- జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యమెందుకు?
- విచారణ ముందుకు సాగకుండా వందలాది డిశ్చార్జి పిటిషన్లు
- కేసుల దర్యాప్తులో అసాధారణ జాప్యంపై రఘురామ పిటిషన్
అమరావతి -చైతన్యరథం : తనకున్న దోపిడీ జబ్బు ఎదుటివారికి ఉన్నట్లుగా భ్రమించే విచిత్రమైన మానసికరోగంతో బాధపడుతూ రాజకీయ ప్రత్యర్థులను తప్పుడు కేసులతో వేధిస్తున్న సైకో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాపాలపుట్ట బద్దలవుతోంది. అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ బెయిల్ పై తిరుగుతున్న అంతర్జాతీయ గజదొంగ జగన్ కు సుప్రీంకోర్టు షాకిచ్చింది.జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణ అసాధారణ జాప్యాన్ని సవాల్ చేస్తూ ఎంపి రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎన్వీఎన్ భట్టిలతో సుప్రీం ధర్మాసనం జగన్ కేసులో విచారణ ఎందుకు ఆలస్యం అవుతోందని సీబీఐని ప్రశ్నించింది. విచారణ ఆలస్యానికి గల కారణాలు చెప్పాలంటూ దర్యాప్తు సంస్థకు నోటీసులు జారీ చేసింది. రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్‌ను ఎందుకు విచారించ కూడదో చెప్పాలని ఆదేశించింది. జగన్ సహా కేసులోని ప్రతివాదులందరికీ నోటీసులు జారీచేస్తూ. తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని లక్షకోట్లు, తాను అధికారంలోకి వచ్చాక జలగలా ప్రజలరక్తాన్ని తాగి మరో రెండున్నర లక్షలకోట్లు వెరసి ఇప్పటివరకు మూడున్నర లక్షలకోట్లు దోచుకున్న అవినీతి చక్రవర్తి జగన్ కు సమీపంలో షాక్ ట్రీట్ మెంట్ తప్పదని సంకేతాలు వెలువడుతున్నాయి.
అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ కు సుప్రీం కోర్టు షాకిచ్చింది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ దర్యాప్తు ఆలస్యంపై ఇవాళ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఎం వైఎస్ జగన్ తో పాటు దర్యాప్తు సంస్ధ సీబీఐకి కూడా సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో అసాధారణ జాప్యాన్ని సవాల్ చేస్తూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈ నోటీసు లు పంపింది. ఏపీలో సీఎంగా ఉన్న వైఎస్ జగన్ అక్ర మాస్తుల కేసు దర్యాప్తు నానాటికీ ఆలస్యమవుతోందని, తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో ఉన్న ఈ కేసు విచా రణ ముందుకు సాగకుండా జగన్‌తో పాటు ఇతర నిందితులు వందల కొద్దీ డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామ తన పిటిషన్‌లో ఆరోపించారు. అలాగే ఈ కేసును విచారిస్తున్న హైదరాబాద్ సీబీఐ కోర్టు ఇప్పటికే 3041సార్లు వాయిదా వేసిందని కూడా పేర్కొన్నారు. కేసు విచారణను హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోర్టులో పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎన్వీఎన్ భట్టిల ధర్మాసనం గురువారం విచారించింది. ఈ పిటిషన్ పై స్పందించిన సుప్రీంకోర్టు జగన్ కేసుల్లో విచారణ ఎందుకుఆలస్యం అవుతుందో చెప్పాలని అడి గింది. అలాగే జగన్ కేసుల్ని తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ రఘురామ చేసిన విజ్ఞప్తిపై స్పందించిన సుప్రీంకోర్టు.. రఘురామ బదిలీ పిటిషన్‌ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని కోరుతూ వైఎస్ జగన్‌తో పాటు సీబీఐకీ నోటీసులు పంపింది. జగన్ పై కేసుల విచారణలో జాప్యానికి గల కారణాలు వెల్లడిరచాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. అలాగే ఈకేసులో ఇతర 12మంది ప్రతివాదులకూ నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు..తదుపరి విచారణ ను వచ్చే ఏడాది జనవరి నెలకు వాయిదా వేసింది.
