- అమరావతి ఉద్యమ ఫలం త్వరలోనే సిద్ధిస్తుంది
- రైతులకు, మహిళలకు ఉద్యమాభివందనాలు: లోకేష్
అమరావతి: అధర్మంపై ధర్మం విజయం సాధిస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉద్ఘాటించారు. రాజధాని అమరావతి కోసం అలుపెరుగని పోరు సాగిస్తున్న రైతులకు, మహిళలకు ఒక ప్రకటనలో లోకేష్ ఉద్యమాభివందనాలు తెలిపారు. ఉద్యమ ఫలం త్వరలోనే సిద్ధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులకు ఎదురొడ్డి అమరావతి నిలబడిరదన్నారు. ప్రజా రాజధాని కోసం 1500 రోజులుగా నియంతపై పోరాడుతున్న రైతులకు శిరస్సు వంచి మొక్కుతున్నానన్నారు. అమరావతి కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. వారి ఆశయం త్వరలోనే నేరవేరుతుందన్నారు. రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం జరుగుతుందన్నారు.