- విశాఖ మెడ్‌టెక్ జోన్లో కిట్ తయారీ అభినందనీయం
- మేక్ ఇన్ ఏపీ బ్రాండ్‌కు ఈ కిట్ దోహదపడుతుంది
- మెడ్‌టెక్ జోన్ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు ప్రశంసలు
- సచివాలయంలో మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
అమరావతి(చైతన్యరథం): మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ కోసం పూర్తి స్వదేశీయంగా విశాఖ మెడ్‌టెక్ జోన్లో ఆర్టీపీసీఆర్ కిట్ అభివృద్ధి చేయడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్‌ను గురువారం ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. విశాఖ మెడ్‌టెక్ జోన్ సీఈఓ జితేంద్ర శర్మ, జోన్ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీపీసీఆర్ కిట్‌ను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ కిట్ ను తక్కువ ధరతో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మెడ్‌టెక్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. మెడ్‌టెక్ జోన్ భాగస్వామి ట్రాన్సాసియా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎర్బామ్‌డెక్స్ మంకీపాక్స్ ఆర్టీ-పీసీఆర్ కిట్ (జుతీపaవీణఞ వీశీఅసవవూశీఞ Rు-ూజR ఖఱ్) పేరిట ఈ కిట్ రూపకల్పన చేసినట్లు సీఎం చంద్రబాబుకు సీఈఓ జితేంద్ర శర్మ వివరించారు.
ఈ కిట్ తయారీకి ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ అర్గనైజేషన్ నుంచి అత్యవసర అంగీకారం లభించిందని తెలిపారు. మంకీపాక్స్ నిర్ధారణకు దేశీయంగా మొదటి ఆర్టీపీసీఆర్ కిట్ ను రూపొందించిన మెడ్‌టెక్ జోన్ ప్రతినిధులను సీఎం చంద్రబాబు అభినందించారు. మేక్ ఇన్ ఏపీ బ్రాండ్ రాష్ట్రానికి రావడానికి ఈ కిట్ దోహదపడుతుందన్నారు. ప్రభుత్వం నుండి మెడ్‌టెక్ జోన్‌కు అన్ని విధాలా సహాయ,సహకారాలు అందిస్తామన్నారు. వినియోగదారులకు ఆర్థిక భారం లేకుండా త్వరలో సోలార్‌తో నడిచే ఎలక్ట్రానికి వీల్‌చైర్ ను రూపొందించనున్నట్లు మెడ్‌టెక్ జోన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తక్కువ ఖర్చుతో మన్నిక గల వైద్య పరికరాలను తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.