- చివరిరోజు జాతరలా సాగిన యువగళం పాదయాత్ర
- యాత్రలో పాల్గొన్న భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు
- గాజువాక, శివాజీనగర్ లో పైలాన్ ను ఆవిష్కరించిన యువనేత
గాజువాక: జనగళమే యువగళమై 226 రోజులపాటు అప్రతిహతంగా కొనసాగిన యువనేత నారా లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయింది. కార్యకర్తలు, అభిమానుల జయజయధ్వానాల నడుమ గాజువాక ప్రకాష్ నగర్ లో సోమవారం సాయంత్రం పాదయాత్ర విజయవంతమైనందుకు గుర్తుగా నారా లోకేష్ పైలాన్ ను ఆవిష్కరించారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర ఎక్కడైతే ముగించారో అక్కడే లోకేష్ యువగళం పాదయాత్రను కూడా ముగించారు. ఈ సందర్భంగా జై లోకేష్, జై తెలుగుదేశం నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. సోమవారం ఉదయం సిడబ్యుసి-1 నుంచి ప్రారంభమైన పాదయాత్ర కార్యకర్తలు, అభిమానుల కోలాహలం నడుమ ఉత్సాహంగా సాగింది. అడుగడుగునా జివిఎంసి ప్రజలు యువనేతకు నీరాజనాలు పట్టారు. 226వ రోజు పాదయాత్రలో లోకేష్ తో కలిసి తల్లి నారా భువనేశ్వరి, అత్త నందమూరి వసుంధరా దేవి, ఇతర కుటుంబసభ్యులు అడుగులు వేశారు. వివిధరకాల నృత్యాలు, గరగలు, డప్పులచప్పుళ్లు, బాణాసంచా మోతలతో యువగళం దద్దరిల్లింది. మధ్యాహ్నం భోజన విరామానంతరం గాజువాక నియోజకవర్గం జివిఎంసి వడ్లమూడి జంక్షన్ నుంచి పాదయాత్ర ప్రారంభించగా, సంఫీుభావంగా వేలాది ప్రజలు కలిసి నడిచారు.
ఈ సందర్భంగా గాజువాక ప్రధాన రహదారి జనసంద్రంగా మారింది.ముగింపు కార్యక్రమంలో తల్లి నారా భువనేశ్వరి, నందమూరి వసుంధరాదేవి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు, ఉభయగోదావరి జిల్లాల సమన్వయ కర్త ప్రత్తిపాటి పుల్లారావు, భరత్, మాజీమంత్రులు కొల్లు రవీంద్ర, అమర్ నాథ్ రెడ్డి, టిడి జనార్దన్, వంగలపూడి అనిత, ఎమ్మెల్యే లు వెలగపూడి రామకృష్ణ, గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు, మాజీ మంత్రి కోండ్రు మురళి, గాజువాక ఇన్ చార్జి పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాబు, జ్యోతుల నవీన్, తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తల నినాదాలు, బాణాసంచా మోతలతో పైలాన్ ఆవిష్కరణ ప్రాంతం దద్దరిల్లింది. జై తెలుగుదేశం, జయహో లోకేష్ నినాదాలతో శివాజీనగర్‌లోని పైలాన్ ఆవిష్కరణ ప్రదేశం హోరెత్తింది. యువనేతపై అభిమానులు పూలవర్షం కురిపించారు. కార్యకర్తల నినాదాలు, కేరింతలతో గాజువాక శివాజీనగర్ మారుమోగింది. యువనేతతో కలసి నడిచేందుకు యువతీయువకులు, మహిళలు పోటీపడ్డారు. రాష్ట్రం నలుమూలల నుంచి టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. గాజువాక ప్రధాన రహదారిపై 2 కి.మీ.ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారిపొడవునా యువనేతను చూసేందుకు జనం బారులు తీరారు. యువనేతకు సంఫీుభావంగా ప్లకార్డులు చేతబూని స్టీల్ ప్లాంట్ కార్మికులు యాత్రలో పాల్గొన్నారు. యువనేత పాదయాత్రకు సంఫీుభావంగా రైతులు, వివిధరంగాల కార్మికులు, మహిళలు పాదయాత్రలో పాల్గొన్నారు.
యువగళం చివరిరోజైన 226వరోజు యువనేత లోకేష్ 13 కి.మీ.ల పాదయాత్ర చేశారు. మొత్తం 226 రోజుల్లో 3132 కి.మీ.ల మేర సాగిన యువగళం పాదయాత్ర అరాచక పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో సంపూర్ణంగా విజయం సాధించింది. మరికొద్ది నెలల్లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సాధించబోయే తిరుగులేని విజయాలకు చారిత్రాత్మక యువగళం పాదయాత్ర పునాది వేసింది. యువగళం పాదయాత్ర విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఈనెల 20వ తేదీ సాయంత్రం 3 గంటలకు భోగాపురం సమీపంలోని పోలిపల్లి వద్ద యువగళం ` నవశకం పేరిట భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈ సభకు చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ , బాలకృష్ణతోపాటు అతిరథ మహారధులంతా హాజరుకానున్నారు.
యువనేత లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్
బిసిలు బ్యాక్ బోన్ అంటూనే వెన్నువిరుస్తావా సైకో జగన్?
ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైకోఇజానికి బలైన ఓ బిసి నాయకుడి భవనం. గ్రేటర్ విశాఖ గాజువాక సెంటర్లో అన్ని అనుమతులు, నిబంధనల మేరకే టిడిపి సీనియర్ నేత, బిసినాయకుడు పల్లా శ్రీనివాసరావు తమ సొంతస్థలంలో భవనాన్ని నిర్మించుకున్నారు. శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాడని కక్షగట్టిన సైకో జగన్… 2020లో కుంటిసాకులతో ఆయన నిర్మించుకున్న భవనాన్ని కూల్చివేశారు. బిసిలు బ్యాక్ బోన్ అంటూ వేదికపై లెక్చర్లు ఇస్తున్న జగన్… నాలుగున్నరేళ్ల పాలనలో అడుగడుగునా బిసిలపై అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు. బిసిల ఆస్తులను ధ్వంసం చేయడమేగాక రాష్ట్రవ్యాప్తంగా 26వేలమంది బిసిలపై తప్పుడు కేసులు బనాయించారు. ఎంతోమంది అమాయక బిసి సోదరులను పొట్టనబెట్టుకున్నాడు. ఎస్సీ, ఎస్టీ, బిసిల ఓట్లతో అధికారం చేపట్టిన జగన్… వారిపైనే ఉక్కుపాదం మోపుతూ రాక్షసానందం పొందుతున్నాడు. నియంతపాలనకు సాక్షీభూతంగా నిలుస్తున్న ఈ శిథిలాలతోనే బిసిలంతా కలసి నీ అరాచక ప్రభుత్వానికి పాడెకట్టడం ఖాయం…రాసిపెట్టుకో జగన్మోహన్ రెడ్డీ!!
బిల్డప్ బాబాయ్ కబుర్లొద్దు… ముందు రోడ్లు వెయ్యి జగన్!
ఇది రాష్ట్రంలోని మారుమూల ఏజన్సీ ప్రాంతంలోని పాడుబడ్డ రహదారి కాదు. అక్షరాలా గ్రేటర్ విశాఖ పరిధిలో నిత్యం ట్రాఫిక్ తో రద్దీగా ఉండే స్టీల్ ప్లాంట్ సమీపంలోని గాజువాక కణితిరోడ్డు. ప్రజల నుంచి పన్నుమీద పన్నుతో కోట్లాదిరూపాయలు దోచుకుంటున్న సైకో ప్రభుత్వం విశాఖలాంటి మెట్రోపాలిటన్ నగరాల్లో రోడ్ల మరమ్మతులు కూడా చేయకుండా గాలికొదిలేసింది. విశాఖ మహానగర రోడ్లపై తట్టమట్టి పోయడం చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి… రాజధాని చేసేస్తానంటూ బిల్డప్ బాబాయ్ కబుర్లు చెబుతున్నాడు. 10 కి.మీ.ల దూరానికి హెలీకాప్టర్ లో వెళ్లే ఈ రిచెస్ట్ సిఎంకి నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు తెలుస్తాయా? ఆలోచించండి విశాఖ ప్రజలారా…!
2) నియంతృత్వంపై ప్రజాయుద్ధమే యువగళం
-పాదయాత్ర ముగింపు తర్వాత లోకేష్ సందేశం
భాగస్వామ్యం వహించిన ప్రజలకు ధన్యవాదాలు
నియంతృత్వంపై ప్రజా యుద్ధమే యువగళం.. అణిచివేతకు గురైన వర్గాల గొంతుకైంది మన యువగళం.. ప్రజాగళమై, ప్రజలే బలమై 226 రోజులు, 3132 కి.మీ పాదయాత్ర నిర్విరామంగా కొనసాగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉద్ఘాటించారు. అసమర్థుడు గద్దెనెక్కి ప్రజాస్వామ్యంపై చేసిన దాడి, వ్యవస్థల విధ్వంసాన్ని కళ్లారా చూసాను. భవిష్యత్తుపై ఆశలు కోల్పోయిన యువతకు భరోసా ఇచ్చాను. అందరి సహకారంతో యువగళం పాదయాత్రను దిగ్విజయంగా గాజువాక నియోజకవర్గం అగనంపూడి వద్ద ముగిస్తున్నాను. పాదయాత్రలో నేను ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంటాను. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాను. యువగళం పాదయాత్రలో భాగస్వామ్యం అయిన ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అని లోకేష్ తన సందేశంలో పేర్కొన్నారు.
3) యువగళం సైనికులకు కృతజ్ఞతాభినందనలు
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనపై ప్రజాచైతన్యమే లక్ష్యంగా ఈ ఏడాది జనవరి 27వతేదీన కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంతనుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర… 226రోజులు, 3132 కి.మీ.ల మేర అవిశ్రాంతంగా కొనసాగి విశాఖజిల్లా అగనంపూడి వద్ద దిగ్విజయంగా పూర్తయింది. ఈ సుదీర్ఘమైన మజిలీలో యువగళం పవిత్రయజ్ఞాన్ని ముందుకు నడిపించడంలో యువగళం కమిటీల పాత్ర అనిర్వచనీయం. అధికారపార్టీ సైకోలు ఎన్నో కవ్వింపు చర్యలకు పాల్పడినా సంయమనతో లక్ష్యాన్ని చేరుకునేందుకు సహకరించారు. యాత్ర కొనసాగుతున్న సమయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రేయింబవళ్లు నా వెన్నంటే ఉంటూ సేవలందించారు. దాదాపు ఏడాదిపాటు కుటుంబాలకు దూరంగా మీరు అందించిన సేవలు జీవితంలో మరువలేను. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ సాధించబోయే అప్రతిహతమైన విజయాలకు మన యువగళం పునాది వేసింది. మరో 3నెలల్లో చంద్రన్న నేతృత్వాన ఏర్పాటయ్యే ప్రజాప్రభుత్వం మీకు అండగా నిలుస్తుంది. చారిత్రాత్మకమైన యువగళం క్రతువులో భాగస్వాములైన ప్రధాన సమన్వయకర్త కిలారి రాజేష్, వివిధ కమిటీల సమన్వయకర్తలు, సభ్యులకు నా కృతజ్ఞతాభినందనలు.
` నారా లోకేష్, టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి.
యువగళం విజయవంతంలో కీలకపాత్ర వహించిన కమిటీలు:
- యువగళం మెయిన్ కోఆర్డినేటర్ ` కిలారు రాజేష్.
- వ్యక్తిగత సహాయక బృందం ` తాతా నరేష్, కుంచనపల్లి వినయ్, పిన్నింటి మూర్తి.
- వాలంటీర్స్ కమిటీ ` అనిమిని రవినాయుడు, మానం ప్రణవ్ గోపాల్.
- ఫుడ్ కమిటీ ` మద్దిపట్ల సూర్యప్రకాష్, లక్ష్మీపతి.
