- వారిది ఉక్కు సంకల్పం.. మీరు ఏమీ చేయలేరు
- రైతుల ఉద్యమాన్ని అణచివేతలతో అడ్డుకోలేరు
- అమరావతికి అన్ని పార్టీల ఆమోదం ఉంది
- రాష్ట్ర ప్రయోజనాల కోసమే దీనిని ఎంపిక చేశాం
- హైదరాబాద్ మాదిరి అభివృద్ధి చేయాలని భావించా
- అమరావతి వివాదాలు – వాస్తవాలు పుస్తకావిష్కరణ
విజయవాడ : దేశచరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా వెయ్యి రోజులుగా అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం అజరామరం..వారిది ఉక్కుసంకల్పం.. రాష్ట్రంకోసం వారు చేసిన త్యాగాలు వృధాపోవు.. అమరావతిలో అంతిమంగా ధర్మమే గెలుస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ప్రముఖ పాత్రికేయుడు కందుల రమేష్ రాసిన ‘‘అమరావతి వివాదాలు-వాస్తవాలు’’ అనే పుస్తకాన్ని ఆయన గురు వారం విజయవాడలో ఆవిష్కరించారు. పుస్తకావిష్క రణ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, మేథావులు, రైతులు పాల్గొన్నారు. అమరావతి పాద యాత్ర ఉద్యమంపై రూపొందించిన గీతాల సిడిని చంద్రబాబు నాయుడు, జెఎసి నేతలు ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ..
సంపద కేంద్రంగా మార్చాలనే అమరావతి ఎంపిక
ఈరోజు తెలంగాణ అభివృద్దికి హైదరాబాద్ కీల కంగా ఉంది. చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ వల్ల ఆయా రాష్ట్రాలకు ఆదాయం పెరిగింది. అందుకే అమరావతి అనే కాన్సెప్ట్ తీసుకువచ్చాం. రైతులు ముందుకు వస్తే..వారి భాగస్వామ్యంతో రాజధాని కడదామని ఒక ఆలోచన చేశాం. ముందుగా రైతు లతో పలుమార్లు చర్చించాం.. ఆ రైతులలో అన్ని పార్టీల వారూ ఉన్నారు. అభివృద్దికి ఎన్నికలకు సబంధం లేదు.. నాడు ఖైరతాబాద్‌లో ఓడిపోయాం.. మొన్న తాడికొండలో ఓడిపోయాం. మంచి ప్యాకేజ్ ఇస్తే భూములు ఇవ్వడానికి సిద్దమే అని రైతులు అంగీకరించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ విధానం తీసుకువచ్చాం. రాష్ట్రంలో రెండు చివరి ప్రాంతాలకు మధ్యలో ఉన్న ప్రాంతం అమరావతి. గుంటూరు – విజయవాడ మధ్య సరైన ప్రాంతం అని గుర్తించాం.
నేను కావాలనుకుంటే తిరుపతిలో పెట్టలేనా?
నేను రాయలసీమ వాడిని.. నేను కావాలి అనుకుంటే నాడు తిరుపతిలో రాజధాని పెట్టుకునేవా డిని. విశాల దృక్పథంతో ఆలోచించి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక మంచి రాజధాని కట్టాలని సింగపూర్ వెళ్లి మాస్టర్ ప్లాన్ చేసి ఇవ్వమని అడిగా ను.. సహాయం చెయ్యమని కోరాను. నాడు సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా మాస్టర్ ప్లాన్ ఇవ్వడానికి అంగీకరించింది. రైతుల భూములకు ప్యాకేజ్ కింద నివాస భూమి ఇచ్చా, కమర్షియల్ ల్యాండ్ ఇచ్చాం. రాజధాని ప్రాంతంలో పేదలకు పెన్షన్లు కూడా ఇచ్చాం. ఈ రోజు అమరావతిని చూస్తే చాలా బాధ కలుగుతుంది. 1000 రోజులుగా రైతులు నిరసనలు చేస్తున్నారు. రైతుల ఉక్కుసంకల్పానికి అభినందనలు. అమరావతి ఉద్యమకారులను అడుగడుగునా వేధిం చారు. ఆడవాళ్లను అవమానించారు. అయినా ఉద్య మం ఆగలేదు. వెయ్యి రోజుల ఆందోళన ఎక్కడా జరగలేదు. ఇది అమరావతి రైతుల మొక్కవోని సంకల్పానికి నిదర్శనం.
అమరావతికి అన్నివర్గాల ఆమోదం
అమరావతి అనే పేరుపై అన్ని వర్గాలనుంచి ఆమోదం వచ్చింది. అమరావతిపై మాకు ఎటువంటి అభ్యంతరం లేదని నాడు వైసిపి నేతలు చెప్పారు. 30 వేల ఎకరాలు కావాలని జగన్ అన్నారు..మేము ఇంకా ఎక్కువే తీసుకున్నాం. విభజనతో వచ్చిన కేంద్ర సంస్థలను రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పెట్టాము. అభివృద్దిని వికేంద్రీకరించాం. అమరావతి పరిపాలన రాజధాని, వైజాగ్ ఆర్థిక రాజధాని, తిరుపతి పరిశ్రమ ల హబ్ చెయ్యాలి అనుకున్నాం. అమరావతి రైతుల త్యాగాలు వృధాపోవు. అమరావతి సంకల్పం చాలా ఉన్నతమైనది. ఐదుకోట్ల ప్రజల కోసం అమరావతి తలపెట్టాం. పవిత్రమైన మట్టి, పవిత్రమైన జలాల ద్వారా నాడు అమరావతికి తీసుకువచ్చాం. నాడు ప్రధాని యమునా జలం, పార్లమెంట్ మట్టిని తెచ్చారు. పార్లమెంట్ మీకు అండగా ఉంటుందని నాడు ప్రధాని చెప్పారు.
