- సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తున్నాం
- రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్
- ప్రజావినతుల కార్యక్రమంలో అర్జీల స్వీకరణ
మంగళగిరి(చైతన్యరథం): గత ప్రభుత్వ పాపాల కారణంగా ఎప్పుడూ లేనంతగా రాష్ట్రంలో భూ సమస్యలు పుట్టకొచ్చాయని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొ న్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన ప్రజావినతుల కార్యక్రమం లో అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. భూ ఆక్రమణలు, ఆన్‌లైన్ మోసాలు, తప్పుడు డాక్యుమెంట్‌లతో భూ మార్పిడులు, భూ సమస్యలపై అర్జీదారులు పోటెత్తారు. భూ సమస్యలను పట్టించుకోకుండా భూ భకాసురులకు కొమ్ముకాస్తున్న అధికారులపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అర్జీలు స్వీకరించిన అనగాని సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఏఎంయుడీఏ చైర్మన్ స్వామినాయుడు అర్జీల స్వీకరణలో పాల్గొన్నారు. అనగాని మాట్లాడుతూ గత ఆరు నెలల కాలంలో వచ్చిన 67 వేల రెవెన్యూ ఫిర్యాదులు, రీ సర్వేపై వచ్చిన 2.67 లక్షలకు పైగా ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తు న్నామని..ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా చూస్తామని చెప్పా రు. రెవెన్యూ సదస్సుల్లో అక్కడికక్కడే పరిష్కరించగలిగిన సమస్యలను వెంటనే పరిష్కరిం చేందుకు అధికారులు చొరవ చూపాలని సూచించారు. పరిష్కరించలేని వాటిని ఎందుకు పరిష్కరించలేకపోతున్నామో కూడా ప్రజలకు తెలియజేయాలని స్పష్టం చేశారు.
ఫోర్జరీ సంతకాలతో రూ.6 కోట్లు కొట్టేశారు
` అల్లూరి జిల్లా దేవిపట్నం మండలం చినరమణయ్యపేట, దండంగి, కోయిల వీరవరం గ్రామాల్లో వైసీపీ నేతలు ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరా వాస ప్యాకేజీని గిరిజనులకు చెందకుండా రూ.6 కోట్లకు పైగా కొట్టేశారని.. దీనిపై విచారిస్తే భారీ దోపిడీ బయటకు వస్తుందని చినరమణయ్యపేట గ్రామానికి చెందిన మట్టా మెహర్‌బాబా గౌడ్ ఫిర్యాదు చేశారు.
` కృష్ణా జిల్లా గన్నవరంలోని తన స్థలానికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తన స్థలాన్ని కబ్జాచేసేందుకు కుట్ర చేస్తున్న మూల్పూరి విజయ తులసీరాణి, చల్లపల్లి జయ శ్రీ, సూరపనేని అనీల్‌కుమార్, సముద్రాల వెంకట శివరామకృష్ణలపై చర్యలు తీసుకుని తన భూమిని తనకు దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
` చిలకలూరిపేట మండలం గోవిందాపురంలో తమ భూమిని ఆక్రమించుకున్న వారికి అధికారులు కొమ్ముకాస్తున్నారు..వారిపై చర్యలు తీసుకుని విచారించి తమ భూమి తమకు దక్కేలా చూడాలని బాపట్ల జిల్లా యుద్దనపూడి మండలం అనంతవరం గ్రామా నికి చెందిన సవరపు ఆరోగ్యం ఫిర్యాదు చేశారు.
` వైద్య ఆరోగ్య శాఖలో 2002లో డీఎస్సీ ద్వారా నియమించబడి గత 22 సం వ త్సరాలుగా కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న తమను (ఎంపీహెచ్‌ఏ) తొలగించేందుకు ఉత్తర్వులు ఇచ్చారని.. దాంతో తమ కుటుంబాలు రోడ్డున పడతాయని.. దయ చేసి తమకు ఉద్యోగ భరోసా కల్పించి ఉద్యోగాల్లో కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేశారు.
` కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పాప వినాశనం గ్రామానికి చెందిన పలువురు విజ్ఞప్తి చేస్తూ.. ఎస్సీ ఎస్టీలమైన తమకు ప్రభుత్వం గతంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పట్టాలు కూడా ఇచ్చారని.. కాని స్థలాలు చూపించడంలేదని.. స్థలాలు చూపించాలని వారు విజ్ఞప్తి చేశారు.
` అధికారులకు ఎన్ని అర్జీలు పెట్టుకున్నా తమ సమస్యను పట్టించుకోవడం లేదని.. తన ఇంటిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదని.. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన రామయ్య అనే వ్యక్తి నేడు గ్రీవెన్స్‌లో నేతలకు ఫిర్యాదు చేశాడు
` తాము గత 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ఆక్రమించుకుని దేవర బండ గ్రామానికి చెందిన సుభాన్ అనే వక్తి క్రసర్ ఫ్యాక్టరీని పెట్టాడని.. దీనిపై విచారించి తమకు న్యాయం చేయాలని కర్నూలు జిల్లా దేవనకొండ మండలం మాచాపురం గ్రామానికి చెందిన ఉప్పరి దానమ్మ విజ్ఞప్తి చేశారు.