జగన్‌పై కేసుల వివరాలివీ!
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షకోట్లకు పైగా దోచుకున్న జగన్‌పై సిబిఐ 10, ఈడి 7 కేసులతోపాటు మరో 21 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి జగన్ సూట్‌కేసు కంపెనీలు ఏర్పాటుచేసి ఏవిధంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టారో వివరిస్తూ…11 చార్జిషీట్లు కూడా దాఖలయ్యాయి. ఈ కేసులకు సంబంధించి 2013నుంచి జగన్ షరతులతో కూడిన బెయిల్‌పై బయటతిరగుతున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి 43వేల కోట్ల దోపిడీ కేసులో తప్పించుకు తిరుగుతున్న జగన్… ఒక్కఛాన్స్ పేరుతో ప్రజలను నమ్మించి 2019లో అధికారపగ్గాలు కైవసం చేసుకు న్నారు. ప్రజలు ఒక గజదొంగ చేతికి రాష్ట్రఖజానా తాళాలు ఇవ్వడంతో గత నాలుగేళ్లుగా విచ్చలవిడి దోపిడీకి తెగబడ్డారు. 2004-09 మధ్య 1.03లక్షల కోట్లు దోచుకున్ జగన్… గత నాలుగున్నరేళ్ల పాలనలో మరో 2.55లక్షల కోట్లు దిగమింగారు. మొత్తంగా ఇప్పటివరకు రూ.3,58,500 కోట్లు దోచుకుని అంతర్జాతీయస్థాయి అవినీతి చక్రవర్తిగా పేరొందాడు.
జగన్‌పై సిబిఐ వేసిన ఛార్జిషీట్ల్లు
బహిరంగంగా 16 కంపెనీలకు, రహస్యంగా 50 సూట్ కేసు కంపెనీలకు అధిపతిగా ఉన్న జగన్‌పై తెలంగాణా సిబిఐ కోర్టులో 11ఛార్జిషీట్లు దాఖలయ్యాయి.
- మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో హెటిరో, అరబిందో కంపెనీలకు 250 ఎకరాల భూములు కేటాయించగా, క్విడ్ ప్రోకో ద్వారా ఆ కంపెనీలు సాక్షిలో రూ.29.50కోట్లు పెట్టుబడి పెట్టాయి. దీనిపై 31-3-2012లో చార్జిషీటు దాఖలైంది.
- పోలెపల్లి సెజ్ లో మరో 60ఎకరాలను హెటిరో, అరబిందో కంపెనీలకు దారిమళ్లించారు. ఇందుకు గాను మరో 66.30 కోట్లు జగన్ కంపెనీల్లో పెట్టు బడులు పెట్టారు. దీనిపై 23-4-2012న 2వ చార్జిషీటు దాఖలైంది.
- గ్రీన్ బెల్ట్ ఏరియా తగ్గించి రాంకీ సంస్థకు లబ్ధికలిగించినందుకు గాను, ఆ సంస్థ జగన్ కంపె నీల్లో 9.9 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. దీనిపై 7-5-2012న 3వ చార్జిషీటు దాఖలైంది.
- గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యంత విలువైన తీరప్రాంత భూములను వ్యాన్ పిక్‌కు కట్టబెట్టినం దుకు గానీ, ఆ సంస్థలో డైరక్టర్లుగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్, మరికొందరు జగన్ కంపెనీల్లో 854.40 కోట్లు పెట్టబడిగా పెట్టారు.దీనిపై 13-8-2012న 4వ చార్జిషీటు దాఖలైంది.
- కడపలో దాల్మియా సిమెంట్స్‌కు 1005 ఎకరాలు కట్టబెట్టారు. ఇందుకుగాను ఆ సంస్థ ప్రతినిధులు జగన్ కంపెనీల్లో 205కోట్లు పెట్టుబడిగా పెట్టారు. దీనిపై 8-4-2013న 5వ చార్జిషీటు దాఖలైంది.
