అమరావతి(చైతన్యరథం): ‘రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట’ వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీటీ ద్వారా వారు అందించిన సేవలను కొనియాడారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ట్వీట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బలహీ న, వెనుకబడిన వర్గాలకు చెందిన 25 లక్షల మంది పేదల పురోగతికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి మానవతా దృక్పథంతో సేవలందిస్తోన్న ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్. స్పెయిన్ దేశం నుంచి వచ్చి రాయలసీమ ప్రజలకు ఎంతో మేలు చేసి వారికి ఆరాధ్యనీయులయ్యారు. పేద ల్లో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఓ స్ఫూర్తి నింపారని పేర్కొన్నారు.
పేదల కోసం జీవితాన్నే అంకితం చేశారు: లోకేష్
పేదల అభ్యున్నతికి తన జీవితాన్నే అంకితం చేసిన మహనీ యుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి సందర్భంగా ఆయన సేవాస్ఫూర్తిని స్మరించుకోవడం ఎంతో గొప్ప విషయమని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. సమాజంలోని అట్టడుగు వర్గాల కోసం నిరంతరం శ్రమించి, వారి జీవితాల్లో వెలుగు నింపిన మహాత్ముడిగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడా రు. ఆయన చేసిన సేవలు సమగ్ర గ్రామీణాభివృద్ధికి ఒక ఆదర్శ మోడల్‌గా నిలిచాయని కీర్తించారు. పేద ప్రజలకు దేవుడిచ్చిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవాస్ఫూర్తికి జోహార్లు. అర్ధ శతాబ్దం క్రితం తెలుగు నేలపై అడుగుపెట్టి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆరంభించి అనంత ప్రజల ఆశాజ్యోతిగా వెలుగొందారు. తెలుగు రాష్ట్రాల్లో ఆస్పత్రులు, విద్యాలయాలు, స్వయం సహాయక సంఘాలు, క్రీడామైదానాలు, నిరుపేదలకు పక్కాగృహాల నిర్మాణంతో ప్రగతి ప్రదాతగా నిలిచా రని ప్రశంసించారు. ఈ ఏడాది ఫాదర్ ఫెర్రర్ జయంతి కానుకగా ఆర్డీటీకి ఎఫ్‌సీఆరఏ అనుమతిని సాధించి ప్రజలకు నిరంతరా యంగా ఆర్డీటీ సేవలు అందేలా కృషి చేశామని చెప్పుకొచ్చారు. నిస్వార్థ సేవతో ప్రజల గుండెల్లో చిరకాలం జీవించి ఉండే ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్‌ని స్మరిస్తూ నివాళులర్పించారు.















