- అమాయకులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేస్తాం
- రామతీర్థం బాధితులకు యువనేత నారా లోకేష్ భరోసా
నెల్లిమర్ల: రాముడి విగ్రహం తలనరికిన సైకోలను జైలుకు పంపిస్తామని, అమాయకులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేస్తామని యువనేత లోకేష్ హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం రామ తీర్థం శంఖారావం సభకు హాజరయ్యే ముందు శుక్ర వారం రామతీర్థంలోని వైసీపీ బాధితులు యువనేత నారా లోకేష్‌ను కలిసి తమ బాధలను చెప్పుకున్నారు. మూడేళ్ల క్రితం రామతీర్థం గ్రామంలోని రాముడి విగ్ర హం తలను కొందరు అసాంఘికశక్తులు నరికివేశారు. ఆ సంఘటనతో తీవ్రంగా కలత చెందిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ఆలయాన్ని సంద ర్శించారు. ఆ సందర్భంగా రామతీర్థంలో నిర్వహించిన సమావేశానికి నాయకత్వం వహించిన సువ్వాడ రవి శేఖర్‌తో పాటు మరో తొమ్మిది మందిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని హత్యచేసేందుకు ప్రయత్నించారం టూ తప్పుడు కేసులు బనాయించారు.
అమాయకులైన స్థానికనేతలను ఒక నెలపాటు జైలులో పెట్టారు. వారి లో ఒక బాధితుడ్ని చిత్రహింసలకు గురిచేసి నేరాన్ని అంగీకరించేలా బలవంతం చేశారు. ఆ వ్యక్తి పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న తర్వాత మూడు నెలల పాటు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చిందని బాధితులు యువనేత లోకేష్ ఎదుట ఆవేదన చెందారు. దీనిపై తీవ్రంగా స్పందించిన యువనేత లోకేష్… రాముడి విగ్రహం తల నరికిన అరాచశక్తులను పట్టుకోవడం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం… అమాయకులపై కేసులు పెట్టడం దారుణమన్నారు. మరో 2 నెలలు ఓపిక పట్టండి, రాముడి తలనరికిన సైకోలతోపాటు వారి వెనుక ఉన్న శక్తులను కూడా ఎక్కడ ఉన్నా లాక్కొచ్చి కటకటాల వెనక్కిపంపుతాం, రామతీర్థంలో అమాయ కులపై పెట్టిన తప్పుడు కేసులను మన ప్రభుత్వం రాగానే ఎత్తేస్తామని యువనేత లోకేష్ భరోసా ఇచ్చారు.