- నిబంధనలకు విరుద్దంగా ఇండియా సిమెంట్స్ కు భూములు ధారాదత్తం చేసినందుకు గాను ఆ సంస్థ ప్రతినిధులు జగన్ కంపెనీలో 140కోట్లు పెట్టుబడిగా పెట్టారు. దీనిపై 10-9-2013న 6వ చార్జిషీటు దాఖలైంది.
- కడపజిల్లాలో తమ సొంత సంస్థ భారతీ సిమెంట్ కు నిబంధనలకు విరుద్దంగా 2037ఎకరాల సున్న పురాయి గనులను కేటాయించుకున్నారు. దీనిపై 10-9-2013న 7వ చార్జిషీటు దాఖలైంది.
- పెన్నా సిమెంట్స్‌కు ఆయాచిత లబ్ధి కలిగించనం దుకుగాను ఆసంస్థ జగన్‌కంపెనీల్లో రూ.68 కోట్లు పెట్టుబడిగా పెట్టింది.దీనిపై 10-9-2013న 8వ చార్జిషీటు దాఖలైంది.
- ఇందుటెక్‌కు 250ఎకరాల భూములను కట్టబెట్టి నందుకుగాను ఆ సంస్థ జగన్ కంపెనీల్లో 15కోట్లు పెట్టుబడిగా పెట్టింది.దీనిపై 17-9-2013న 9వ చార్జిషీటు దాఖలైంది.
- అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జి హబ్ పేరు తో ఇందూ గ్రూప్‌కు 8844 ఎకరాలు కేటాయిం చారు. ఆ సంస్థ ప్రతినిధులు జగన్ కంపెనీల్లో 70 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. దీనిపై 17-9-2013 న 10వ చార్జిషీటు దాఖలైంది.
- హౌసింగ్ పథకంలో ఇందు గ్రూప్‌కు ఆయాచిత లబ్ధి కలిగించినందుకుగాను జగన్ కంపెనీలకు మ రో 70కోట్లు పెట్టుబడులుగా వెళ్లాయి.ఇందుకుగా ను 11వ చార్జిషీటు 17-9-2013న దాఖలైంది.
- వ్యవస్థలను మేనేజ్ చేసి పదేళ్లుగా బెయిల్ పైనే!
జగన్‌రెడ్డి పదేళ్ల నుండి బెయిల్‌పై ఎలా ఉండగలి గారు కోర్టు వాయిదాలకు కూడా హాజరవ్వకుండా ఎలా మినహాయింపు పొందుతున్నారు? లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, శశికళ, డి.రాజా, కనిమొళి, సత్యం రామలింగరాజుపై మోపబడిన కుంభకోణాలతో పోల్చితే జగన్‌రెడ్డి కుంభకోణాల విలువ వెయ్యి రెట్లు ఎక్కువ.
జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్, బంగారప్ప, శిబుసోరెన్, ఓంప్రకాశ్ చౌతాల, మధుకోడా సీఎంలుగా ఉన్నప్పటికీ వారికి లేని మినహాయింపులు జగన్‌రెడ్డి ఎలా పొందగలుగుతున్నారు? లూటీ సొమ్ముతో, అధికార బలంతో, క్రిమినల్ చర్యలతో వ్యవస్థల్ని మేనేజ్ చేయడం కారణం కాదా? తాను వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ, దాన్ని కప్పిపెట్టుకోవడానికి తన దుష్ట లక్షణాలను టీడీపీకి అంటగట్టి చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారంటూ అబద్ధపు ప్రచారం చేస్తూ తన దుష్ట లక్షణాలను ఎదుటి వారికి అంటగట్టడం జగన్‌రెడ్డి నైజంగా వుంది.
దేశంలోనే అత్యంత ధనిక సిఎం సైకో జగన్!
అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫామ్స్ (ఎబిఆర్) రిపోర్టు ప్రకారం రూ.510కోట్ల అధికారిక ఆస్తులతో జగన్ దేశంలోనే అత్యంత ధనిక సిఎంగా ఉన్నారు. దేశంలోని మిగిలిన 29 రాష్ట్రాల సిఎంల ఆస్తుల విలువ రూ.508.47 కోట్లు అయితే, ఒక్క జగన్ ఆస్తులే రూ.510కోట్లు. లెక్కల్లో చూపని ఆస్తులతో కలిపితే ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం జగన్ ఆస్తులు రూ.3,58,500 కోట్లు. 2004లో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిఎం కాక ముందు జగన్ ఆస్తి కేవలం 1.73 కోట్లు మాత్రమే. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ సంపాదనతో లక్షలకోట్ల పోగేసిన జగన్ అవినీతి చరిత్ర ఒక అంతర్జాతీయ విశ్వవిద్యాలయం కేస్ స్టడీగా కూడా తీసుకుంది. జగన్, ఆయన కుటుంబసభ్యుల నికర ఆస్తుల విలువ 2021-22 లెక్కల ప్రకారం రూ.5,877కోట్లు. జగన్ అధికారంలోకి వచ్చాక భారతి సిమెంట్స్ రూ.768కోట్లు లాభాలను ఆర్జించింది. కరోనా మహమ్మారి వ్యాప్తిచెందిన తరుణంలో ప్రపంచంలోని అన్నిరంగాలు ఆర్థికమాంద్యంలోకి వెళ్లగా జగన్ రెడ్డి కంపెనీలు మాత్రం వేలకోట్ల లాభాలు ఆర్జించాయి. తండ్రి అధికారంలో ఉండగా క్విడ్ ప్రోకో-1కు పాల్పడిన జగన్, తాను అధికారంలోకి క్విడ్ ప్రోకో 2.0కు తెరలేపారు.
గజదొంగ జగన్‌పై కేసుల వివరాలు :
సిబిఐ గుర్తించిన అక్రమాస్తుల విలువ రూ.43వేల కోట్లు
- కేసులు నమోదైంది : 2012
- షరతులతో బెయిలిచ్చింది : 2013
- మొత్తం కేసులు : 38
- చార్జిషీట్లు : 11
- సిబిఐ కేసులు : 10
- ఈడి కేసులు : 7
- ఇతర కేసులు : 21
- డిశ్చార్జి పిటిషన్లు : 158
- ఇప్పటి వరకు వాయిదాలు : 3041
అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి కుటుంబ లూటీ వివరాలు :
- ల్యాండ్ మాఫియా : రూ.40,000 కోట్లు
- లిక్కర్ మాఫియా : రూ.41,000 కోట్లు
- మైనింగ్ మాఫియా : రూ.35,000 కోట్లు
- ఇసుక దోపిడి : రూ.40,000 కోట్లు
- సిలికా, బీచ్ శాండ్ దోపిడీ : రూ.10,000 కోట్లు
- భారతి సిమెంటు దోపిడీ : రూ.12,000 కోట్లు
- సాగునీటి ప్రాజెక్టులలో కమీషన్లు : రూ. 2,500 కోట్లు
- ఎర్రచందనం మాఫియా : రూ.25,000 కోట్లు
- లేపాక్షి, కూకట్‌పల్లి భూ కుంభకోణం : రూ.15,000 కోట్లు
- విద్యుత్ ఒప్పందాలు,కొనుగోళ్ల కమీషన్ : రూ.12,000 కోట్లు
- పోర్టుల్లో అవినీతి : రూ. 4,000 కోట్లు
- ప్రభుత్వ కొనుగోళ్లలో కమీషన్లు.
- (అంబులెన్స్‌లు, చెత్త వ్యాన్స్, బియ్యం వ్యాన్స్, మందుల
- కొనుగోళ్లు వగైరా) : రూ.10,000 కోట్లు
- గంజాయి, డ్రగ్స్ వాటా : రూ.10,000 కోట్లు
- అమూల్ కమీషన్ : రూ. 1,000 కోట్లు
- 2019`23 మధ్య సీఎంగా దోచుకున్న అక్రమ సంపాదన : రూ.2,55,500 కోట్లు
- 2004`09 మధ్య జగన్‌రెడ్డి కుటుంబ దోపిడీ : రూ.1,03,000 కోట్లు
- మొత్తం : రూ.3,58,500 కోట్లు