అధికారం కోల్పోయిన తర్వాత హత్యారాజకీయాలతో తమ పార్టీని నిలబెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ప్రయత్నాలు చేస్తోందన్నారు. రాజకీయ హత్యలు చేస్తున్నారు అని ఊరూరా తిరిగి ఏడ్చి గగ్గోలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి ఈ హత్యకు సంబంధించి ఏ సమాధానం చెబుతాడని మంత్రి ప్రశ్నించారు. టీడీపీ నేతలను వైసీపీ నాయకులు హత్య చేస్తుంటే, తిరిగి ఆ రక్తపు మరకలను టీడీపీ అంటగట్టేందుకు జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడని విమర్శించారు. అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి, వైసీపీ శ్రేణులు ఆ బాధను దిగమింగలేక టీడీపీ శ్రేణులపై దాడులు, హత్యలకు పాల్పడుతున్నారు. శ్రీను కుటుంబానికి తెలుగుదేశంపార్టీ, ప్రభుత్వం అండగా నిలబడుతుంది. హంతకులు, నిందితులు ఎవరూ శిక్ష నుండి తప్పించుకోలేరు. హత్య చేసిన వారిని, దాని వెనుక ఉన్నవారిని చట్టప్రకారం అతి త్వరలో శిక్షిస్తాం, హత్యలతో ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టాలనే జగన్ ప్రయత్నాలకు త్వరలోనే తెరపడుతుందని మంత్రి జనార్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు.