రాజోలు: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా 79 రోజుల సుదీర్ఘ విరామానంతరం రాజోలు నియోజకర్గం పొదలాడ నుంచి పునఃప్రారంభమైన యువనేత లోకేష్ 210వ రోజు యువగళం పాదయాత్ర దుమ్ములేపింది. పొదలాడ క్యాంప్ సైట్ నుండి సోమవారం ఉదయం 10.19 నిమిషాలకు యువనేత లోకేష్ పాదయాత్రను పునఃప్రారంభించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావుతోపాటు రాష్ట్రస్థాయి నాయకులంతా యువనేతకు సంఫీుభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు ఉమ్మడిగా యువగళం పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పొదలాడలో యువగళం పాదయాత్ర ప్రారంభం కాగానే పెద్దఎత్తున ప్రజలు యువనేతను చూసేందుకు రోడ్లపైకి వచ్చారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న భవనాల పైకి ఎక్కి లోకేష్ కి అభివాదం తెలిపారు. మధ్యాహ్నం తాటిపాక సెంటర్ లో నిర్వహించిన యువగళం బహిరంగసభకు జనం పోటెత్తారు ఇరుపార్టీల శ్రేణుల నినాదాలతో తాటిపాక బహిరంగసభ పరిసరాలు దద్దరిల్లాయి. కోనసీమ నలుమూలల నుంచి భారీఎత్తున జనం సభకు హాజరయ్యారు. సభ అనంతరం దారిపొడవునా వివిధ గ్రామాల ప్రజలు యువనేతకు ఎదురేగి స్వాగతం పలికి తమ సమస్యలు చెప్పుకున్నారు. సాయంత్రం బోడసకుర్రు బ్రిడ్జిపై జనసేన కార్యకర్తలు పెద్దఎత్తున ఎదురేగి స్వాగతం పలికారు. బ్రిడ్జిపైన యువగళానికి సంఫీుభావంగా జనసేన, యువగళం జెండాలతో లోకేష్‌ను స్వాగతించారు. టీడీపీ, జనసేన కార్యకర్తల రాకతో బోడసకుర్రు బ్రిడ్జిపై ట్రాఫిక్ స్తంభించింది. బ్రిడ్జి పొడవునా యువనేతను స్వాగతిస్తూ జనసేన, టీడీపీ కార్యకర్తలు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. యువనేతకు సంఫీు భావంగా నినాదాలు చేస్తూ అభిమానులు, కార్యకర్తలు యువనేతతో కలిసి అడుగులు వేశారు. పొదలాడలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర… తాటిపాక సెంటర్, పి.గన్నవరం నియోజకవర్గం నగరం, మామిడికుదురు, అప్పనపల్లి, పాశర్లపూడి, అమలాపురం నియోజకవర్గం బోడసకుర్రుమీదుగా పేరూరు శివారు విడిది కేంద్రానికి చేరుకుంది. 210వ రోజు యువనేత లోకేష్ 15.4 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2867.8కి.మీ.ల మేర పూర్తయింది. మంగళవారం అమలా పురం, ముమ్మడివరం అసెంబ్లీ నియోజకర్గాల్లో పాదయాత్ర కొనసాగనుంది.