అమరావతి: అమ్మనే గెంటేసినవాడికి అంగన్వాడీల విలువ ఏం తెలుస్తుందని జగన్‌రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ అంగన్వాడీలు శాంతియుత నిరసనలు తెలపడం కూడా నేరమేనా అని ప్రశ్నించారు. అంగన్వాడీ ఉద్యమం పై సైకో సర్కార్ ఉక్కుపాదం మోపడం దారుణం. అంగన్వాడీల పై ఎస్మా ప్రయోగం, సమ్మె కాలానికి వేతనంలో కోత పెట్టడం.. జగన్ నియంత పోకడలకు పరాకాష్ట.
అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన జీఓ నెంబర్ 2 తక్షణమే ఉపసంహరించుకోవాలి. అంగన్వాడీల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. జగన్ అహంకారానికి..అంగన్వాడీల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఉద్యమంలో అంతిమ విజయం అంగన్వాడీలద అని లోకేష్ స్పష్టం చేశారు.