- అవసరమైన వనరులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
- చిన్న మధ్యతరహా పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- జాతీయస్థాయి మహిళా మేధో సంపత్తి వ్యాపార సదస్సు ప్రారంభం
అమరావతి(చైతన్యరథం): దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి చిన్న, మధ్య తరహా పారిశ్రామిక రంగంలో మహిళల పాత్ర కీలకమని, పారిశ్రామికరంగ స్వరూపాన్ని మార్చ డంలో మహిళా పారిశ్రామికవేత్తలకున్న సామర్థ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతుందని చిన్న, మధ్య తరహ పరిశ్రమల శాఖ మంత్రి కొం డపల్లి శ్రీనివాస్ అన్నారు. కేఎల్ విశ్వవిద్యాలయంలో రెండురోజుల పాటు జరగనున్న జాతీయస్థాయి మహిళా మేధో సంపత్తి వ్యాపార సదస్సు- 2024ను మంత్రి మంగళవారం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం సదస్సులో మాట్లాడుతూ ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తల స్ఫూర్తికి మద్దతునివ్వడమే కాకుండా అందుకు అనుగుణమైన వ్యవస్థను రూపొందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వ్యాపారంలో మహిళలకు సాధికారత కల్పించడం, వారికి అవసరమైన వనరులు, శిక్షణ, ఆర్థిక సాయా న్ని అందించేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, పథకాలను రూపొందిస్తుందని చెప్పా రు.
అడ్డంకులను ఛేదించడానికి, పోటీ మార్కెట్లో విజయం సాధించడానికి అవసరమైన సాధనాలను మహిళలకు అందించడానికి తమ వంతు ప్రయత్నం ఎప్పుడూ ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. వ్యాపార వాతావరణంలో మేధో సంపత్తి యొక్క ప్రాముఖ్యత, ప్రపంచీకరణ నేపథó్యంలో వ్యాపార విజయానికి కీలకమైన సాధనంగా ఉద్భవించిందని చెప్పారు. మహిళల నేతృత్వంలోని ఆవిష్కరణలను రక్షించడానికి, విలువను సృష్టించడానికి దీర్ఘకాలిక వృద్ధిని సాధించడానికి మేధోసంపత్తిని అర్థం చేసుకుని ప్రోత్సాహాన్ని అందించ టం కీలకమని తెలిపారు. మీ విజయమే మా విజయమని, మీ ఎదుగుదల దేశం యొక్క అభివృద్ధికి గీటురాయి అని పేర్కొన్నారు. ఈ సమ్మిట్ గొప్ప విజయాన్ని సాధించాలని, వ్యవస్థాపక ప్రయాణంలో కొత్త శిఖరాలను చేరుకోవడానికి మీలో ప్రతిఒక్కరికీ స్ఫూర్తిని, శక్తినివ్వాలని ఆకాంక్షించారు.
అనంతరం కేఎల్ యూనివర్సిటీ ఇన్క్యుబేషన్ సెంటర్లో పలు వురు రూపొందించిన నూతన ఆవిష్కరణలను మంత్రి పరిశీలించి యూనివర్సిటీ చేస్తున్న కృషిని అభినందించారు. ఎలిప్ అధ్యక్షురాలు కన్నెగంటి రమాదేవి, నారీ శక్తి అవార్డ్ గ్రహీత కనకాల రమాదేవి, కేఎల్యూ కార్యదర్శి కోనేరు కాంచనలత, పారిశ్రామికవేత్త కె.శేషుబా బు సదస్సులో సందేశానిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ఔత్సాహిక మహిళా పారిశ్రా మికవేత్తలు, కేఎల్యూ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.