- టీడీపీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
- 105 అడుగుల ఎత్తులో జాతీయ జెండా
- ఆవిష్కరించిన పల్లా శ్రీనివాసరావు
మంగళగిరి(చైతన్యరథం) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాల యంలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. దేశంలోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యాధునిక ఎలక్ట్రానిక్ పద్ధతిలో 105 అడుగుల ఎత్తులోని జాతీ య జెండాను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆవి ష్కరించారు. జాతీయ జెండాను. ఎలక్ట్రానిక్ పద్ధతిలో రిమోట్ సహాయంతో ఆవిష్కరించేలా రూపొందించారు. జెండా ఆవిష్కరణ. అనంతరం నేతలందరూ కలిసి జాతీయ గీతాన్ని ఆలపించి అంబే ద్కర్, మహాత్మాగాంధీ, స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పరుచూరి అశోక్ బాబు, మాజీ మంత్రి, ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్ పర్సన్ పీతల సుజాత, మీడియా కోఆర్డినేటర్ దారపనేని సరేంద్రబాబు, నేతలు పరుచూరి కృష్ణ, వల్లూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం మన పార్లమెంట్ ఆమోదం పొంది అమల్లోకి వచ్చిన ఈ రోజు అత్యంత పవిత్రమైనది. నిన్ననే మనం జాతీయ ఓటర్ల దినోత్సవా న్ని జరుపుకున్నాం. ఎన్నికల ప్రక్రియను, రాజ్యాంగ బద్ధమైన ఓటు హక్కును గౌరవించడమే దీని ముఖ్య ఉద్దేశం. రాజ్యాంగ గొప్పత నాన్ని, దాని విలువలను భవిష్యత్ తరాలకు అందించడమే ఈ గణతంత్ర వేడుకల ప్రధాన లక్ష్యం. రాజకీయాల్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వాలి. పదవులు దక్కిన తర్వాత ప్రజల హక్కులను కాలరాసే విధంగా ప్రవర్తించడం రాజ్యాంగ విరుద్ధం. అంబేద్కర్ చెప్పినట్లుగా.. రాజ్యాంగం తన లక్ష్యాన్ని చేరాలంటే పాలకులు నిజాయితీగా, ప్రజాస్వామ్య విలువ లను కాపాడుతూ నడుచుకోవాలి.
గత ఐదేళ్ల పాలనలో మనం నియంతృత్వ పోకడలను చూశాం. అలాంటి వారికి ప్రజలు ఇప్ప టికే బుద్ధి చెప్పి పక్కన కూర్చోబెట్టారు. భారతదేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ ప్రతిఒక్కరూ ప్రాథమిక హక్కులను, న్యాయపర మైన హక్కులను కాపాడాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉన్నవారు, అధికారాన్ని ఆశించే వారు రాజ్యాంగాన్ని నిజాయితీగా అమలు చేసే ప్రయత్నం చేయాలి.
హక్కులను కాలరాసే వారికి భవిష్యత్తులోనూ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన నాటినుంచి నేటి వరకు గత 40 ఏళ్లుగా చంద్ర బాబు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీని నడిపిస్తున్న తీరు అందరికీ ఆదర్శం. యువ నాయకులు నారా లోకేష్ ఆలోచనలు కూడా అదే బాటలో ఉన్నాయి. మేమంతా రాజ్యాంగ హక్కులను, ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో ఎప్పుడూ. ముందుంటాం. రాజ్యాంగం ఏ ఉద్దేశంతో అయితే రూపొందించబడిందో, ఆ లక్ష్యాన్ని చేరుకునేలా తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.