- మీడియా కమిటీ ` మెయిన్ కో-ఆర్డినేటర్ బి.వి.వెంకటరాముడు, కాసరనేని జశ్వంత్.
- పబ్లిక్ రిలేషన్స్ కమిటీ ` కృష్ణారావు, కిషోర్, మునీంద్ర, చల్లా మధుసూధన్ రావు ఫోటోగ్రాఫర్స్: సంతోష్, శ్రీనివాస్, కాశీప్రసాద్.
- అలంకరణ కమిటీ ` బ్రహ్మం చౌదరి, మలిశెట్టి వెంకటేష్.
- అడ్వాన్స్ టీమ్ కమిటీ ` డూండీ రాకేష్, నిమ్మగడ్డ చైతన్య, శ్రీరంగం నవీన్ కుమార్, చంద్రశేఖర్, నారాయణస్వామి, కోలా రంజిత్ కుమార్, ప్రత్తిపాటి శ్రీనివాస్.
- రూట్ కోఆర్డినేషన్ కమిటీ ` కస్తూరి కోటేశ్వరరావు (కెకె), కర్నాటి అమర్నాథ్ రెడ్డి.
- కరపత్రాల పంపిణీ కమిటీ ` అడుసుమిల్లి విజయ్, వెంకటప్ప, వంశీ, చీరాల నరేష్, యార్లగడ్డ మనోజ్.
- సెల్ఫీ కోఆర్డినేషన్ కమిటీ ` వెల్లంపల్లి సూర్య, శ్రీధర్ చౌదరి, ప్రదీప్.
- వసతుల కమిటీ ` జంగాల వెంకటేష్, నారా ప్రశాంత్, లీలాధర్, బాబి, రమేష్.
- తాగునీటి వసతి కమిటీ ` భాస్కర్, చిరుమాళ్ల వెంకట్, అనిల్.
- సోషల్ మీడియా – అర్జున్
ఆర్థిక ఇబ్బందులతో వృత్తిలో వెనుకబడుతున్నాం: న్యాయవాదులు
గాజువాక టీఎస్‌ఆర్ అండ్ టీబీకే కళాశాల వద్ద న్యాయవాదులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. న్యాయవాదులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా వృత్తిలో వెనుకబడిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది న్యాయవాదుల పరిస్థితి ఇలాగే ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక న్యాయవాదుల సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలి.
ఆర్థికంగా వెనుకబడిన న్యాయవాదులకు వృత్తినైపుణ్యం, ఆఫీస్, లైబ్రరీ ఏర్పాటుకు ఆర్థికసాయం చేయాలి. సొంతిల్లు లేని న్యాయవాదులకు ప్రభుత్వ ఇల్లు మంజూరు చేయాలి.
రానున్న ఎన్నికల టీడీపీ మ్యానిఫెస్టోలో న్యాయవాదుల సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలి. జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇవ్వాలి. లైబ్రరీ కోసం ఆర్థికసాయం చేయాలి. జూనియర్ న్యాయవాదులకు వృత్తిపరమైన నైపుణ్యం కోసం శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలి. మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు రూ.10లక్షలు ఆర్థికసాయం అందించాలి.
క్రమం తప్పకుండా భృతి, మెరుగైన లైబ్రరీ, వృత్తి శిక్షణ ఇస్తాం
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక న్యాయవాదులు, న్యాయమూర్తులకు రక్షణ కరువైంది. వైసీపీ దుర్మార్గాలను నిలదీసే న్యాయవాదులు, న్యాయమూర్తులపై పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో దాడులకు పాల్పడుతోంది. హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే ఏపీ సీఐడీ నేటికీ పట్టించుకోలేదు. ప్రభుత్వ దోపిడీపై కోర్టుల్లో వాదించే లాయర్లపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. అధికారంలోకి వచ్చాక జూనియర్ న్యాయవాదులకు క్రమం తప్పకుండా భృతితోపాటు మెరుగైన లైబ్రరీ, జీవితబీమా సౌకర్యం కల్పిస్తాం. వృత్తి శిక్షణ కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.