అమరావతి రూ.2లక్షల కోట్ల ఆస్తి
అనుకున్న ప్రకారం పనులు సాగితే అమరావతిలో రాజధాని కట్టిన తరువాత 8వేల నుంచి 10వేల ఎక రాలు ప్రభుత్వానికి మిగులుతుంది. నాడు కోకా పేట భూమి ఎకరా లక్ష రెండు లక్షలు ఉండేది. ఇప్పుడు 60 కోట్లు, 70 కోట్లు అయ్యింది. ఇప్పుడు అమరావతి ఉండి ఉంటే ఇక్కడ కూడా రెండు లక్షల కోట్ల విలువైన ఆస్తి అందుబాటులోకి వచ్చేది. ఇప్పటికీ ఉత్తరాంధ్ర నుంచి పనుల కోసం, ఉపాధి కోసం హైదరాబాద్ వెళుతున్నారు. అదే అమరావతి ఉండి ఉంటే ఇక్కడే ఉపాధి దొరికేది. అమరావతికి పెద్దగా నిధుల అవసరం కూడా లేదు. ఒక్క పైసా ఖర్చు లేకుం డా..సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ గా అమరావతిని రూపొందించాం. అమరావతిపై ఎన్నో అపవాదులు వేశారు..అన్నింటిని భరించాం. తెలుగు జాతికి అమరావతి లాంటి ఒక రాజధాని ఉండాలి. రాష్ట్రంలో ఏ వ్యక్తి శాశ్వతం కాదు..మనం చేసే పనులు శాశ్వతం.
పాలనవల్ల ప్రజలకు మేలు జరగాలి
మన చేసిన పాలన వల్ల రాజకీయ లబ్ది జరిగిందా..లేక ప్రజలకు మంచి జరిగిందా అని చూడాలి. నాడు మంత్రిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను ఇప్పుడే అడిగాను..ఎప్పుడైనా నాడు వైఎస్ఆర్ సైబారాబాద్‌ను నిలిపివెయ్యాలి అనుకున్నారా అని.. ఆయన ఎప్పుడూ వైఎస్ అలా ఆలోచన చెయ్యలేదు అన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు నా హయాంలో భూములు సేకరించా..తరువాత వచ్చిన వైఎస్ ఆర్ భూమిపూజ చేసి ప్రాజెక్టు పూర్తి చేశారు. నా తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు అంతా నాడు హైదరాబాద్ లో ప్రాజెక్టులు కొనసాగించారు. అందుకే నేడు హైదరాబాద్ ఆ స్థాయికి చేరింది. ఇప్పుడు ప్రజలంతా మనం చేసిన పనులు గుర్తు చేసుకావాల్సిన అవసరం లేదు..కానీ ఒక తృప్తి అనేది ఎప్పుడూ ఉంటుంది. నాడు హైదరాబాద్ తో పాటు విశాఖ, తిరుపతి, విజయవాడ, వరంగల్ వంటి పట్టణాలు కూడా అభివృద్ది కావాలని ఆశించాను. ఆదాయం ఇచ్చే హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళితే..మనకు ఆదాయం ఎలా అని ఇక్కడి ప్రజలు ఆలోచించారు. నాకు ఉన్న అనుభవాన్ని గుర్తించి 2014లో ప్రజలు నాకు అధికారం ఇచ్చారు.
తెలుగువారి భవిష్యత్తుకోసమే హైదరాబాద్ అభివృద్ధి
హైదరాబాద్, సికింద్రాబాద్‌కు విస్తరణలో సైబరాబాద్ నిర్మించాం. బిల్ క్లింటన్ వచ్చిన రోజునే సైబరాబాద్ అనే పేరు పెట్టాం. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఉన్నాయి. కేవలం తెలుగు ప్రజలు ఉన్నత ఉద్యోగావకాశాలు పొందాలన్న ఉద్దే శంతో సైబరాబాద్‌ను అభివృద్ధి చేశాం. పిపిపి పద్దతి లో నాడు హైటెక్ సిటీ కట్టాం..అక్కడినుంచి అభివృద్ది మొదలైంది. రైతుల పిల్లలు, కూలీల పిల్లలు కూడా ఐటి ఉద్యోగాలు చెయ్యాలని అన్నప్పుడు హేళన చేశారు. కానీ ఇప్పుడు అవన్నీ సాకారం అయ్యాయి. సాధారణ కుటుంబాల నుంచి కూడా ఉన్నత ఉద్యోగా లకు వెళ్లారు. అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే.. అక్కడ ఉన్న ఇండియన్స్ ఆదాయం డబుల్. ఏ దేశంలో అయినా ఎక్కువ ఆదాయం పొందే వారు ఇండియన్స్..వారిలో 30 శాతం మంది తెలుగు వారున్నారు.. ఇది తనకు ఆనందాన్ని కలిగిస్తోందని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.