- 15 మంది కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ, ఆర్థికసాయం అందజేత
- బాధిత కుటుంబాల్లో పిల్లలను ఉచితంగా చదివిస్తామని భరోసా
- కుప్పంలో మూడు అన్న క్యాంటీన్లకు ప్రారంభోత్సవం
- మహిళలతో ముఖాముఖికి విశేష స్పందన
చిత్తూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముగిసిన నిజం గెలవాలి పర్యటన శుక్ర వారం ముగిసింది. ఈ నెల 20వ తేదీ నుండి నాలుగు రోజులు పాటు ఉమ్మడి చిత్తూరుజిల్లాలో భువనమ్మ పర్యటించా రు. కుప్పం, పలమనేరు, పుంగనూరు, పూతలపట్టు, చిత్తూరు, జీడీ నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో పర్యటించి నాలుగు రోజుల్లో 15 మంది కార్య కర్తల కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఒక్కో కుటుంబానికి ఆర్థిక సాయంగా రూ.3లక్షల చెక్కు అంద జేశారు.కుప్పం నియోజకవర్గంలో మూడు అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. కుప్పంలో ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ పేరుతో మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్య క్రమానికి మంచి స్పందన వచ్చింది. మృతిచెందిన కార్యకర్తల బిడ్డలకు ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చిన భువనమ్మ, అందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభించారు. ఉమ్మడి చిత్తూరుజిల్లా పర్యటన ముగించుకుని తిరుగు పయనమైన భువనమ్మ రేణిగుంట విమానాశ్రయం నుండి హైదరాబాద్ వెళ్లారు.